RC15: రామ్ చరణ్ కోసం శంకర్ భారీ ప్లాన్.. మెగా అభిమానులకు ఇది క్రేజీ అప్డేట్
Photo Twitter
Ram Charan Shankar: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం మరో బిగ్ ప్రాజెక్ట్‌లో భాగమవుతున్నారు. బడా దర్శకులు శంకర్ (Shankar) దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ క్రేజీ అప్డేట్ బయటకొచ్చింది.
ఇటీవలే దర్శక ధీరుడు రాజమౌళితో (SS Rajamouli) కలిసి RRR రూపంలో భారీ సక్సెస్ ఖాతాలో వేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం మరో బిగ్ ప్రాజెక్ట్‌లో భాగమవుతున్నారు. బడా దర్శకులు శంకర్ (Shankar) దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ తొలిసారి త్రిపాత్రాభినయం చేయబోతున్నారట. RC15 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు వస్తున్న అప్ డేట్స్ మెగా అభిమానుల్లో జోష్ నింపుతున్నాయి. తాజాగా అలాంటి ఓ క్రేజీ న్యూస్ బయటకొచ్చింది.
రామ్ చరణ్ - శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ (RC15 Regular Shooting) గత డిసెంబర్లో మొదలైంది. ఓ పక్క భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తూనే చిత్రంలోని కీలక సన్నివేశాల చిత్రీకరణ చేపడుతున్నారు. రాజమహేంద్రవరంలోని గోదావరి పరివాహక ప్రాంతంలో రెండో షెడ్యూల్ షూటింగ్ చేసి చిత్రానికి సంబంధించిన కీలకమైన ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలను కెమెరాలో బంధించారు. ఇటీవలే విశాఖపట్నంలోని సముద్ర తీరంలో మరికొన్ని సీన్స్ షూట్ చేశారు.
కాగా.. ఈ సినిమాలో మునుపెన్నడూ చూడనివిధంగా ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ చూడబోతున్నామట. చిత్ర క్లైమాక్స్ పార్ట్‌లో (RC15 Climax) వచ్చే ఈ ఎపిసోడ్ కోసం శంకర్ ఓ రేంజ్ ప్లాన్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ 20 నిమిషాలు పాటు ఉండనుందని, ఇందుకోసం ఏకంగా 20 కోట్లు కేటాయించారని తెలుస్తోంది. ఈ ఎపిసోడ్లో బ్లాస్టింగ్ సీన్స్ హైలైట్ కానున్నాయట. ఇకపోతే ఈ చిత్రానికి అధికారి అనే టైటిల్ ఫైనల్ చేశారని తెలుస్తోంది. సర్కారోడు అనే టైటిల్ పెడుతున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ చివరి నిమిషంలో శంకర్ తన డిసీజన్ మార్చుకొని అధికారి అనే పేరుకు మొగ్గు చూపుతున్నట్లు ఇన్సైడ్ టాక్.
ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రూపొందిస్తున్న ఈ సినిమాలో ఎలక్షన్ కమీషనర్‌గా రామ్ చరణ్ కనిపించనున్నారని సమాచారం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రాబోతున్న 50వ సినిమా కావడంతో దిల్ రాజు (Dil Raju) ఈ మూవీపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట. ఇందులో చెర్రీ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా.. జయరామ్, అంజలి, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.
Published by:Sunil Boddula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.