Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మెగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. దర్శకుడు శంకర్ కూడా తమిళంలో హిందీలో కాకుండా ఇప్పటి వరకు వేరే భాషల్లో సినిమాలు తెరకెక్కించలేదు. ఇపుడు తెలుగులో తొలిసారి దర్శకుడిగా తన సత్తా చాటడానికి రెడీ అవుతున్నాడు. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా రావడంతో ఓ రేంజ్‌లో అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుండి ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ గురించి, సంగీత దర్శకుడు గురించి ఇలా పలురకాల రూమర్స్ వినిపించాయి. ఇక తాజాగా ఆ సినిమా గురించి మరోక ఇంట్రెస్టింగ్ వార్త హల్ చల్ చేస్తోంది. శంకర్ ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో నాలుగు దక్షిణాది భాషలతో పాటు హిందీలో ఏక కాలంలో నిర్మిస్తున్నారు.
ఇక రామ్ చరణ్‌తో శంకర్ తెరకెక్కించబోయే సినిమాలో మరో ఇంపార్టెంట్ రోల్ ఉందట. ఈ క్యారెక్టర్‌ను తెలుగులో చిరంజీవి లేదా పవన్ కళ్యాణ్‌తో చేయించాలనే ఆలోచనలో శంకర్ ఉన్నాడట. మరోవైపు హిందీలో ఈ పాత్రను సల్మాన్ ఖాన్ లేదా రణ్‌వీర్ సింగ్‌తో చేయించాలనే ఆలోచనలో ఉన్నాడట. ఇక హిందీలో రణ్‌వీర్ సింగ్‌తో ‘అపరిచితుడు’ రీమేక్ చేస్తున్నట్టు కాబట్టి.. అతనే నటించే అవకాశాలున్నాయి. మరోవైపు కన్నడలో ఈ పాత్రను సుదీప్ లేదా ఉపేంద్ర చేయించాలనే ఆలోచనలో శంకర్ ఉన్నాడట. ఇక తమిళంలో సూర్య లేదా విజయ్ సేతుపతితో ఆ పాత్రను చేయించాలనే ఆలోచనలో శంకర్ ఉన్నాడట. ఇక మలయాళంలో మాత్రం మోహన్ లాల్‌తో ఈ పాత్ర కోసం అనుకుంటున్నారు. మొత్తంగా ప్యాన్ ఇండియా లెవల్లో ఆయా భాషల్లో సూపర్ స్టార్స్‌ను ఈ సినిమాలో నటింప చేయడానికి శంకర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడట. మొత్తంగా ఆయా స్టార్స్ రామ్ చరణ్ సినిమాలో యాక్ట్ చేయడానికి ఒప్పుకుంటారా లేదా అనేది చూడాలి.
హీరోయిన్‌గా కియారా అద్వానీ నటిస్తున్నట్లు టాక్. కియారా గతంలో రామ్ చరణ్ సరసన వినయ విదేయ రామలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు బోయపాటి దర్శకత్వం వహించాడు. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.ఇక శంకర్ రామ్ చరణ్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాకి సంగీతం ఎవరు అందిస్తున్నారు.. అంటూ సోషల్ మీడియాలో ఒకటే టాక్ నడుస్తోంది. కాగా వస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమాకు యువ సంగీత దర్శకుడు అనిరుధ్ స్వరాలను సమకూర్చనున్నాడట. ఇప్పటికే శంకర్ “భారతీయుడు 2” కు పని చేస్తున్న అనిరుధ్ మళ్లీ దీనికి సంగీతం అందివ్వనున్నట్టుగా గాసిప్స్ మొదలయ్యాయి. ఇక శంకర్ ముందుగా కమల్ హాసన్‌తో భారతీయుడు 2 సినిమా తర్వాత ఈ మూవీ పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇక అనిరుధ్ విషయానికి వస్తే.. ఆయన గతంలో పవన్ కళ్యాన్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన అజ్ఞాతవాసి సినిమాకు సంగీతాన్ని అందించిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఆయన నాని గ్యాంగ్ లీడర్‌కు నితిన్ ‘అ..ఆ’కు కూడా అందించాడు. ఇక ప్యాన్ ఇండియా లెవల్లో భారీగా నిర్మితమవుతోన్న ఈ సినిమా రూ. 200 కోట్ల బడ్జెట్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమా విషయానికి వస్తే.. రామ్ చరణ్, రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఆర్ ఆర్ ఆర్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్‌తో పాటు, ఎన్టీఆర్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. వీరికి జంటగా ఆలియా భట్, ఒలివియా మోరీస్ నటిస్తున్నారు. ఈ సినిమా ఆక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నా కరోనా కారణంగా ఈ సినిమా వాయి పడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటోంది. రామ్ చరణ్ రాజమౌళి ఆర్ ఆర్ ఆర్‌తో పాటు కొరటాల శివ ఆచార్యలో నటిస్తున్నాడు. చిరంజీవి ప్రధాన పాత్ర పోషిస్తోన్న ఈ సినిమాలో చరణ్ ఓ అరగంట పాటు కనిపిస్తాడట. ఈ సినిమా మే 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల తేతదిని ప్రకటించినా.. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ సినిమాను పోస్ట్ పోన్ చేసే అవకాశాలున్నాయి. ఈ చిత్రంలో చిరంజీవి సరసన నటిస్తుంటే.. పూజా హెగ్డే, రామ్ చరణ్ సరసన నటిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, Mohanlal, Pawan kalyan, Ram Charan, Salman khan, Shankar, Sudeep, Upendra, Vijay Sethupathi