Ram Charan - Shankar: రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో చరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. మరోవైపు కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఈ చిత్రంపై దేశ వ్యాప్తంగా క్రేజ్ నెలకొని ఉంది. ఈ సినిమాతో పాటు రామ్ చరణ్ ముందుగా.. తన తండ్రి చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో సిద్ద అనే స్టూడెంట్ లీడర్ పాత్రలో పలకరించబోతున్నాడు. ఈ సినిమాల తర్వాత రామ్ చరణ్.. శంకర్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఏప్రిల్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మరోవైపు శంకర్ కూడా కమల్ హాసన్‌తో చేస్తోన్న ‘భారతీయుడు 2’ సినిమాను పక్కన పెట్టి మరి ఈ సినిమా చేస్తున్నాడు. శంకర్ కూడా తమిళ హీరోలు కాకుండా ఓ తెలుగు హీరోతో సినిమా చేయడం ఇదే మొదటిసారి.
ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన రష్మిక మందన్న కథానాయకగా నటించడం దాదాపు ఖాయం అయింది. మరోవైపు ఈ సినిమాను శంకర్.. 9 నెలల్లో పూర్తి చేయనున్నట్టు సమాచారం. ముందుగా వీరిద్దరి కాంబినేషన్లో సైన్స్ ఫిక్షన్ సినిమా అని చెప్పినా.. ఫైనల్‌గా మాత్రం పొలిటికల్ డ్రామా అని చెబుతున్నారు. ఒకే ఒక్కడు సినిమాకు సీక్వెల్ అనే టాక్ వినబడుతోంది.ఈ సినిమాలో హీరోతో పాటు విలన్ పాత్రకు మంచి ఇంపార్టెంట్ ఉంది. అందుకే ఈ చిత్రంలో విలన్‌గా బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్‌ను సంప్రదించినట్టు సమాచారం.

శంకర్, రామ్ చరణ్ మూవీలో విలన్‌గా రణ్వీర్ సింగ్ (File/Photo)
రణ్వీర్ సింగ్ కూడా ఈ సినిమా స్టోరీ విని శంకర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. త్వరలోనే రణ్వీర్ సింగ్ ఈ చిత్రంలో నటించే విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. భారీ బడ్జెట్‌తో ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై టాలీవుడ్‌తో పాటు అన్ని ఇండస్ట్రీస్‌లో అపుడే అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఈ సినిమాను దిల్ రాజు తన బ్యానర్లో 50వ సినిమాగా తెరకెక్కిస్తున్నాడు.
Published by:Kiran Kumar Thanjavur
First published:February 23, 2021, 10:56 IST