Ram Charan - Shankar : శంకర్, రామ్ చరణ్ సినిమాకు అదిరిపోయే క్రేజీ టైటిల్.. ?

రామ్ చరణ్,శంకర్, దిల్ రాజు (Twitter/Photo)

Ram Charan - Shankar : శంకర్, రామ్ చరణ్ (Ram Charan Shankar film) సినిమా కాంబినేషన్‌కు అంతా సిద్ధం అయింది. ఈ సినిమాకు అదిరిపోయే టైటిల్ ప్రచారంలో ఉంది.

 • Share this:
  Ram Charan - Shankar : శంకర్, రామ్ చరణ్ (Ram Charan Shankar film) సినిమా కాంబినేషన్‌కు అంతా సిద్ధం అయింది. మరికొన్ని గంటల్లో ఈ సినిమా పూజ కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. కియరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది.  ఈ నేపథ్యంలో ఈ సినిమాకు అదిరిపోయే ఓ క్రేజీ టైటిల్‌ను అనుకున్నట్టు సమాచారం. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. అంతేకాదు ఈ రోజు నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫోటో షూట్.. టెస్ట్ షూట్ కూడా నిర్వహించారు. కియారా గతంలో తెలుగులో భరత్ అనే నేనుతో పాటు వినయ విధేయ రామలోను తన అందచందాలతో అదరగొట్టింది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.

  ఇక ఈ సినిమా గురించి మరోక ఇంట్రెస్టింగ్ వార్త హల్ చల్ చేస్తోంది. శంకర్‌ రామ్‌ చరణ్‌ మూవీలో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) కూడా నటించనున్నట్లు వినిపిస్తోన్న టాక్. ఈ సినిమాలో సల్మాన్‌కు ఓ కీలక పోలీస్‌ ఆఫీసర్‌ పాత్ర ఉంటుందని బాలీవుడ్‌ మీడియా రాస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాను దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు.

  Venkatesh : ఆర్తి అగర్వాల్ సహా వెంకటేష్ టాలీవుడ్‌కు పరిచయం చేసిన భామలు వీళ్లే..

  ప్యాన్ ఇండియా లెవల్లో భారీగా నిర్మితమవుతోన్న ఈ సినిమా 200 కోట్ల బడ్జెట్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘విశ్వంభర’ అనే టైటిల్ అనుకుంటున్నారు. డా. సి.నారాయణ రెడ్డికి జ్ఞానపీఠ్ అవార్డు తెచ్చి పెట్టిన ‘విశ్వంభర’ టైటిల్ ఏ మేరకు న్యాయం చేస్తారనేది చూడాదలి.

  రామ్ చరణ్, శంకర్ (Twitter/Photo)


  ఈ సినిమాను శంకర్ పరిమిత బడ్జెట్‌లో తెరకెక్కిస్తున్నారట.ఇప్పటి వరకు ఏ శంకర్ ఏ సినిమా చేసినా.. ముందుగా అనుకున్న బడ్జెట్‌ కంటే ఎక్కువ ఖర్చు చేసేవారు. అంతేకాదు బడ్జెట్‌ను కంట్రో‌ల్‌ను పెట్టుకొని ఏ సినిమాను తెరకెక్కించలేదు. కానీ రామ్ చరణ్‌తో శంకర్ నిర్మించబోయే సినిమాకు దిల్ రాజు ముందుగానే కండిషన్స్ పెట్టాడట. ఈ సినిమాను ముందుగా అనుకున్న బడ్జెట్‌లోనే కంప్లీట్ చేయాలని మొదటి కండిషన్.

  Balakrishna Industry Hits: మంగమ్మ గారి మనవడు టూ నరసింహనాయుడు వరకు ఇండస్ట్రీ హిట్ సాధించిన బాలకృష్ణ సినిమాలు ఇవే..

  అంతేకాదు ఒకవేళ బడ్జెట్ పెరిగిన శంకర్ రెమ్యునరేషన్‌‌లో కోత విధిస్తామనేది దిల్ రాజు మరో కండిషన్ అట. అందుకే శంకర్ కూడా పకడ్బందిగా ఈ సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నాడట. ఈ సినిమాను కూడా శంకర్ తనదైన శైలిలో సోషల్ మెసెజ్‌తో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఇందులో రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ నుంచి పాలిటిక్స్‌లోకి  వచ్చి వ్యవస్థను చక్కదిద్దే పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.

  Tollywood Thatha Manavallu : ఎన్టీఆర్ టూ నాగ చైతన్య వయా అల్లు అర్జున్, రానా వరకు టాలీవుడ్‌లో సత్తా చూపెడుతోన్న మనవళ్లు..

  ముఖ్యంగా అర్జున్ నటించిన ‘ఒకే ఒక్కడు’ సినిమాకు సీక్వెల్ అనే సమాచారం జరుగుతోంది. అందులో జర్నలిస్ట్ నుంచి ముఖ్యమంత్రి అయితే... ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్ర నుంచి సీఎం స్థాయికి ఎదిగే పాత్ర ఉంటుందనేది కోలీవుడ్ సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇదే స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారా లేదా తెలియాల్సి ఉంది.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: