కొత్త సినిమాలో చిరంజీవి‌తో చరణ్... అదిరిన కాంబినేషన్..

మెగాస్టార్‌ చిరంజీవి, ఆయన కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ మరోసారి కలిసి నటించనున్నారు.

news18-telugu
Updated: January 12, 2020, 3:10 PM IST
కొత్త సినిమాలో చిరంజీవి‌తో చరణ్... అదిరిన కాంబినేషన్..
Twitter
  • Share this:
మెగాస్టార్‌ చిరంజీవి, ఆయన కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ మరోసారి కలిసి నటించనున్నారు. ఈ ఇద్దరూ ఇంతకుముందోసారి రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మగధీర’ చిత్రంలో కలిసి నటించారు. ఆ సినిమాలో చిరంజీవి అతిథి పాత్రలో మెరిసి మెప్పించారు. మరోసారి చిరంజీవి హీరోగా వచ్చిన ‘ఖైదీనంబర్‌: 150’ సినిమాలోని ఓ పాటలో రామ్‌ చరణ్‌ తన డ్యాన్సులతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ముచ్చటగా మూడోసారి చిరంజీవి చరణ్ కలిసి సందడి చేయబోతున్నారని టాక్. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఈ చిరు చెర్రీ కలిసి నటించనున్నారని సమాచారం. ఈ సినిమాలో చరణ్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. అందులో భాగంగా ఈ సినిమా కోసం చెర్రీ 15 రోజుల కాల్షీట్లు కూడా ఇచ్చారట. ఏప్రిల్‌ నుంచి ఆయన ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా త్రిష నటించనున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం చరణ్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న తెలుగు వీరుల కథ ఆర్ ఆర్ ఆర్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వికారాబాద్ అడవుల్లో జరుగుతోంది.
అదిరిపోయే ఫిగర్‌తో కవ్విస్తోన్న నివేథా పేతురాజ్...
Published by: Suresh Rachamalla
First published: January 12, 2020, 3:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading