RAM CHARAN TO DO A SMALL ROLE IN PAWAN KALYAN KRISH MOVIE ALONG WITH CHIRANJEEVI ACHARYA PK
చిరంజీవితో పాటు పవన్ సినిమాలో కూడా చరణ్ గెస్ట్ రోల్..?
రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ (ram charan pawan kalyan)
Ram Charan Pawan Kalyan: రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ మరికొన్ని రోజుల్లో మొదలు కానుంది. అది మొదలైన వెంటనే షూటింగ్ పూర్తి చేయాలని..
రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ మరికొన్ని రోజుల్లో మొదలు కానుంది. అది మొదలైన వెంటనే షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నాడు రాజమౌళి. మరోవైపు రామ్ చరణ్ మాత్రం ఇతర సినిమాలు కూడా ఒప్పుకుంటున్నాడు. ఇప్పటికే తండ్రి చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య సినిమాలో అతిథి పాత్రలో నటించబోతున్నాడు. ఇందులో అరగంట పాటు ఈయన పాత్ర ఉండబోతుంది. చనిపోయే పాత్రలో చరణ్ నటిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా చరణ్ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ (pawan kalyan ram charan)
క్రిష్ కాంబినేషన్లో పవన్ హీరోగా నటిస్తున్న విరూపాక్ష (వర్కింగ్ టైటిల్) సినిమాలో రామ్ చరణ్ కూడా కనిపించబోతున్నాడని తెలుస్తుంది. సినిమాల్లోకి రాకముందు నుంచే రామ్ చరణ్‌కు క్రిష్ మంచి స్నేహితుడు. దానికితోడు అక్కడున్నది పవన్ బాబాయ్.. దాంతో అడిగితే కాదనలేకపోయాడని తెలుస్తుంది. సినిమాలో మరీ పెద్ద పాత్రేమీ కాదు.. సైరా నరసింహారెడ్డిలో అనుష్క మాదిరే ఉండే స్టోరీ డ్రివెన్ రోల్ అని తెలుస్తుంది.
రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ (pawan kalyan ram charan)
పవన్, క్రిష్ సినిమా కోహినూర్ వజ్రం కాలం నాటి కథతో వస్తుంది. పవన్ పాత్రను పరిచయం చేసి.. ఆయన ప్రయాణం గురించి చెప్పే పాత్రలో రామ్ చరణ్ నటిస్తాడని తెలుస్తుంది. దీనిపై మెగా వర్గాల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ అన్నీ కుదిరి రామ్ చరణ్, పవన్ కాంబినేషన్ వర్కవుట్ అయితే అభిమానులకు పండగే.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.