Ram Charan: జాతీయ పతాకాన్ని అవమానపరిచాడంటూ రామ్ చరణ్ పై మండిపడుతున్న నెటిజన్స్... వివరాల్లోకి వెళితే.. రామ్ చరణ్ ఒకవైపు సినిమాలతో పాటు పలు బ్రాండ్స్‌కు ప్రచార కర్తగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే కదా. అందులో హ్యాపీ మొబైల్స్‌కు మెగా పవర్ స్టార్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటూ ఆ మొబైల్స్‌కు సంబంధించిన ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు మన దేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా సదరు హ్యాపీ మొబైల్స్ వారు రామ్ చరణ్‌తో ఫుల్ పేజీ పేపర్ యాడ్స్ ఇచ్చారు. ఈ ప్రకటనలో రామ్ చరణ్ తెల్లటి రంగు డ్రెస్సులో జాతీయ పతాకం ఎగరవేసినట్టు ఓ ఫోటో ఉంది. ఇందులో అశోక ధర్మచక్రం లేకపోవడంతో పలువురు రామ్ చరణ్ జాతీయ జెండాను అవమానపరిచారంటూ ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. ఈ విషయమై సదరు సంస్థ వివరణ ఇచ్చింది.
వ్యాపార ప్రకటనల కోసం జాతీయ జెండాను వాడటం నేరమన్నారు. అందుకే ఇటువంటి ప్రకటనలకు జాతీయ పతాకాన్ని పోలి ఉండే త్రివర్ణ పతాకాన్ని వాడుకోవచ్చని అన్నారు. అందుకే అశోక ధర్మ చక్రం లేదని వివరణ ఇచ్చారు. ఇది జాతీయ జెండా కాదు. అలా కనిపించడానికి ప్రకటనలో వాడామని వివరణ ఇచ్చారు.
• @AlwaysRamCharan
Today Eenadu Print paper Happi ?#RamCharan #RC15#SeethaRAMaRajuCHARAN#ManOfMassesRamCharan pic.twitter.com/bVvFMD90y3
— S ? (@always2_suhel) August 9, 2021
Is there any specific reason in missing of ASHOKA DHARMA CHAKRA in national flag?
— prajit (@prajittweets) August 9, 2021
They are not supposed to use National flag for Advertisements. That's why they are just showing only 3 colours.
— vinod.friend (@vinodfriend1) August 14, 2021
Okay Got it.
Thank You ?
— prajit (@prajittweets) August 14, 2021
రామ్ చరణ్ విషయానికొస్తే.. రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో రామ్ చరణ్ స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు. మరోవైపు కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ అలరించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ ఉక్రెయిన్ దేశంలో జరుగుతోంది. ప్రస్తుతం టీమ్ మెంబర్స్ అందరూ అక్కడే ఉండి ఓ పాటతో పాటు కొంచెం ప్యాచ్ వర్క్ చేస్తున్నారు.
మరోవైపు రామ్ చరణ్.. తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘ఆచార్య’లో కనిపించనున్నారు. ఈ సినిమాలో రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తైయింది. అందులో ఓ పాటను చిరు, చరణ్‌లపై పిక్చరైజ్ చేయనున్నారు. మరో సాంగ్‌ను రామ్ చరణ్, పూజా హెగ్డే లపై చిత్రీకరించనున్నారు. దీంతో ఈ సినిమా పూర్తవతోంది. మరోవైపు చరణ్.. శంకర్ దర్శకత్వంలో చేయబోయే ప్యాన్ ఇండియా మూవీ సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజున పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానున్నట్టు సమాచారం.
ఇవి కూడా చదవండి
Independence Day 2021: టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై సైనికుడి పాత్రలో మెప్పించిన హీరోలు..
HBD Sridevi : అప్పటి తరంలో శ్రీదేవి.. ఈ తరంలో కాజల్, తమన్నా..
Pooja Hegde: కాటుక కళ్లతో మాయ చేస్తోన్న బుట్టబొమ్మ .. పూజా హెగ్డే గ్లామర్‌కు ఫ్యాన్స్ ఫిదా..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Acharya, Independence Day 2021, Ram Charan, RRR, Tollywood