Ram Charan - Shankar : శంకర్, రామ్ చరణ్ సినిమాలో ఆ భామనే ఫైనల్ చేసారా..

శంకర్, రామ్ చరణ్ : Twitter

Ram Charan - Shankar : శంకర్, రామ్ చరణ్ సినిమాలో ఆ భామనే ఫైనల్ చేసారా.. అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. వివరాల్లోకి వెళితే.. రామ్

 • Share this:
  Ram Charan - Shankar : శంకర్, రామ్ చరణ్ సినిమాలో ఆ భామనే ఫైనల్ చేసారా.. అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. వివరాల్లోకి వెళితే.. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో దిల్ రాజు సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ మూడు అడుగులు ముందుకు .. ఆరు అడుగులు వెనక్కి అన్నట్టు వ్యవహారం నడుస్తోంది. ఐతే.. శంకర్, దిల్ రాజు కాంబినేషన్‌లో సినిమా ఎపుడో తెరకెక్కాల్సింది. అది కూడా కమల్ హాసన్‌తో ‘భారతీయుడు 2’ సినిమా. అప్పట్లో ఈ మూవీపై అఫీషియల్  ప్రకటన కూడా చేసారు. ఆ తర్వాత ఏమైందో  ఈ ప్రాజెక్ట్‌ను దిల్ రాజు చేయనని చెప్పడంతో శంకర్, కమల్ హాసన్ ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్‌లో చేసారు. మరోవైపు దిల్ రాజు.. ‘భారతీయుడు 2’ సినిమా అపుడు శంకర్ పెద్ద మొత్తంలో అడ్వాన్స్ కూడా ఇచ్చారు.  ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వలేదు. దానికి బదులు దిల్ రాజు బ్యానర్‌లో ఓ సినిమా చేస్తానని చెప్పారు. దీంతో దిల్ రాజు.. దర్శకుడు శంకర్‌‌, రామ్ చరణ్ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసారు.

  ఐతే.. శంకర్ మాత్రం కమల్ హాసన్‌తో ‘భారతీయుడు 2’ సినిమాను పూర్తి చేయాలి. కానీ ఇప్పటికే ఈ సినిమా పలు కారణాలతో షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది.  మరోవైపు ఈ సినిమాలో దివంగత నటుడు వివేక్‌ నటించారు. ఆయన చనిపోవడంతో ఆ సీన్స్ అన్ని రీ షూట్ చేయాలని నిర్మాతలకు శంకర్ సూచించారు. మరోవైపు వివేక్‌తో షూట్ చేయాల్సిన సీన్స్ ఎవరితో చేస్తారా అనేది చూడాలి.  మరో రెండు నెలలు చేస్తే కానీ ఈ ప్రాజెక్ట్ పూర్తి కాదు.  మరోవైపు లైకా ప్రొడక్షన్స్ వాళ్లు ముందుగా కమల్ హాసన్‌తో ‘భారతీయుడు 2’ సినిమాను పూర్తి చేసిన తర్వాత కానీ వేరే సినిమా చేయడానికి వీలు లేదు అంటూ కోర్టు కెక్కరు. దీంతో ఎపుడో పట్టాలెక్కాల్సిన  రామ్ చరణ్, శంకర్ సినిమా మరింత ఆలస్యమవుతూ వచ్చింది. తాజాగా భారతీయుడు సినిమా విషయంలో శంకర్‌కు ఊరట లభించింది. దీంతో రామ్ చరణ్‌తో చేయబోయే సినిమా విషయమై ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టారు.

  Shankar - Ram Charan - Dil Raju Mega Power Star Ram Charan Dil Raju Mets Director Shankar For Pan India Project,Shankar - Ram Charan - Dil Raju: దర్శకుడు శంకర్‌తో హీరో రామ్ చరణ్, నిర్మాత దిల్ రాజు ప్రత్యేక భేటి..
  రామ్ చరణ్,శంకర్, దిల్ రాజు (Twitter/Photo)


  తమన్ ఆధ్వర్యంలో కొన్ని పాటలను కూడా రికార్డు కూడా మొదలు పెట్టారు.  ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన  కియారా అద్వానీ  దాదాపు కన్ఫామ్ అయిందనే చెప్పాలి. త్వరలో అఫీషియల్ ప్రకటన చేయనున్నారు. ఇప్పటికే కియారా అద్వానీ రామ్ చరణ్ సరసన ‘వినయ విధేయ రామ’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే కదా. మరోవైపు కియారా అద్వానీ బాలీవుడ్‌లో శంకర్ తెరకెక్కిస్తోన్న ‘అపరిచితుడు’ లో ఈమె ఫైనల్ చేసినట్టు సమాచారం.  ఇక ఈ సినిమాలో రామ్ చరణ్.. తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం.ప్యాన్ ఇండియా లెవల్లో భారీగా నిర్మితమవుతోన్న ఈ సినిమా రూ. 200 కోట్ల బడ్జెట్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. నిర్మాతగా దిల్ రాజు 50వ చిత్రం. దీంతో ఈ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.

  Ram Charan new look goes viral and Photos with hot beauty Kiara Advani was superb pk రాజమౌళి సినిమా చేస్తున్నాడంటే కచ్చితంగా అందులో హీరో కూడా ఏదో ఓ కొత్త లుక్కులో కనిపిస్తుంటాడు. తన సినిమా కోసం అలా మార్చేసుకుంటాడు ఈ దర్శక ధీరుడు. ram charan,ram charan twitter,ram charan instagram,ram charan kiara advani,ram charan kiara advani look,ram charan kiara advani birthday,rrr movie,rrr movie shooting,ram charan new look,ram charan,ram charan new movie,ram charan movies,ram charan look,ram charan latest movie,ram charan new movie look,ram charan first look,ram charan fans,ram charan and sukumar movie first look,ram charan new look rrr,ram charan new look in rrr,telugu cinema,రామ్ చరణ్,రామ్ చరణ్ న్యూ లుక్,రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు,తెలుగు సినిమా,రామ్ చరణ్ కియారా అద్వానీ
  రామ్ చరణ్ సరసన మరోసారి,కియారా అద్వానీ (ట్విట్టర్ ఫోటో)


  ఈ సినిమాను కూడా శంకర్ తనదైన శైలిలో సోషల్ మెసెజ్‌తో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఇందులో రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ నుంచి పాలిటిక్స్‌లోకి  వచ్చి వ్యవస్థను చక్కదిద్దే పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా అర్జున్ నటించిన ‘ఒకే ఒక్కడు’ సినిమాకు సీక్వెల్ అనే సమాచారం జరుగుతోంది. అందులో జర్నలిస్ట్ నుంచి ముఖ్యమంత్రి అయితే... ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్ర నుంచి సీఎం స్థాయికి ఎదిగే పాత్ర ఉంటుందనేది కోలీవుడ్ సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇదే స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారా లేదా తెలియాల్సి ఉంది.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: