హోమ్ /వార్తలు /సినిమా /

Ram Charan - Shankar: రామ్ చరణ్ సినిమాలో అవేం ఉండవు.. హామీ ఇచ్చిన దర్శకుడు శంకర్..

Ram Charan - Shankar: రామ్ చరణ్ సినిమాలో అవేం ఉండవు.. హామీ ఇచ్చిన దర్శకుడు శంకర్..

3. రామ్ చరణ్, శంకర్ సినిమా

3. రామ్ చరణ్, శంకర్ సినిమా

Ram Charan - Shankar: చిరంజీవికి ఎన్నో ఏళ్ళ నుంచి ఓ కల ఉండేది. అదే శంకర్ దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా నటించాలని. రోబో సినిమా సమయంలో చెప్పాడు కూడా. తనకు శంకర్ లాంటి దర్శకుడితో పని చేయాలని ఉందని.

చిరంజీవికి ఎన్నో ఏళ్ళ నుంచి ఓ కల ఉండేది. అదే శంకర్ దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా నటించాలని. రోబో సినిమా సమయంలో చెప్పాడు కూడా. తనకు శంకర్ లాంటి దర్శకుడితో పని చేయాలని ఉందని. కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అవకాశం రాలేదు. పైగా శంకర్ కూడా ఎప్పుడూ తెలుగు ఇండస్ట్రీకి రాలేదు. కానీ ఇన్నేళ్ళకు ఆ అవకాశం వచ్చింది. అయితే తండ్రికి ఛాన్స్ దక్కకపోయినా కూడా తనయుడికి మాత్రం శంకర్‌తో సినిమా చేసే ఆఫర్ వచ్చేసింది. రామ్ చరణ్ హీరోగా పాన్ ఇండియన్ సినిమాను సిద్ధం చేస్తున్నాడు శంకర్. ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చింది. సెన్సేషనల్ నిర్మాత దిల్ రాజు నిర్మించబోతున్నాడు. అంతేకాదు తన నిర్మాణంలో రాబోయే 50వ సినిమా కావడం విశేషం. నాలుగేళ్ళ కింద అల్లు అర్జున్ డిజే సినిమాతో 25 సినిమాల మైలురాయి అందుకున్నాడు దిల్ రాజు. ఈ నాలుగేళ్ళలోనే మరో 24 సినిమాలు పూర్తి చేసాడు. ఇప్పుడు 50వ సినిమా వైపు వస్తున్నాడు. మరోవైపు రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి ట్రిపుల్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. శంకర్ కూడా ఇప్పుడు భారతీయుడు 2 సినిమా చేస్తున్నాడు. కమల్ హాసన్ హీరోగా దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. 25 ఏళ్ళ కింద వచ్చిన భారతీయుడు సినిమాకు ఇది సీక్వెల్. దేశంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ కథను సిద్ధం చేసుకున్నాడు దర్శకుడు శంకర్.

ram charan new movie dil raju shankar,SVC 50 shankar ram charan,ram charan upcoming movies,ram charan shankar movie,director shankar ram charan movie,ram charan and shankar movie,shankar next movie with ram charan,ram charan and shankar movie news,ram charan director shankar movie,ram charan and shankar movie update,ram charan upcoming movie with shankar dil raju,శంకర్ రామ్ చరణ్,రామ్ చరణ్ శంకర్ దిల్ రాజు,దిల్ రాజు 50వ సినిమా రామ్ చరణ్ శంకర్
రామ్ చరణ్ శంకర్ (Ram Charan Shankar)

ఇండియన్ 2ను పక్కనబెట్టి మరీ రామ్ చరణ్ సినిమాను శంకర్ పూర్తి చేయబోతున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే రామ్ చరణ్ సినిమా ఎలా ఉండబోతుంది.. దాని జోనర్ ఏంటనే విషయంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. దీనిపై తాజాగా కన్ఫర్మేషన్ వచ్చింది. ఈ సినిమా రాజకీయ నేపథ్యంలోనే రాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య టెక్నికల్ సినిమాల వైపు వెళ్లిన శంకర్.. రామ్ చరణ్‌తో మాత్రం పొలిటికల్ థ్రిల్లర్ చేయబోతున్నాడు.

Ram Charan to Work With Rajamouli to shankar and other Crazy directors Here Are the list, Ram Charan: ఒకవైపు రాజమౌళి.. మరోవైపు శంకర్.. రామ్ చరణ్ లైనప్ మాములుగా లేదుగా..,Ram Charan,Ram Charan Shankar,Ram Charan Rajamouli,RRR,RRR Ram Charan,Ram Charan Acharya,Ram Charan Shankar,Shankar,ram charan Lokesh Kanagaraj,Lokesh Kanagaraj direction,lokesh kanakaraj,ram charan gautam tinnanuri,ram charan trivikram,ram charan koratala siva, ram charan,ram charan twitter, sandeep reddy vanga ram charan movie, sandeep reddy vanga twitter, sandeep reddy vanga instagram, sandeep reddy vanga movies, sandeep reddy vanga mahesh babu, sandeep reddy vanga chiranjeevi movie, sandeep reddy vanga ram charan movie,ram charan instagram,ram charan next movie,ram charan anil ravipudi,రామ్ చరణ్,రామ్ చరణ్ అనిల్ రావిపూడి,రామ్ చరణ్ సందీప్ రెడ్డి వంగా,తెలుగు సినిమా,రామ్ చరణ్ లోకేష్ కనగరాజ్,లోకేష్ కనగరాజ్,దర్శకుడు లోకేష్ కనగరాజ్,రామ్ చరణ్ త్రివిక్రమ్,రామ్ చరణ్ కొరటాల శివ,రామ్ చరణ్ గౌతమ్ తిన్ననూరి,రామ్ చరణ్ ఆచార్య,రామ్ చరణ్ ఆచార్య,రామ్ చరణ్ శంకర్
రాజమౌళి,రామ్ చరణ్,శంకర్ (File/Photos)

ఇందులో ఎలాంటి విజువల్ ఎఫెక్ట్స్ ఉండవని.. కేవలం కథా ప్రధానంగా సాగే కథ ఇది అని తెలుస్తుంది. శివాజీ తర్వాత శంకర్ నుంచి మామూలు సినిమా రాలేదు. మధ్యలో స్నేహితుడు చేసినా అది రీమేక్. అన్నీ టెక్నికల్, సైన్స్ ఫిక్షన్ సినిమాలు చేస్తున్నాడు శంకర్. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి రిస్కులు లేకుండా పొలిటికల్ థ్రిల్లర్ చేయబోతున్నాడు ఈ దర్శకుడు. బడ్జెట్ కూడా చాలా వరకు కంట్రోల్‌లోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు. పైగా ఈ సినిమాను రెండు మూడేళ్లు కాకుండా కేవలం ఒకే ఏడాదిలో పూర్తి చేయాలని చూస్తున్నాడు.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Ram Charan, Shankar, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు