ఆ విషయంలో బాబాయ్‌కు అండగా అబ్బాయ్..

రామ్‌చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఆర్ ఆర్ ఆర్‌లో నటిస్తున్నాడు.

news18-telugu
Updated: July 2, 2020, 1:11 PM IST
ఆ విషయంలో బాబాయ్‌కు అండగా అబ్బాయ్..
రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ Photo : Twitter
  • Share this:
రామ్‌చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఆర్ ఆర్ ఆర్‌లో నటిస్తున్నాడు. పిరియాడిక్ ఫిక్షన్ డ్రామా జానర్‌లో వస్తోన్న ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నాడు. చరణ్ అల్లూరి సీతరామరాజుగా కనిపించనుండగా.. ఎన్టీఆర్ తెలంగాణ వీరుడు కొమరం భీమ్ పాత్రలో అదరగొట్టనున్నాడు. దాదాపు 80 శాతం వరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా కరోనా లాక్ డౌన్ వల్ల వాయిదా పడింది. నెక్ట్స్ షెడ్యూల్ పూనేలో మొదలుకానుందని తెలుస్తోంది. అది అలా ఉంటే చరణ్ ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం 'ఆచార్యలో కూడా నటిస్తోన్న సంగతి తెలిసిందే. 'ఆచార్య'చిత్రంలో గెస్ట్ పాత్రను పోషిస్తున్న చరణ్, తన బాబాయ్ పవన్ కళ్యాణ్ విరూపాక్షలో కూడా అతిథి పాత్రలో మెప్పించబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ హీరోగా ఓ పీరియాడిక్ మూవీ రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ కీలక పాత్రలో చరణ్ నటించే అవకాశాలున్నాయని టాక్‌. ఇదే కనుక నిజమైతే మెగాభిమానులకు పండగే. ఇక ఈ సినిమాతో చరణ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడని, త్రివిక్రమ్ దర్శకత్వంలో మరోసినిమా చేయనున్నాడని సమాచారం.
First published: July 2, 2020, 1:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading