RAM CHARAN SAMANTHA AKKINENIS RANGASTHALAM KANNADA DUBBED VERSION RANGASTHALA GETS GOOD RESPONSE IN SANDALWOOD TA
కన్నడనాట కూడా దుమ్ము దులుపుతున్న రామ్ చరణ్, సమంతల ‘రంగస్థలం’..
కన్నడలో హిట్ టాక్‌తో దూసుకుపోతున్న‘రంగస్థల’
‘మగధీర’ తర్వాత సరైన సక్సెస్ లేని మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్..సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ‘రంగస్థలం’ మూవీతో నటన పరంగా విమర్శకుల ప్రశంసలతో పాటు...కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకున్నాడు.తాజాగా ఈ సినిమా కన్నడలో ‘రంగస్థల’గా విడుదలైంది. అంతేకాదు రిలీజైన మార్నింగ్ షోతోనే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.
‘మగధీర’ తర్వాత సరైన సక్సెస్ లేని మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్..సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ‘రంగస్థలం’ మూవీతో నటన పరంగా విమర్శకుల ప్రశంసలతో పాటు...కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకున్నాడు. సమంత హీరోయిన్గా నటించిన ఈ మూవీకి దేవీశ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. మరోవైపు ఈ చిత్రంలో ఇతర పాత్రల్లో నటించిన ఆది పినిశెట్టి, అనసూయ, జగపతిబాబు, ప్రకాష్ రాజ్, నరేశ్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పాత్రకు ఇంపార్టెన్స్ ఇచ్చారు. ‘రంగస్థలం’ చిత్రం తెలుగు బాక్సాఫీస్ దగ్గర రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో పాటు రూ.115 కోట్ల షేర్ రాబట్టినట్టు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు విశ్లేషించాయి. ఒక్క ఓవర్సీస్ మార్కెట్లో ఈ మూవీ మూడున్నర మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టి 2018 టాలీవుడ్ బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్‌గా నిలిచింది.
ఇప్పటికే ‘రంగస్థలం’ తమిళం, మలయాళంలో డబ్ చేసారు. అక్కడ కూడా ఈ సినిమా మంచి విజయాన్నే నమోదు చేసింది. తాజాగా ‘రంగస్థలం’ సినిమాను కన్నడల ‘రంగస్థల’ పేరుతో డబ్ చేసి ఈ శుక్రవారం రిలీజ్ చేసారు. ఈ చిత్రాన్ని కన్నడలలో 85 స్క్రీన్స్‌లో రిలీజ్ చేయగా.. ఒక్క బెంగళూరు సిటీలోనే ఫస్ట్ డే 26 షోస్ ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమాను కన్నడలో జేఎమ్ మూవీస్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు విడుదల చేసారు. కన్నడనాట మార్నింగ్ షోతోనే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.
కన్నడలో ‘రంగస్థల’గా రిలీజైన ‘రంగస్థలం’
శాండిల్‌వుడ్‌లో కొన్నేళ్లుగా డబ్బింగ్ చిత్రాల విడుదలపై నిషేధం ఉంది. అక్కడ వేరే భాషల సినిమాలు డైరెక్ట్‌గా రిలీజవుతుంటాయి. కానీ గతేడాది యశ్ హీరోగా తెరకెక్కిన ‘కేజీఎఫ్’ కన్నడతో పాటు అన్ని భాషల్లో నడవడంతో ..కన్నడ చిత్ర సీమకు చెందిన నిర్మాతలు ..వేరే భాషకు చెందిన సినిమాలను డబ్ చేసి రిలీజ్ చేయోచ్చని తీర్మానం చేసింది. దీంతో అక్కడ డబ్బింగ్ సినిమాల విడుదలకు ఉన్న అడ్డంకులు తొలిగిపోయాయి. దీంతో దశాబ్దాల తర్వాత కన్నడలో డబ్ అవుతున్న తెలుగు సినిమాగా ‘రంగస్థలం’ రికార్డు క్రియేట్ చేసింది. తెలుగులో ‘మాయా బజార్’ తర్వాత మరో సినిమా ఏది కన్నడలో డబ్ కాలేదు. ఇపుడు చాలా ఏళ్ల తర్వాత రంగస్థలం కన్నడ డబ్బింగ్‌తో మరో రికార్డును క్రియేట్ చేసింది. తెలుగులో భారీ సక్సెస్ సాధించిన ‘రంగస్థలం’ కన్నడలో ముందు ముందు ఎలాంటి మెరుపులు మెరిపిస్తుందో చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.