ఫ్రెండ్‌షిప్ డే రోజున అపురూపమైన ఎన్టీఆర్ ఫోటో షేర్ చేసిన రామ్ చరణ్...

friendship day : ఫ్రెండ్‌షిప్ డే రోజున రామ్ చరణ్.. ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల అదిరిపోయే ఓ ఫోటో షేర్ చేస్తూ.. ఎన్టీఆర్‌తో తన అనుబంధాన్ని తెలిపారు.

news18-telugu
Updated: August 4, 2019, 6:06 PM IST
ఫ్రెండ్‌షిప్ డే రోజున అపురూపమైన ఎన్టీఆర్ ఫోటో షేర్ చేసిన రామ్ చరణ్...
రామ్ చరణ్ (ఫైల్ ఫోటో)
  • Share this:
తెలుగు దిగ్గజ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా  తెరకెక్కిస్తున్న చిత్రం RRR తెలిసిందే.  డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్‌కు జోడిగా బాలీవుడ్ నటి అలియా భట్ నటిస్తుండగా.. తారక్‌కు జంటగా  అమెరికన్ నటి ఎమ్మా రోబర్ట్స్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జులై 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్దమవుతోంది. అది అలా ఉంటే ఫ్రెండ్ షిప్ డే సందర్బంగా RRR చిత్ర బృందం ట్వీటర్ వేదికగా  ఓ పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది. ‘ఓ మంచి స్నేహం ఎప్పుడూ అనుకోకుండానే మొదలవుతుంది.. RRR సినిమాలోని రామరాజు, భీమ్‌ల స్నేహం మాదిరిగా.. ఆ విధంగా మీ జీవితంలో అనుకోకుండా ఓ స్నేహితుడిని ఖచ్చితంగా కలిసి ఉంటారు. అలా కలిసిన వ్యక్తుల్లో మీకు అత్యంత ఆప్తుడైన స్నేహితుడు ఉంటే.. ఈ స్నేహితుల దినోత్సవం సందర్భంగా అతనితో దిగిన ఫొటోను మాతో పంచుకోండి’ అంటూ కోరింది చిత్ర బృందం. దీంతో నెటిజన్స్.. తమ జీవితాల్లో ఎదురైన లేదా వారు ఎక్స్ పీరియన్స్ చేసిన మిత్రుల ఫోటోలను షేర్ చేస్తూ.. కామెంట్స్ పెడుతున్నారు.


అందులో భాగంగా ఎన్టీఆర్, రాజమౌళితో పాటు ఇతర యూనిట్ సభ్యులంతా RRR యే దోస్త్ హాష్ ట్యాగ్‌తో స్నేహితులకు విషెస్ చెబుతున్నారు. రాజమౌళి, నిర్మాత సాయి కొర్రపాటికి విషేస్ తెలపగా.., ఎన్టీఆర్ రామ్ చరణ్‌కి విష్ చేస్తూ ఓ ఫోటో పోస్ట్ చేశాడు. చరణ్ కూడా అదిరిపోయే ఫోటోను పోస్ట్ చేస్తూ.. ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు..
 
View this post on Instagram
 

Some bonds take time to form. But when done, they are forged for life. I've forged one such bond with Tarak, my Bheem! #RRRYehDosti


A post shared by Ram Charan (@alwaysramcharan) on
First published: August 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>