హోమ్ /వార్తలు /సినిమా /

Ram Charan: తండ్రి చిరంజీవితో కలిసి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన రామ్ చరణ్..

Ram Charan: తండ్రి చిరంజీవితో కలిసి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన రామ్ చరణ్..

హోం మంత్రి అమిత్ షాతో  భేటి అయిన చిరు, రామ్ చరణ్ (Twitter/Photo)

హోం మంత్రి అమిత్ షాతో భేటి అయిన చిరు, రామ్ చరణ్ (Twitter/Photo)

Ram Charan: ఆస్కార్ బరిలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా రామ్ చరణ్.. తన తండ్రి చిరుతో కలిసి అమిత్ షాను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Ram Charan: ఆస్కార్ బరిలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా ఈ సినిమాలో నాటు నాటు పాటలో డాన్స్ చేసిన రామ్ చరణ్‌ అమెరికా నుంచి దేశ రాజధాని ఢిల్లిలో లాండ్ అయ్యాడు. ఈ సందర్భంగా ఢిల్లీలో అభిమానులు రామ్ చరణ్‌తో ఫోటోలు, సెల్పీలు దిగేందకు ఎగబడ్డారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) సినిమాతోొ ఎన్టీఆర్, రామ్ చరణ్ లోకల్ నుంచి గ్లోబల్ హీరోలుగా ఎదిగారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటకు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎంతో లయ బద్ధంగా చేసిన డాన్స్ మూమెంట్స్‌కు ఫిదా కానీ అభిమానులు లేరు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ముందుగా కొరటాల శివ సినిమా షూటింగ్ కోసం ఎన్టీఆర్ హైదరాబాద్ చేరుకున్నాడు.

ఇక రాజమౌళి,కీరవాణి ఈ రోజు తెల్లవారుఝమున హైదరాబాద్ చేరుకున్న సంగతి తెలిసిందే కదా. ఇక రామ్ చరణ్ మాత్రం ఢిల్లీలో జరిగే ఇండియా టుడే కాంక్లేవ్ కోసం హస్తినలో లాండ్ అయ్యాడు సతీ సమేతంగా. ఈ సందర్భంగా రామ్ చరణ్.. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను మర్యాద పూర్వకంగా కలిసారు.

ఈ సందర్భంగా చిరు, రామ్ చరణ్‌లు కేంద్ర హోం మంత్రిని శాలువతో సత్కరించారు. అనంతరం అమిత్ షా.. ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంపై హర్షం వ్యక్తం చేస్తూ రామ్ చరణ్‌ను సత్కరించారు. గతంలో అమిత్ షా.. హైదరాబాద్ పర్యటనలో ఎన్టీఆర్‌ను కలిసిన సంగతి తెలిసిందే కదా.

రామ్ చరణ్‌ను శాలువ సన్మానం చేసిన అమిత్ షా (ANI/Twitter)

తాజాగా కేంద్ర హోం మంత్రి రామ్ చరణ్‌ను ఆర్ఆర్ఆర్ పాటకు ఆస్కార్ వచ్చిన సందర్భంగా భారత ప్రభుత్వం తరుపున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసారు. ఈ భేటిలో రామ చరణ్‌తో పాటు చిరంజీవి కూడా పాల్గొనడం విశేషం. అంతేకాదు అమిత్ షా...చిరంజీవి, రామ్ చరణ్ మధ్య ఏపీ, తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చర్చకు వచ్చినట్టు సమాచారం.

ఆర్ ఆర్ ఆర్.. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీగా నిర్మించారు. అందరి అంచనాలకు అందుకుంటూ అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 25, 2022న విడుదలై కలెక్షన్ల సునామీని సృష్టించింది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా పలు ప్రఖ్యాత అవార్డ్‌లను సైతం గెలుచుకుంది. ఆర్ఆర్ఆర్ సినిమా భారత్‌లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అవార్డ్‌లను రివార్డ్‌లను దక్కించుకుంది.తాజాగా ఆస్కార్ అవార్డు గెలిచింది. ఈ సందర్భంగా రామ్ చరణ్‌కు ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ప్రత్యేకంగా పిలుపు అందింది. ఇప్పటికే కేంద్ర హోం మంత్రిని కలిసి రామ చరణ్.. ప్రధాని కలిసే అవకాశాలు ఉన్నాయి.

First published:

Tags: Chiranjeevi, Ram Charan, Tollywood

ఉత్తమ కథలు