వాళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రామ్ చరణ్.. మళ్లీ రిపీట్ అయిందంటే..
తెలుగు ఇండస్ట్రీతో పాటు అన్ని భాషల్లోని ఇండస్ట్రీలను పీడిస్తున్న సమస్య పైరసీ. ఒక్కటి రెండూ కాదు.. చాలా ఏళ్లుగా పైరసీ రక్కసి సినిమాలను నాశనం చేస్తుంది. విడుదలైన రోజు మధ్యాహ్నానికే నెట్లో..

రామ్ చరణ్ ట్విట్టర్ ఫోటో
- News18 Telugu
- Last Updated: October 3, 2019, 4:07 PM IST
తెలుగు ఇండస్ట్రీతో పాటు అన్ని భాషల్లోని ఇండస్ట్రీలను పీడిస్తున్న సమస్య పైరసీ. ఒక్కటి రెండూ కాదు.. చాలా ఏళ్లుగా పైరసీ రక్కసి సినిమాలను నాశనం చేస్తుంది. విడుదలైన రోజు మధ్యాహ్నానికే నెట్లో సినిమా ప్రత్యక్షం అవుతుంటే ఏం చేయాలో తెలియక తల పట్టుకుని కూర్చుంటున్నారు దర్శక నిర్మాతలు. చాలా మంది నిర్మాతలు చాలా ప్లాన్స్ వేసినా కూడా ఈ పైరసీని అడ్డుకోలేకపోతున్నారు. ఇప్పుడు సైరా విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ సినిమా పైరసీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు దర్శక నిర్మాతలు. దానికోసం యాంటీ పైరసీ సెల్ కూడా ఏర్పాటు చేసి ఓ ఈ మెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు.

ఎవరైనా పైరసీ చేసినట్లు కనిపించినా.. ప్రింట్ దర్శనమిచ్చినా కూడా వెంటనే ఆ మెయిల్‌కు వివరాలు పంపండంటూ చెప్పాడు నిర్మాత రామ్ చరణ్. దానికి తోడు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ సాయం కూడా తీసుకున్నారు సైరా యూనిట్. అయితే ఎన్ని చేసినా కూడా కొన్ని వెబ్ సైట్లలో సినిమా మధ్యాహ్నానికే రావడంతో నిరాశ పడుతున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు వాళ్లు పంపించిన మెయిల్ ఐడీకే కొన్ని వేల పైరసీ లింక్స్ రావడంతో పరేషాన్ అవుతున్నాడు నిర్మాత రామ్ చరణ్. దీనిపై ఆయన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక ఇప్పుడు పైరసీపై అధికారికంగా ఫిర్యాదు చేయబోతున్నారు టీం.
సైరాకు మంచి టాక్ వచ్చింది.. వీకెండ్ నాటికి చాలా చోట్ల రికార్డ్ వసూళ్లు సాధిస్తుందని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. కానీ పైరసీ రావడంతో వాళ్లు కంగారు పడుతున్నారు. కనీసం మూడు రోజులైనా పైరసీ రాకుండా ఆపగలిగితే కచ్చితంగా వసూళ్లు చాలా వస్తాయని నమ్మిన వాళ్లకు ఇప్పుడు తొలిరోజే దర్శనమివ్వడంతో షాక్ తప్పట్లేదు. అందుకే రామ్ చరణ్ కూడా పైరసీ చేసే వాళ్లకు హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఇలాంటి పనులు చేసి తెలుగు సినిమాను చంపేయొద్దు.. దొరికితే మాత్రం పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని వార్నింగ్ ఇస్తున్నాడు మెగా వారసుడు.

సైరా (Source: Twitter)

సైరా వర్కింగ్ స్టిల్స్ (Source: Twitter)
సైరాకు మంచి టాక్ వచ్చింది.. వీకెండ్ నాటికి చాలా చోట్ల రికార్డ్ వసూళ్లు సాధిస్తుందని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. కానీ పైరసీ రావడంతో వాళ్లు కంగారు పడుతున్నారు. కనీసం మూడు రోజులైనా పైరసీ రాకుండా ఆపగలిగితే కచ్చితంగా వసూళ్లు చాలా వస్తాయని నమ్మిన వాళ్లకు ఇప్పుడు తొలిరోజే దర్శనమివ్వడంతో షాక్ తప్పట్లేదు. అందుకే రామ్ చరణ్ కూడా పైరసీ చేసే వాళ్లకు హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఇలాంటి పనులు చేసి తెలుగు సినిమాను చంపేయొద్దు.. దొరికితే మాత్రం పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని వార్నింగ్ ఇస్తున్నాడు మెగా వారసుడు.
రామ్ చరణ్, చిరంజీవి తీరుతో టాలీవుడ్ అగ్ర నిర్మాతల అసహనం..
మహేష్ బాబు AMB థియేటర్లో మెగా ఫ్యామిలీ సందడి..
నిరుద్యోగులకు ఉపాసన కొణిదెల మరో బంపరాఫర్.. ఈ సారి మాత్రం..
పవన్ కళ్యాన్‌తో సినిమా చేయనన్న ఆ నటుడు..
అమెజాన్ ప్రైమ్‌లో సైరా అద్భుతాలు.. రప్ఫాడిస్తున్న చిరంజీవి..
అందుకే ఇకపై వాటికి జోలికి పోవడం లేదన్న నాగబాబు..
Loading...