హోమ్ /వార్తలు /సినిమా /

Ram Charan - Shankar: రామ్ చరణ్, శంకర్ సినిమా పై క్రేజీ అప్‌డేట్..

Ram Charan - Shankar: రామ్ చరణ్, శంకర్ సినిమా పై క్రేజీ అప్‌డేట్..

శంకర్, రామ్ చరణ్ : Twitter

శంకర్, రామ్ చరణ్ : Twitter

Ram Charan - Shankar: రామ్ చరణ్, శంకర్ సినిమా పై క్రేజీ అప్‌డేట్.. ఎపుడైతే.. నిర్మాత దిల్ రాజు.. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో అనౌన్స్ చేయగానే ఈ సినిమా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

  Ram Charan - Shankar: రామ్ చరణ్, శంకర్ సినిమా పై క్రేజీ అప్‌డేట్.. ఎపుడైతే.. నిర్మాత దిల్ రాజు.. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో అనౌన్స్ చేయగానే ఈ సినిమా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇక శంకర్ దర్శకుడిగా ఇప్పటి వరకు అన్ని తమిళ సినిమాలే తెరకెక్కించారు. అది కూడా అక్కడి హీరోలతోనే సినిమాలను తెరకెక్కించారు. ఇక శంకర్ తన కెరీర్‌లో అనిల్ కపూర్‌తో యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటించిన ‘ఒకే ఒక్కడు’ సినిమాను ‘నాయక్’గా తెరకెక్కించారు. అది తప్పించి వేరే భాషల హీరోలతో సినిమాలను మాత్రం తీయలేదు. ఇపుడు ఫస్ట్ టైమ్ వేరే ఇండస్ట్రీకి చెందిన అగ్ర హీరో రామ్ చరణ్‌తో ప్యాన్ ఇండియా సినిమా తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఐతే.. శంకర్ మాత్రం కమల్ హాసన్‌తో ‘భారతీయుడు 2’ సినిమాను తెరకెక్కించాలి. కానీ ఇప్పటికే ఈ సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. మరోవైపు లైకా ప్రొడక్షన్స్ వాళ్లు ముందుగా కమల్ హాసన్‌తో ‘భారతీయుడు 2’ సినిమాను పూర్తి చేసిన తర్వాత కానీ వేరే సినిమా చేయడానికి వీలు లేదు అంటూ కోర్టు కెక్కరు. దీంతో ఎపుడో పట్టాలెక్కాల్సిన  రామ్ చరణ్, శంకర్ సినిమా మరింత ఆలస్యమవుతూ వచ్చింది.

  తాజాగా ఈ సినిమాకు సంబంధించిన  మరో క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాను ఆగష్టులో సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇప్పటికే శంకర్.. రామ్ చరణ్‌తో చేయబోయే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను తన అసిస్టెంట్స్‌తో దగ్గరుండి చేయిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన రష్మిక మందన్న  లేదా కియారా అద్వానీ నటించే అవకాశాలున్నాయి. వీళ్లిద్దరిలో ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్.. తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం.క ప్యాన్ ఇండియా లెవల్లో భారీగా నిర్మితమవుతోన్న ఈ సినిమా రూ. 200 కోట్ల బడ్జెట్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది.

  shankar shnmugam,shankar shnmugam twitter,shankar ram charan movie,shankar hindi remake anniyan movie,shankar ranveer singh movie,shankar anniyan remake ranveer singh,tamil cinema,శంకర్,శంకర్ సినిమాలు,శంకర్ అపరిచితుడు రీమేక్
  Fgjkh

  ఇక రామ్ చరణ్‌తో శంకర్ తెరకెక్కించబోయే సినిమాలో మరో ఇంపార్టెంట్ రోల్ ఉందట. ఈ క్యారెక్టర్‌ను తెలుగులో చిరంజీవి లేదా పవన్ కళ్యాణ్‌తో చేయించాలనే ఆలోచనలో శంకర్ ఉన్నాడట. మరోవైపు హిందీలో ఈ పాత్రను సల్మాన్ ఖాన్ లేదా రణ్‌వీర్ సింగ్‌‌తో చేయించాలనే ఆలోచనలో ఉన్నాడట. ఇక హిందీలో రణ్‌వీర్ సింగ్‌తో ‘అపరిచితుడు’ రీమేక్ చేస్తున్నట్టు కాబట్టి.. అతనే నటించే అవకాశాలున్నాయి. మరోవైపు కన్నడలో ఈ పాత్రను సుదీప్ లేదా ఉపేంద్ర చేయించాలనే ఆలోచనలో శంకర్ ఉన్నాడట. ఇక తమిళంలో సూర్య లేదా విజయ్ సేతుపతితో ఆ పాత్రను చేయించాలనే ఆలోచనలో శంకర్ ఉన్నాడట. ఇక మలయాళంలో మాత్రం మోహన్ లాల్‌తో ఈ పాత్ర కోసం అనుకుంటున్నారు. మొత్తంగా ప్యాన్ ఇండియా లెవల్లో ఆయా భాషల్లో సూపర్ స్టార్స్‌ను  ఈ సినిమాలో నటింప చేయడానికి శంకర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడట. మొత్తంగా ఆయా స్టార్స్ రామ్ చరణ్ సినిమాలో యాక్ట్ చేయడానికి ఒప్పుకుంటారా లేదా అనేది చూడాలి.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Dil raju, Kollywood, Ram Charan, Shankar, Tollywood

  ఉత్తమ కథలు