Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మెగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్లో రావడంతో పాటు దిల్ రాజు (Dil Raju)నిర్మాణంలో ఈ సినిమా రావడంతో అభిమానుల్లో ఓ రేంజ్లో అంచనాలు ఏర్పడ్డాయి. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రెండు భారీ మల్టీ స్టారర్ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి వాటి తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తాడా అన్న సంశయంలో మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ దర్శకుడు శంకర్‌తో సినిమా (Ram Charan Shankar film) అనౌన్స్ చెయ్యడంతో ఒక్కసారిగా విపరీతమైన అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి తాజాగా ఓ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విషయం ఏమంటే ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ మీడియా సంస్థ ZEE ఛానెల్ దాదాపు రూ. 200 కోట్ల రూపాయల కి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాకు స్ట్రీమింగ్ భాగస్వామిగా ZEE5 ఓటీటీతో డీల్ కుదర్చుకుందట. ఇక దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో సునీల్, అంజలి, శ్రీకాంత్, నవీన్ చంద్ర కనిపించనున్నారు. 2023 సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సంగీత సంచలనం, థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.
ఇక ఈ చిత్రంలో నటిస్తున్న కియారా విషయానికి వస్తే.. ఆమె గతంలో తెలుగులో భరత్ అనే నేనుతో పాటు వినయ విధేయ రామలోను తన అందచందాలతో ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా గురించి మరోక ఇంట్రెస్టింగ్ వార్త హల్ చల్ చేస్తోంది. శంకర్ రామ్ చరణ్ మూవీలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) కూడా నటించనున్నట్లు వినిపిస్తోన్న టాక్. ఈ సినిమాలో సల్మాన్‌కు ఓ కీలక పోలీస్ ఆఫీసర్ పాత్ర ఉంటుందని బాలీవుడ్ మీడియా రాస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ప్యాన్ ఇండియా లెవల్లో భారీగా నిర్మితమవుతోన్న ఈ సినిమా 250 కోట్ల బడ్జెట్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది.
Anchor Anasuya : సముద్రపు ఒడ్డున అనసూయ హాట్ షో.. మరోసారి పరువాల విందు చేసిన జబర్దస్త్ బ్యూటీ..
ఇక రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తోన్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ ఆర్ ఆర్ (RRR) సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో రామ్ చరణ్‌తో పాటు, ఎన్టీఆర్ (NTR) మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వీరికి జంటగా ఆలియా భట్ (Alia Bhatt), ఒలివియా మోరీస్ (Olivia Morris) నటిస్తున్నారు.
ఈ సినిమా జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలకావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ఈ సినిమా విడుదల మరోసారి వాయిదా పడింది. వచ్చే వేసవిలో విడుదలకానుందని తెలుస్తోంది. ఈ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాతో పాటు రామ్ చరణ్ కొరటాల శివ ఆచార్య (Acharya )లో నటిస్తున్నారు. చిరంజీవి ప్రధాన పాత్ర పోషిస్తోన్న ఈ సినిమాలో చరణ్ ఓ అరగంట పాటు కనిపిస్తారట. ఈ సినిమా ఏప్రిల్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. కాజల్ (Kajal Aggerwal) చిరంజీవి (Chiranjeevi) సరసన నటిస్తుంటే.. పూజా హెగ్డే రామ్ చరన్ సరసన నటిస్తున్నారు. ఇక మరోవైపు రామ్ చరణ్ హీరోగా మరో కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన విడుదలైంది. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ కొత్త సినిమా తెరకెక్కనుంది. దసరా సందర్భంగా ఈ ప్రకటన విడుదలైంది. అయితే ఈ సినిమా శంకర్ సినిమా తర్వాత పట్టాలెక్కనుందని తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kiara advani, Ram Charan, Shankar, Tollywood news