Ram Charan | Shankar : రామ్ చరణ్ శంకర్ సినిమాకు లైన్ క్లియర్.. ముహూర్తం ఫిక్స్..

Ram Charan and Shankar Photo : Twitter

Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మెగా డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే.

  • Share this:
    Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మెగా డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్‌లో రావడంతో పాటు దిల్ రాజు  (Dil Raju)నిర్మాణంలో ఈ సినిమా రావడంతో అభిమానుల్లో ఓ రేంజ్‌లో అంచనాలు ఏర్పడ్డాయి. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రెండు భారీ మల్టీ స్టారర్ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి వాటి తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తాడా అన్న సంశయంలో మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ దర్శకుడు శంకర్ తో సినిమా (Ram Charan Shankar film) అనౌన్స్ చెయ్యడంతో ఒక్కసారిగా విపరీతమైన అంచనాలు పెరిగాయి. అది అలా ఉంటే ఈ సినిమా గురించి మరో అప్ డేట్ వచ్చింది. మెగా అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ముహూర్తం ఫిక్స్ అయ్యింది. రామ్ చరణ్ శంకర్ సినిమా వచ్చే నెల సెప్టెంబర్ 8న లాంఛనంగా ప్రారంభంగా కానుందని తెలుస్తోంది. ఆరోజు పూజా కార్యక్రమాలను నిర్వహించి.. రెగ్యులర్ షూట్ రెగ్యూలర్ షూట్ మొదలు పెట్టనున్నారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో కియారా అద్వానీ (Kiara advani) హీరోయిన్ గా నటిస్తోంది. కియారా గతంలో తెలుగులో భరత్ అనే నేనుతో పాటు వినయ విధేయ రామలోను తన అందచందాలతో అదరగొట్టింది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.

    ఇక ఈ సినిమా గురించి మరోక ఇంట్రెస్టింగ్ వార్త హల్ చల్ చేస్తోంది. శంకర్‌ రామ్‌ చరణ్‌ మూవీలో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) కూడా నటించనున్నట్లు వినిపిస్తోన్న టాక్. ఈ సినిమాలో సల్మాన్‌కు ఓ కీలక పోలీస్‌ ఆఫీసర్‌ పాత్ర ఉంటుందని బాలీవుడ్‌ మీడియా రాస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాను దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. ప్యాన్ ఇండియా లెవల్లో భారీగా నిర్మితమవుతోన్న ఈ సినిమా 200 కోట్ల బడ్జెట్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది.

    ఇక రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తోన్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ ఆర్ ఆర్ (RRR) సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో రామ్ చరణ్‌తో పాటు, ఎన్టీఆర్ (NTR) మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వీరికి జంటగా ఆలియా భట్ (Alia Bhatt), ఒలివియా మోరీస్ (Olivia Morris) నటిస్తున్నారు. ఈ సినిమా ఆక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. అయితే ఈ సినిమా విడుదల మరోసారి వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమా పాటల షూటింగ్‌ను జరుపుకుంటోంది. రామ్ చరణ్ రాజమౌళి ఆర్ ఆర్ ఆర్‌తో పాటు కొరటాల శివ ఆచార్య (Acharya )లో నటిస్తున్నారు. చిరంజీవి ప్రధాన పాత్ర పోషిస్తోన్న ఈ సినిమాలో చరణ్ ఓ అరగంట పాటు కనిపిస్తాడట. ఈ సినిమా మే 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకావాల్సి ఉండగా విడుదల వాయిదా పడింది. కాజల్ (Kajal Aggerwal) చిరంజీవి (Chiranjeevi) సరసన నటిస్తుంటే.. పూజా హెగ్డే రామ్ చరన్ సరసన నటిస్తోంది.
    Published by:Suresh Rachamalla
    First published: