అకిరా నందన్ బాధ్యతలు తీసుకుంటున్న రామ్ చరణ్..

Pawan son Akira Nandan: పవన్ కళ్యాణ్ వారసుడు అప్పుడే వస్తున్నాడా అని ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు పవన్ వారసుడిని చూస్తే అలాంటి అనుమానాలు కూడా రావు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 21, 2020, 5:42 PM IST
అకిరా నందన్ బాధ్యతలు తీసుకుంటున్న రామ్ చరణ్..
రామ్ చరణ్ అకిరా నందన్
  • Share this:
పవన్ కళ్యాణ్ వారసుడు అప్పుడే వస్తున్నాడా అని ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు పవన్ వారసుడిని చూస్తే అలాంటి అనుమానాలు కూడా రావు. హీరోకు కావాల్సిన ఫిజిక్.. ఉండాల్సిన లక్షణాలు అప్పుడే తెచ్చేసుకున్నాడు అకీరా నందన్. పవన్ రెగ్యులర్‌గా సినిమాలు చేయడం లేదు.. అప్పుడే సినిమాలు అంటాడు.. మరోసారి రాజకీయాలు అంటాడు. దాంతో ఆయన అభిమానులకు ఏదో తెలియని లోటు కనిపిస్తూనే ఉంది. మెగా కుటుంబంలో ఎంతమంది హీరోలు సినిమాలు చేసినా కూడా పవన్ సినిమాలు రావడం లేదనే బాధ వాళ్లలో కనిపిస్తుంది. ఎంత మంది హీరోలొచ్చినా పవన్ సినిమా వచ్చినపుడు ఉండే పండగ వేరు.

Pawan Kalyan son Akira Nandan all set to entry into Tollywood and His debut movie getting ready pk పవన్ కల్యాణ్ సినిమాలకు దూరంగా ఉన్నాడు.. దాంతో ఇప్పుడు ఆయన అభిమానులకు ఏదో తెలియని లోటు కనిపిస్తూనే ఉంది. మెగా కుటుంబంలో ఎంతమంది హీరోలు సినిమాలు చేసినా కూడా పవన్.. pawan kalyan,pawan kalyan movies,pawan kalyan janasena,pawan kalyan twitter,pawan kalyan son akira nandan,akira nandan twitter,akira nandan movies,akira nandan debut movie,akira nandan renu desai,akira nandan debut movie konidela production company,akira nandan debut movie ram charan,akira nandan ram charan,akira nandan 1st movie,akira nandan hero entry,telugu cinema,akira nandan ishq wala love,అకిరా నందన్,పవన్ కల్యాణ్,పవన్ కల్యాణ్ అకిరా నందన్,అకిరా నందన్ తొలి సినిమా,అకిరా నందన్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ డెబ్యూ మూవీ,తెలుగు సినిమా
రేణు దేశాయ్‌తో కుమారుడు అకిరా నందన్ Photo: Instagram

పవర్ స్టార్ సినిమాలకు ఉన్న క్రేజ్ అలాంటిది. ఆయన సినిమాలు హిట్టైనా.. ఫ్లాప్ అయినా కూడా అభిమానులు మాత్రం అలా వేచి చూస్తుంటారు. ఇక ఇప్పుడు ఈయన సినిమాలతో బిజీగా ఉన్నాడు.. దాంతో పాటు తనయుడిని సిద్ధం చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. పవన్ కొడుకు అకిరా నందన్ సినిమాల్లోకి రాబోతున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే ఆరడుగుల హైట్‌తో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు జూనియర్ పవర్ స్టార్. ఈ మధ్యే బయటికి వచ్చిన అకీరా ఫోటోలు చూసి ఫ్యాన్స్ పరేషాన్ అయ్యారు. పవన్ కల్యాణ్‌ను కూడా మించిపోయాడు అకీరా. వరుణ్ తేజ్ హైట్ కూడా అకీరా ముందు పనికొచ్చేలా కనిపించడం లేదు. ఇప్పుడు ఈయన తొలి సినిమాకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు వార్తలొస్తున్నాయి.

Pawan Kalyan son Akira Nandan all set to entry into Tollywood and His debut movie getting ready pk పవన్ కల్యాణ్ సినిమాలకు దూరంగా ఉన్నాడు.. దాంతో ఇప్పుడు ఆయన అభిమానులకు ఏదో తెలియని లోటు కనిపిస్తూనే ఉంది. మెగా కుటుంబంలో ఎంతమంది హీరోలు సినిమాలు చేసినా కూడా పవన్.. pawan kalyan,pawan kalyan movies,pawan kalyan janasena,pawan kalyan twitter,pawan kalyan son akira nandan,akira nandan twitter,akira nandan movies,akira nandan debut movie,akira nandan renu desai,akira nandan debut movie konidela production company,akira nandan debut movie ram charan,akira nandan ram charan,akira nandan 1st movie,akira nandan hero entry,telugu cinema,akira nandan ishq wala love,అకిరా నందన్,పవన్ కల్యాణ్,పవన్ కల్యాణ్ అకిరా నందన్,అకిరా నందన్ తొలి సినిమా,అకిరా నందన్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ డెబ్యూ మూవీ,తెలుగు సినిమా
పవన్ కళ్యాణ్ అకీరా నందన్

ఇప్పటికే అకిరా మరాఠీలో ఓ సినిమా చేశాడు. రేణు దేశాయ్ తెరకెక్కించిన ఇష్క్ వాలా లవ్ సినిమాలో అకీరా నటించాడు. దీన్ని తెలుగులో అనువదించాలని చూస్తున్నారు. దాంతో పాటు పవన్ వారసున్ని నేరుగానే ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. మరికొన్ని రోజుల్లోనే దీనిపై వివరాలు బయటికి రానున్నాయి. ఒకవేళ పవన్ వారసుడి ఎంట్రీ ఖరారైతే దాన్ని ఎవరు నిర్మిస్తారు.. దర్శకుడు ఎవరనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. ఇండస్ట్రీలో ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ తన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీలోనే అకీరా తొలి సినిమాను నిర్మిస్తాడని తెలుస్తుంది. సొంత నిర్మాణ సంస్థలోనే తమ్ముడు సినిమా ఉండబోతుందనే ప్రచారం అయితే జరుగుతుంది.
First published: March 21, 2020, 5:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading