హోమ్ /వార్తలు /సినిమా /

Ram Charan - Shankar : రామ్ చరణ్ సినిమాలో విలన్‌గా మలయాళ సూపర్ స్టార్.. శంకర్ మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా..

Ram Charan - Shankar : రామ్ చరణ్ సినిమాలో విలన్‌గా మలయాళ సూపర్ స్టార్.. శంకర్ మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా..

250 కోట్లతో దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇందులో పొలిటికల్ ఇష్యూస్ చాలానే చర్చించబోతున్నాడు దర్శకుడు శంకర్. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా వస్తుందని మొదటి నుంచి వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమాలో చరణ్ ముందు కలెక్టర్‌గా ఉన్నా.. ఆ తర్వాత 'అభ్యుదయ పార్టీ' అనే కల్పిత రాజకీయ పార్టీ నేతగా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. అక్కడ్నుంచే కథ కీలక మలుపు తిరుగుతుందని ప్రచారం జరుగుతుంది.

250 కోట్లతో దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇందులో పొలిటికల్ ఇష్యూస్ చాలానే చర్చించబోతున్నాడు దర్శకుడు శంకర్. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా వస్తుందని మొదటి నుంచి వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమాలో చరణ్ ముందు కలెక్టర్‌గా ఉన్నా.. ఆ తర్వాత 'అభ్యుదయ పార్టీ' అనే కల్పిత రాజకీయ పార్టీ నేతగా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. అక్కడ్నుంచే కథ కీలక మలుపు తిరుగుతుందని ప్రచారం జరుగుతుంది.

Ram Charan - Shankar : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో విలన్‌గా మలయాళ సూపర్ స్టార్‌ను ఎంపిక చేసారా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు. 

    Ram Charan - Shankar : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో విలన్‌గా మలయాళ సూపర్ స్టార్‌ను ఎంపిక చేసారా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు.  రీసెంట్‌గా రామ్ చరణ్ (Ram Charan), డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబినేషన్‌లో ఎంతో అట్టహాసంగా ఓ సినిమా పూజా కార్యక్రమాలతో  ప్రారంభమైన సంగతి తెలిసిందే కదా. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నిదిల్ రాజు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీ ముహూర్తపు సన్నివేశానికి మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) క్లాప్ కొట్టారు.  దర్శకుడు రాజమౌళి (Rajamouli), బాలీవుడ్ క్రేజీ హీరో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేసారు.

    ఇక  శంకర్ ఈ సినిమా కాన్సెప్ట్‌ పోస్టర్ కోసమే దాదాపు రూ. 2 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ మధ్యే  పూణెలో ప్రారంభమైంది. అంతేకాదు ఈ మూవీ ముహూర్తపు సన్నివేశానికి సంబంధించిన వీడియో గ్లింప్స్‌ను కూడా విడుదల చేసారు.ప్యాన్ ఇండియా లెవల్లో భారీగా నిర్మితమవుతోన్న ఈ సినిమా రూ. 200 కోట్ల బడ్జెట్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు.

    అల్లు అర్జున్ ఆ తర్వాత ఎన్టీఆర్.. ఆపై మహేష్ బాబు, పవన్ కళ్యాణ్..

    ఈ సినిమాకు ‘విశ్వంభర’ అనే టైటిల్ అనుకుంటున్నారు. డా. సి.నారాయణ రెడ్డికి జ్ఞానపీఠ్ అవార్డు తెచ్చి పెట్టిన ‘విశ్వంభర’ టైటిల్ ఏ మేరకు న్యాయం చేస్తారనేది చూడాలి. మిగతా భాషల్లో ఇదే టైటిల్ ఫిక్స్ చేస్తారా.. లేకుంటే వేరే ఏదైనా టైటిల్ పెడతారా అనేది చూడాలి. ఈ సినిమాలో శ్రీకాంత్ మరో పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ సినిమాలో రామ్ చరణ్‌ను ఢీ కొట్టే విలన్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ సురేష్ గోపీ నటిస్తున్నట్టు సమాచారం.


    ఇప్పటకీ సురేష్ గోపీకి శంకర్ కథను చెప్పి నేరేట్ చేసాడట. ఈ సినిమాలో హీరోతో సమానమైన పాత్రకు సురేష్ గోపీ లాంటి స్టార్ నటుడు తోడైతే.. ఈ సినిమా రేంజ్ వేరే లెవల్లో ఉంటుందనే ఉద్దేశ్యంతో శంకర్ ఆయన్ని ఒప్పించాడట. గతంలో శంకర్ తెరకెక్కించిన ‘ఐ’ (మనోహరుడు) సినిమాలో సురేష్ గోపీ (Suresh Gopi) మెయిన్ విలన్‌గా నటించిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు మరోసారి శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రంలో సురేష్ గోపీ యాక్ట్ చేయనున్నారు. ఈ విషయమై త్వరలో అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది. సురేష్ గోపీ గతంలో తెలుగులో కృష్ణంరాజు హీరోగా నటించిన ‘అంతిమ తీర్పు’, ‘ఆ ఒక్కడు’ సినిమాల్లో నటించారు. అటు ఎన్నో మలయాళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే.

    Chiranjeevi : చిరంజీవితో సాయి ధరమ్ తేజ్ వాళ్ల నాన్న నిర్మించిన ఈ సినిమా తెలుసా..


    ఈ సినిమాను శంకర్ దేశ చట్టాలను ఉపయోగించుకొని కార్పోరేట్ శక్తులు ఏ విధంగా ఎదుగుతున్నాయో తన సినిమాలో చూపించనున్నట్టు సమాచారం. రామ్ చరణ్ ఈ సినిమాలో ఐఏఎస్ అధికారి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఇండియన్ పీనల్ కోడ్‌లోని ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని పలు సెక్షన్లను శంకర్ ఈ సినిమాలో ప్రస్తావించనున్నట్టు సమాచారం.  సినిమాను కూడా శంకర్ తనదైన శైలిలో సోషల్ మెసెజ్‌తో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా అర్జున్ నటించిన ‘ఒకే ఒక్కడు’ సినిమాకు సీక్వెల్ అనే ప్రచారం జరుగుతోంది.

    Balakrishna - Prabhas : బాలయ్యకు ఆ విధంగా షాక్ ఇచ్చిన ప్రభాస్.. నట సింహాం కంటే ముందే రంగంలోకి రెబల్ స్టార్..


    అందులో జర్నలిస్ట్ నుంచి ముఖ్యమంత్రి అయితే... ఇందులో ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర నుంచి సీఎం స్థాయికి ఎదిగే పాత్ర ఉంటుందనేది కోలీవుడ్ (Kollywood) సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇదే స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారా లేదా తెలియాల్సి ఉంది.

    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Dil raju, Kiara advani, Malluwood, Ram Charan, Shankar, Suresh Gopi, Tollywood

    ఉత్తమ కథలు