Home /News /movies /

RAM CHARAN STARTS DUBBING FOR CHIRANJEEVI MOVIE ACHARYA SB

Ram Charan: చిరంజీవి సినిమాకు డబ్బింగ్ చెబుతున్న రామ్ చరణ్

రామ్ చరణ్‌, చిరంజీవి (Twitter/Photo)

రామ్ చరణ్‌, చిరంజీవి (Twitter/Photo)

మెగాస్టార్ చిరు ఆచార్య సినిమా ఈ నెల ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. దీంతో ఆ పాత్ర కోసం డబ్బింగ్ పనుల్లో బిజీగా మారాడు చెర్రీ.

    టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తోన్న మరో సినిమా 'ఆచార్య'. ఈ మూవీలో చిరంజీవి తనయుడు రామ్​చరణ్​ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్​ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ క్రమంలో ఈ సినిమా కోసం డబ్బింగ్​ స్టార్ట్​ చేశారు రామ్​చరణ్​. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ ఓ సరికొత్త పాత్రలో మనకు కనిపించబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. కాగా ఈ సినిమాలో సిద్ధ అనే పాత్రలో చరణ్ కూడా నటిస్తున్నాడు. దేవాలయాల నేపథ్య కథతో తీసిన ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్​గా చేసింది.పూజ హెగ్డే కూడా నటిస్తోంది. మణిశర్మ ఆచార్య మూవీకి సంగీతమందించారు. కొరటాల శివ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది.

    ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తవ్వడం విడుదల కూడా అయిపోవడంతో ఇప్పుడు రామ్ చరణ్ ఆచార్య పనుల్లో బిజీ అయ్యాడు.తాజాగా సిద్ధ పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులను చరణ్ శుక్రవారం మొదలుపెట్టాడు. ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. వీలైనంత త్వరగా ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులను ముగించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇక ఈ సినిమాలో చరణ్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఈ సినిమాలో చరణ్ ఓ నక్సలైట్ పాత్రలో నటిస్తాడని చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ చూస్తే మనకు అర్థమవుతోంది.

    ఇప్పటికే తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ తన నెక్ట్స్ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కొంతమేర షూటింగ్ కూడా జరుపుకున్న ఈ సినిమా తరువాత షెడ్యూల్ కోసం రెడీ అవుతున్నాడు. ఆర్ఆర్ఆర్ హిట్‌తో చరణ్ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ మనకు కనిపించాడు. ఆర్ఆర్ఆర్‌లో చరణ్ పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉండటంతో అభిమానులు ఆయన నటనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం రిలీజ్ కావడంతో, చరణ్ తన నెక్ట్స్ మూవీలపై ఫోకస్ పెట్టాడు. లైన్‌లో ఉన్న మిగతా సినిమా పనుల్లో బిజీ అయ్యాడు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Aacharya, Chiranjeevi, Ram Charan, RRR

    తదుపరి వార్తలు