Ram Charan - Shankar : శంకర్-రామ్ చరణ్ సినిమాలో కియారా అద్వానీ.. అధికారిక ప్రకటన..

Kiara Advani and Shankar Photo : Twitter

Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మెగా డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో రకరకాల రూమర్స్ వినపడ్డాయి.

  • Share this:
    Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మెగా డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో రకరకాల రూమర్స్ వినపడ్డాయి. ఈ క్రమంలో తాజాగా చిత్రబృందం రామ్ చరణ్ సరసన నటించే భామను ప్రకటించారు. కియారా అద్వానీ ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన నటించనుందని ప్రకటించింది. కియారా అద్వానీ గతంలో రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామలో నటించి తన అందచందాలతో అదరగొట్టింది. ఇక ఈ తాజా సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ప్యాన్ ఇండియా సినిమాగా వస్తోన్న ఈ చిత్రంలో దేశవ్యాప్తంగా పేరొందిన ఆర్టిస్ట్‌లు నటించబోతున్నారట. ఇక ఈ సినిమా గురించి మరో క్రేజీ వార్త ఏమంటే.. శంకర్‌ రామ్‌ చరణ్‌ మూవీలో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ కూడా నటించనున్నట్లు టాక్. త్వరలోనే శంకర్‌, రామ్‌చరణ్‌లు సల్మాన్‌ కలిసి ఆయన పాత్ర గురించి వివరిస్తారని తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్‌ త్వరలో ప్రారంభమౌతుందని, సినిమాలో సల్మాన్‌కు ఓ కీలక పోలీస్‌ ఆఫీసర్‌ పాత్ర ఉంటుందని బాలీవుడ్‌ మీడియా రాస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.


    ఈ సినిమాకు థమన్ సంగీతం అందించనున్నారు. ప్యాన్ ఇండియా లెవల్లో భారీగా నిర్మితమవుతోన్న ఈ సినిమా 200 కోట్ల బడ్జెట్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమా విషయానికి వస్తే.. రామ్ చరణ్, రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఆర్ ఆర్ ఆర్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్‌తో పాటు, ఎన్టీఆర్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వీరికి జంటగా ఆలియా భట్, ఒలివియా మోరీస్ నటిస్తున్నారు. ఈ సినిమా ఆక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

    ఇటీవలే ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంది. రేపు ఈ టీమ్ ఉక్రెయిన్ వెళ్లనుంది. అక్కడ ఓ పాటను చిత్రీకరించనున్నారు. ఇక రామ్ చరణ్ రాజమౌళి ఆర్ ఆర్ ఆర్‌తో పాటు కొరటాల శివ ఆచార్యలో కూడా నటిస్తున్నారు. చిరంజీవి ప్రధాన పాత్ర పోషిస్తోన్న ఈ సినిమాలో చరణ్ ఓ అరగంట పాటు కనిపిస్తారట. ఈ సినిమా మే 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకావాల్సి ఉండగా.. కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. కాజల్ చిరంజీవి సరసన నటిస్తుంటే.. పూజా హెగ్డే రామ్ చరన్ సరసన నటిస్తోంది.
    Published by:Suresh Rachamalla
    First published: