హోమ్ /వార్తలు /సినిమా /

Ram Charan | Shankar : మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న శంకర్ రామ్ చరణ్‌‌ల చిత్రం..

Ram Charan | Shankar : మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న శంకర్ రామ్ చరణ్‌‌ల చిత్రం..

250 కోట్లతో దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇందులో పొలిటికల్ ఇష్యూస్ చాలానే చర్చించబోతున్నాడు దర్శకుడు శంకర్. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా వస్తుందని మొదటి నుంచి వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమాలో చరణ్ ముందు కలెక్టర్‌గా ఉన్నా.. ఆ తర్వాత 'అభ్యుదయ పార్టీ' అనే కల్పిత రాజకీయ పార్టీ నేతగా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. అక్కడ్నుంచే కథ కీలక మలుపు తిరుగుతుందని ప్రచారం జరుగుతుంది.

250 కోట్లతో దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇందులో పొలిటికల్ ఇష్యూస్ చాలానే చర్చించబోతున్నాడు దర్శకుడు శంకర్. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా వస్తుందని మొదటి నుంచి వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమాలో చరణ్ ముందు కలెక్టర్‌గా ఉన్నా.. ఆ తర్వాత 'అభ్యుదయ పార్టీ' అనే కల్పిత రాజకీయ పార్టీ నేతగా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. అక్కడ్నుంచే కథ కీలక మలుపు తిరుగుతుందని ప్రచారం జరుగుతుంది.

Ram Charan | Shankar : ఈ సినిమా గురించి తాజాగా మరో అప్ డేట్ వచ్చింది. ఇటీవల ఓ పాట చిత్రీకరణ కోసం పూణే వెళ్లిన చిత్రబృందం ఈ తాజా షెడ్యూల్‌ను పూర్తి చేసుకుందట. ఈ సినిమా అక్టోబర్ 22న పూణేలో ప్రారంభమైంది. ఓ భారీ యాక్షన్‌ సన్నివేశంతో పాటు ఓ పాటను ఈ షెడ్యూల్‌లో పూర్తి చేసిందట చిత్ర బృందం. ఇక రెండో షెడ్యూల్ దీపావళి తర్వాత మొదలుకానుందని తెలుస్తోంది.

ఇంకా చదవండి ...

  రామ్ చరణ్  (Ram Charan) ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా అలా ఉండగానే ఆయన శంకర్ (Shankar) దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య పూజా కార్యక్రమం ఈ సినిమా ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నిదిల్ రాజు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇక అది అలా ఉంటే ఈ సినిమా గురించి తాజాగా మరో అప్ డేట్ వచ్చింది. ఇటీవల ఓ పాట చిత్రీకరణ కోసం పూణే వెళ్లిన చిత్రబృందం ఈ తాజా షెడ్యూల్‌ను పూర్తి చేసుకుందట. ఈ సినిమా అక్టోబర్ 22న పూణేలో ప్రారంభమైంది. ఓ భారీ యాక్షన్‌ సన్నివేశంతో పాటు ఓ పాటను ఈ షెడ్యూల్‌లో పూర్తి చేసిందట చిత్ర బృందం. ఇక రెండో షెడ్యూల్ దీపావళి తర్వాత మొదలుకానుందని తెలుస్తోంది.

  ఈ హై బడ్జెట్ పొలిటికల్ థ్రిల్లర్‌లో టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్, మలయాళ హీరో సురేష్ గోపి నెగిటివ్ రోల్స్‌లో కనిపించనున్నారు. ఇక మీగితా పాత్రల్లో సునీల్, అంజలి, నవీన్ చంద్ర కనిపించనున్నారు. ప్యాన్ ఇండియా లెవల్లో భారీగా నిర్మితమవుతోన్న ఈ సినిమా రూ. 200 కోట్ల బడ్జెట్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘విశ్వంభర’ అనే టైటిల్ అనుకుంటున్నారని టాక్. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.

  Gambling at the farmhouse : జూదశాలగా నాగశౌర్య ఫామ్ హౌస్.. పోలీసుల దాడిలో 20 మంది పట్టుబడి..

  ఇక మరోవైపు రామ్ చరణ్ హీరోగా మరో కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన విడుదలైంది. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ కొత్త సినిమా తెరకెక్కనుంది. దసరా సందర్భంగా ఈ ప్రకటన విడుదలైంది. అయితే ఈ సినిమా శంకర్ సినిమా తర్వాత పట్టాలెక్కనుంది.

  ఈ సినిమా ఇలా ఉండగానే రామ్ చరణ్ మరో సినిమాను కూడా లైన్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమాకు ఓకే అన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దానయ్య నిర్మించనున్నారు. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదలకావాల్సి ఉంది. ఇక రామ్ చరణ్ నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ విషయానికి వస్తే.. రౌద్రం రణం రుథిరం పేరుతో వస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్‌ (Ram Charan)తో పాటు (NTR) ఎన్టీఆర్ నటిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఈ పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు.

  Balakrishna : బాలకృష్ణ సరసన శృతి హాసన్‌తో పాటు మరో హీరోయిన్‌..

  వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ (Alia Bhatt) నటిస్తున్నారు. ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోందని గతంలో ప్రకటించగా... ఆ విడుదలను (RRR Release Date) మరోసారి వాయిదా వేసింది చిత్రబృందం.

  ఈ సినిమాను జనవరి 7న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్‌ల నటిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Ram Charan, Shankar

  ఉత్తమ కథలు