సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న రామ్ చరణ్ డాన్స్..

అవును మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వేసిన స్పెప్పులు ఇపుడు యూట్యూబ్‌తో పాటు సోషల్ మీడియాలో ప్రకంపనలు పుట్టిస్తోంది.

news18-telugu
Updated: January 16, 2020, 10:02 AM IST
సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న రామ్ చరణ్ డాన్స్..
రామ్ చరణ్ డాన్స్ (Youtube/Photo)
  • Share this:
అవును మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వేసిన స్పెప్పులు ఇపుడు యూట్యూబ్‌తో పాటు సోషల్ మీడియాలో ప్రకంపనలు పుట్టిస్తోంది. రీసెంట్‌గా చెన్నైలో బిహైండ్ వుడ్స్ గోల్డ్ మెడల్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ధనుష్,నయనతార, శివ కార్తికేయన్, రష్మిక, విజయ్ దేవరకొండ, సాయి పలల్వి, అర్జున్, యశ్ మిగతా నటీనటులు పెద్ద ఎత్తున ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా రంగస్థలం చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా రామ్ చరణ్ బిహైండ్ వుడ్స్ గోల్డ్ మెడల్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డును కొన్ని రోజుల క్రితం మరణించిన మెగాభిమాని నూర్ అహ్మద్‌కు అంకితం ఇచ్చాడు. ఆ తర్ాత స్టేజ్ పై నుంచి కిందికి దిగుతుండగా.. అక్కడ ప్రోగ్రామ్‌ను హోస్ట్ చేస్తోన్న యాంకర్లు చరణ్‌ను ఓ స్టెప్పు వేయమని కోరారు. దీంతో రామ్ చరణ్.. అక్కడే ఉన్న మరో తమిళ హీరో శివ కార్తికేయన్‌తో కలిసి వేస్తానవని చెప్పాడు. అంతేకాదు శివ కార్తికేయన్ నటించిన ఒక సినిమాకు సంబందించిన ఒక పాటకు అతనితో కలిసి చెర్రీ స్టెప్పులు వేసాడు. వీరిద్దరు కలిసి వేదికపై స్టెప్పులు వేస్తుంటే.. అక్కడున్న వారు చప్పట్లతో హోరెత్తించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.


First published: January 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>