హోమ్ /వార్తలు /సినిమా /

Ram Charan - Shankar : రామ్ చరణ్, శంకర్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం..

Ram Charan - Shankar : రామ్ చరణ్, శంకర్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం..

Photo Twitter

Photo Twitter

Ram Charan - Shankar :  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబినేషన్‌లో ఎంతో అట్టహాసంగా ఓ సినిమా పూజా కార్యక్రమాలతో  ప్రారంభమైన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.

ఇంకా చదవండి ...

  Ram Charan - Shankar :  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబినేషన్‌లో ఎంతో అట్టహాసంగా ఓ సినిమా పూజా కార్యక్రమాలతో  ప్రారంభమైన సంగతి తెలిసిందే కదా. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నిదిల్ రాజు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీ ముహూర్తపు సన్నివేశానికి మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) క్లాప్ కొట్టారు.  దర్శకుడు రాజమౌళి (Rajamouli), బాలీవుడ్ క్రేజీ హీరో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేసారు. ఇక  శంకర్ ఈ సినిమా కాన్సెప్ట్‌ పోస్టర్ కోసమే దాదాపు రూ. 2 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు పూణెలో ప్రారంభమైంది.

  అంతేకాదు ఈ మూవీ ముహూర్తపు సన్నివేశానికి సంబంధించిన వీడియో గ్లింప్స్‌ను కూడా విడుదల చేసారు.ప్యాన్ ఇండియా లెవల్లో భారీగా నిర్మితమవుతోన్న ఈ సినిమా రూ. 200 కోట్ల బడ్జెట్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘విశ్వంభర’ అనే టైటిల్ అనుకుంటున్నారు. డా. సి.నారాయణ రెడ్డికి జ్ఞానపీఠ్ అవార్డు తెచ్చి పెట్టిన ‘విశ్వంభర’ టైటిల్ ఏ మేరకు న్యాయం చేస్తారనేది చూడాలి. మిగతా భాషల్లో ఇదే టైటిల్ ఫిక్స్ చేస్తారా.. లేకుంటే వేరే ఏదైనా టైటిల్ పెడతారా అనేది చూడాలి.

  Chiranjeevi : చిరంజీవితో సాయి ధరమ్ తేజ్ వాళ్ల నాన్న నిర్మించిన ఈ సినిమా తెలుసా..


  ఈ సినిమాను శంకర్ (Shankar) పరిమిత బడ్జెట్‌లో తెరకెక్కిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ సినిమాను శంకర్.. ఈ సినిమాను శంకర్ దేశ చట్టాలను ఉపయోగించుకొని కార్పోరేట్ శక్తులు ఏ విధంగా ఎదుగుతున్నాయో తన సినిమాలో చూపించనున్నట్టు సమాచారం. రామ్ చరణ్ ఈ సినిమాలో ఐఏఎస్ అధికారి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఇండియన్ పీనల్ కోడ్‌లోని ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని పలు సెక్షన్లను శంకర్ ఈ సినిమాలో ప్రస్తావించనున్నట్టు సమాచారం.  సినిమాను కూడా శంకర్ తనదైన శైలిలో సోషల్ మెసెజ్‌తో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా అర్జున్ నటించిన ‘ఒకే ఒక్కడు’ సినిమాకు సీక్వెల్ అనే సమాచారం జరుగుతోంది.

  Tollywood Thatha Manavallu : ఎన్టీఆర్ టూ నాగ చైతన్య వయా అల్లు అర్జున్, రానా వరకు టాలీవుడ్‌లో సత్తా చూపెడుతోన్న మనవళ్లు..

  అందులో జర్నలిస్ట్ నుంచి ముఖ్యమంత్రి అయితే... ఇందులో ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర నుంచి సీఎం స్థాయికి ఎదిగే పాత్ర ఉంటుందనేది కోలీవుడ్ (Kollywood) సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇదే స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారా లేదా తెలియాల్సి ఉంది.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Dil raju, Kiara advani, Kollywood, Ram Charan, Shankar, Tollywood

  ఉత్తమ కథలు