హోమ్ /వార్తలు /సినిమా /

Ram Charan | Shankar : కియారా అద్వానీతో రామ్ చరణ్ ఆట పాట.. 12 రోజులుగా పూణేలో..

Ram Charan | Shankar : కియారా అద్వానీతో రామ్ చరణ్ ఆట పాట.. 12 రోజులుగా పూణేలో..

Ram Charan and Kiara Advani Photo : Twitter

Ram Charan and Kiara Advani Photo : Twitter

Ram Charan | Shankar : ఓపాట కోసం 12 రోజులను కేటాయించారట రామ్ చరణ్. సాధారణంగా ఒక పాట చిత్రీకరణకు 3 నుంచి 5 రోజులు తీసుకుంటారు. కానీ శంకర్ సినిమాల్లో పాటల సంగతి వేరు. ఆయన సినిమాల్లోని పాటలు భారీతనానికి నిదర్శనంగా ఉంటాయి. 

  రామ్ చరణ్  (Ram Charan) ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా అలా ఉండగానే ఆయన శంకర్ (Shankar) దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇటీవల పూజా కార్యక్రమంతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమా ఇటీవల ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నిదిల్ రాజు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇక అది అలా ఉంటే ఈ సినిమా గురించి తాజాగా మరో అప్ డేట్ వచ్చింది. ప్రస్తుతం ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది. ఈ పాట కోసం 12 రోజులను కేటాయించారట రామ్ చరణ్. సాధారణంగా ఒక పాట చిత్రీకరణకు 3 నుంచి 5 రోజులు తీసుకుంటారు. కానీ శంకర్ సినిమాల్లో పాటల సంగతి వేరు. ఆయన సినిమాల్లోని పాటలు భారీతనానికి నిదర్శనంగా ఉంటాయి.  ప్రస్తుతం దీనికి సంబంధించిన షూట్ పూణేలో జరుగుతుందని తెలుస్తోంది. ఈ పాట కూడా రామ్ చరణ్, కియారాలపై ఓ రేంజ్‌లో చిత్రీకరిస్తున్నారట. దీనికి తోడు దిల్ రాజు కూడా ఖర్చుకు వెనుకాడకుండా నిర్మిస్తున్నారట.

  ప్యాన్ ఇండియా లెవల్లో భారీగా నిర్మితమవుతోన్న ఈ సినిమా రూ. 200 కోట్ల బడ్జెట్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘విశ్వంభర’ అనే టైటిల్ అనుకుంటున్నారని టాక్. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.

  Janhvi Kapoor : ప్రకృతి ఒడిలో శ్రీదేవి కూతురు పరువాల విందు... అదిరిన జాన్వీ పిక్స్..

  ఈ సినిమా ఇలా ఉండగానే రామ్ చరణ్ మరో సినిమాను కూడా లైన్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమాకు ఓకే అన్నట్లు టాక్ రాగా.. ఇటీవల దసరా సందర్భంగా రామ్ చరణ్ ఇంట్లో ప్రశాంత్ నీల్ ప్రత్యక్షమయ్యారు. దీంతో ఈ సినిమా విషయంలో మరింత క్లారిటీ వచ్చింది. అంతేకాదు ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దానయ్య నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదలకావాల్సి ఉంది.

  ఇక మరోవైపు రామ్ చరణ్ హీరోగా మరో కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన విడుదలైంది. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ కొత్త సినిమా తెరకెక్కనుంది. దసరా సందర్భంగా ఈ ప్రకటన విడుదలైంది. అయితే ఈ సినిమా శంకర్ సినిమా తర్వాత పట్టాలెక్కనుంది.

  Varudu Kaavalenu : వరుడు కావలెను ప్రిరిలీజ్ ఈవెంట్‌కు హాజరు కానున్న అల్లు అర్జున్..

  ఇక రామ్ చరణ్ నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ విషయానికి వస్తే.. రౌద్రం రణం రుథిరం పేరుతో వస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్‌ (Ram Charan)తో పాటు (NTR) ఎన్టీఆర్ నటిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఈ పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు.

  వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ (Alia Bhatt) నటిస్తున్నారు. ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోందని గతంలో ప్రకటించగా... ఆ విడుదలను (RRR Release Date) మరోసారి వాయిదా వేసింది చిత్రబృందం.

  ఈ సినిమాను జనవరి 7న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్‌ల నటిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Kiara advani, Ram Charan, Shankar, Tollywood news

  ఉత్తమ కథలు