తమిళ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..

‘రంగస్థలం’ సినిమాతో నటుడిగా రామ్ చరణ్‌కు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్.. రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా తర్వాత రామ్ చరణ్..

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: October 23, 2019, 8:57 AM IST
తమిళ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..
రామ్ చరణ్ (Facebook/Photo)
  • Share this:
‘రంగస్థలం’ సినిమాతో నటుడిగా రామ్ చరణ్‌కు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్.. రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్.. చారిత్రక యోధుడైన అల్లూరి సీతారామరాజు పాత్రను చేస్తున్నాడు.  ఈ సినిమా వచ్చే యేడాది జూలై 30న విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత .. తండ్రి చిరంజీవితో ఒక మల్టీస్టారర్ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ సినిమాతో పాటు రీసెంట్‌గా తమిళంలో ధనుశ్ హీరోగా హిట్టైన ‘అసురన్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనే ఆలోచనలో రామ్ చరణ్ ఉన్నట్టు సమాచారం. పూర్తి గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా రామ్ చరణ్‌కు సూటయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే ‘రంగస్థలం’లో గ్రామీణ యువకుడి పాత్రలో రామ్ చరణ్ నటించిన సంగతి తెలిసిందే కదా.

ram charan to act dhanush super hit tamil film asuran telugu remake,ram charan,asuran,ram charan,asuran trailer,dhanush asuran,ram charan instagram,ram charan twitter,ram charan facebook,ram charan rrr,rajamouli jr ntr ram charan rrr,rrr,vetrimaran dhanush asuran,asuran songs,ram charan asuran remake,ram charan next movie asuran remake,ram charan new movie remake of asuran,asuran movie,ram charan upcoming movie asuran remake,asuran dhanush,ram charan next movie will be remake of asuran,asuran remake by ram charan,asura movie,asuran movie remake by ram charan,ram charan yevadu movie,రామ్ చరణ్,రామ్ చరణ్ అసురన్ రీమేక్,రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్,మరో రీమేక్‌లో రామ్ చరణ్,అసురన్ తమిళ రీమేక్‌లో రామ్ చరణ్,రామ్ చరణ్ ధనుశ్ అసురన్ రీమేక్
రామ్ చరణ్ అసురన్ రీమేక్


అందుకే మరోసారి ‘అసురన్’ లాంటి గ్రామీణ నేపథ్యమున్న సినిమా చేయాలనే ఆలోచనలో రామ్ చరణ్ ఉన్నట్టు సమాచారం. మరి ఈ రీమేక్ విషయమై మెగా కాంపౌండ్ నుంచి అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది. ఇప్పటికే రామ్ చరణ్.. ‘జంజీర్’, ‘ధృవ’వంటి రీమేక్  సినిమాల్లో నటించాడు. మరి ఈ సినిమాకు కూడా ఓకే చెబుతాడా లేదా అనేది చూడాలి. తమిళంలో విడుదలైన ఈ సినిమా చూసి మహేష్ బాబు సహా పలువురు ప్రముఖులు ప్రశంసించిన సంగతి తెలిసిందే కదా.

First published: October 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>