హోమ్ /వార్తలు /సినిమా /

Ram Charan : రామ్ చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. రేపు బిగ్ సర్పైజ్ ఉందట..

Ram Charan : రామ్ చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. రేపు బిగ్ సర్పైజ్ ఉందట..

Ram Charan Twitter

Ram Charan Twitter

Ram Charan : రామ్ చరణ్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో సినిమా అనడంతో సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఈ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నిదిల్ రాజు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తోన్నారు. ఇక అది అలా ఉంటే ఈ సినిమాపై మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇంకా చదవండి ...

  Ram Charan | Shankar : ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాల తర్వాత రామ్ చరణ్ (Ram Charan), డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబినేషన్‌లో నెక్ట్స్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ ‌తో చేసిన ఆర్ఆర్ఆర్‌తో రామ్ చరణ్ ప్యాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు తన తండ్రి చిరంజీవితో చేసిన ఆచార్య సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయినా.. మెగాభిమానులకు మాత్రం ఈ సినిమా తీపి గుర్తుగా మిగిలిపోయింది. ఒక బ్లాక్ బస్టర్, ఒక డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇన్నేళ్ల కెరీర్‌లో రామ్ చరణ్ నటించిన రెండు సినిమాలు ఒకే కాలండర్ ఇయర్‌లో విడుదల కావడం ఇదే మొదటి సారి. ఇదో రికార్డుగా చెప్పుకుంటున్న మెగాభిమానులు. రామ్ చరణ్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో సినిమా అనడంతో సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఈ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నిదిల్ రాజు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తోన్నారు. ఇక అది అలా ఉంటే ఈ సినిమాపై మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ విషయంలో ఓ క్లారిటీ రానుందని అంటున్నారు. ఈ మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని శంకర్ రేపు విడుదల చేస్తున్నారట. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

  ఇక శంకర్ ఈ సినిమా కాన్సెప్ట్‌ పోస్టర్ కోసమే దాదాపు రూ. 2 కోట్ల వరకు ఖర్చు చేసారట. ప్యాన్ ఇండియా లెవల్లో భారీగా నిర్మితమవుతోన్న ఈ సినిమా రూ. 200 కోట్ల బడ్జెట్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు.ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ మీడియా సంస్థ ZEE ఛానెల్ దాదాపు రూ. 200 కోట్ల రూపాయల కి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాకు స్ట్రీమింగ్ భాగస్వామిగా ZEE5 ఓటీటీతో డీల్ కుదర్చుకుందట. రామ్ చరణ్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో సునీల్, అంజలి, శ్రీకాంత్, నవీన్ చంద్ర కనిపించనున్నారు. 2023 సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్ నడిచిన.. సమ్మర్‌కు వస్తోందని తాజా టాక్. ఇక తాజాగా ఈ సినిమా వైజాగ్‌లో మొదలైంది. ఈ షెడ్యూల్లో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారట.


  ముందుగా ఈ సినిమాకు ‘విశ్వంభర’ అనే టైటిల్ పేరు వినిపించింది. తాజాగా ఈ సినిమా హీరో ఎలక్షన్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. మరోవైపు సీఎం పాత్రలో ఎస్.జే.సూర్య నటిస్తున్నట్టు సమాచారం. వీళ్లిద్దరి మధ్య ఆసక్తికర సన్నివేశాలు ఈ సినిమాకు హైలెట్ అని చెబుతున్నారు. ఈ సినిమాకు తాజాగా ‘సర్కారోడు’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఫిల్మ్ ఛాంబర్‌లో ఈ మూవీ టైటిల్ రిజిస్టర్ చేయించారట. ఈ సినిమాను శంకర్ దేశ చట్టాలను ఉపయోగించుకొని కార్పోరేట్ శక్తులు ఏ విధంగా ఎదుగుతున్నాయో తన సినిమాలో చూపించనున్నట్టు సమాచారం.

  రామ్ చరణ్ ఈ సినిమాలో ఐఏఎస్ అధికారి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఇండియన్ పీనల్ కోడ్‌లోని ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని పలు సెక్షన్లను శంకర్ ఈ సినిమాలో ప్రస్తావించనున్నట్టు సమాచారం. సినిమాను కూడా శంకర్ తనదైన శైలిలో సోషల్ మెసెజ్‌తో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా అర్జున్ నటించిన ‘ఒకే ఒక్కడు’ సినిమాకు సీక్వెల్ అనే ప్రచారం జరుగుతోంది. అందులో జర్నలిస్ట్ నుంచి ముఖ్యమంత్రి అయితే... ఇందులో ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర నుంచి సీఎం స్థాయికి ఎదిగే పాత్ర ఉంటుందనేది కోలీవుడ్ (Kollywood) సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇదే స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారా లేదా తెలియాల్సి ఉంది.ఇక మరోవైపు రామ్ చరణ్ హీరోగా మరో కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన విడుదలైంది. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ కొత్త సినిమా తెరకెక్కనుంది. అయితే ఈ సినిమా శంకర్ సినిమా తర్వాత పట్టాలెక్కనుందని తెలుస్తోంది.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Ram Charan, Shankar

  ఉత్తమ కథలు