హోమ్ /వార్తలు /సినిమా /

Ram Charan: ఛాన్స్ వస్తే ఆ క్రికెటర్ బయోపిక్‌లో నటిస్తా.. నాన్న, బాబాయి తర్వాత ఆయనంటే గౌరవం..

Ram Charan: ఛాన్స్ వస్తే ఆ క్రికెటర్ బయోపిక్‌లో నటిస్తా.. నాన్న, బాబాయి తర్వాత ఆయనంటే గౌరవం..

రామ్ చరణ్ (Twitter/Photo)

రామ్ చరణ్ (Twitter/Photo)

Ram Charan:  ఆస్కార్ బరిలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే కదా. అటు ఇండియా టుడే కాంక్లేవ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేఖరులు అడిగిన ప్రశ్నలకు రామ్ చరణ్ ఆసక్తికర సమాధానమిచ్చాడు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Ram Charan:  ఆస్కార్ బరిలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా ఈ సినిమాలో నాటు నాటు పాటలో డాన్స్ చేసిన రామ్ చరణ్‌ అమెరికా నుంచి నేరుగా దేశ రాజధాని ఢిల్లిలో లాండ్ అయ్యాడు. ఆ తర్వాత మెగా పవర్ స్టార్  తన తండ్రి మెగాస్టార్‌తో కలిసి అమిత్ షాను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా .. రామ్ చరణ్‌ను శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రిని ముందుగా చిరంజీవి, రామ్ చరణ్‌లు కలిసి మర్యాద పూర్వకంగా కలిసి శాలువతో పాటు పుష్పగుచ్ఛం అందజేసారు.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) సినిమాతోొ ఎన్టీఆర్, రామ్ చరణ్ లోకల్ నుంచి గ్లోబల్ హీరోలుగా ఎదిగారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటకు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎంతో లయ బద్ధంగా చేసిన డాన్స్ మూమెంట్స్‌కు ఫిదా కానీ అభిమానులు లేరు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ముందుగా కొరటాల శివ సినిమా షూటింగ్ కోసం ఎన్టీఆర్ హైదరాబాద్ చేరుకున్నాడు.

Ram Chaan: రామ్ చరణ్‌ను సన్మానించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా... చిరంజీవి పుత్రోత్సాహాం..

అటు దేశ హోం మంత్రి అమిత్ షాను ఆర్ఆర్ఆర్ నటుడు రామ్ చరణ్‌ను ప్రభుత్వం తరుపున శాలువాతో సత్కరించారు. అమిత్ షా.. ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంపై హర్షం వ్యక్తం చేసారు .ఆయన పక్కనే చిరంజీవి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి కళ్లలో పుత్రోత్సాహాం కనిపించింది. అటు కేంద్ర హోం మంత్రితో పాటు ఢిల్లీలో ఇండియా టుడే ఏర్పాుట చేసిన కాంక్లేవ్‌లో రామ్ చరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో పాటు అక్కడ పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.

ఈ సందర్భంగా తనకు తండ్రి చిరంజీవి.. ఎడమ కన్ను అయితే.. బాబాయి పవన్ కళ్యాణ్ కుడి కన్ను అంటూ పేర్కొన్నారు. అటు తండ్రి, బాబాయిల తర్వాత నేను ఎక్కువగా గౌరవించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రాజమౌళి అంటూ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా రాజమౌళి ఆర్ఆర్ఆర్ కథ ఇద్దరి స్నేహితుల స్టోరీ. ఇక నాకు తారక్ మధ్య మంచి స్నేహ బంధం ఉంది. అందుకే జక్కన్న మా ఇద్దరినీ సెలెక్ట్ చేశారు. ఆయన కాకపోయి ఉంటే మేమిద్దరం కలిసి నటించే వాళ్లమే కాదన్నారు. 92 ఏళ్ల భారతీయ సినీ చరిత్రలో ఆస్కార్ స్థాయికి వెళ్లిన సినిమానే లేదు. నామినేషన్ వరకు వెళ్లి ఉండొచ్చు కానీ.. ఈ స్థాయి అప్లాజ్ వచ్చింది మాత్రం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకే అన్నారు. రాజమౌళి ఈ సినిమా జరిగినన్ని రోజులు మాకు స్వీట్ టార్చర్ పెట్టారు. ఆ టార్చర్ కారణంగా ప్రపంచ వేదికలతో పాటు మీ ముంద ఇలా ఉన్నానన్నారు. ఈ సినిమాను మేము ఎంతో ఎంజాయ్ చేస్తూ చేశామన్నారు.

NTR - NBK | Chiranjeevi - Ram Charan: ఎన్టీఆర్ టూ బాలయ్య.. చిరు టూ రామ్ చరణ్.. బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లాపడ్డ తండ్రీ తనయుల మల్టీస్టారర్ మూవీస్..

ఇక ఎన్టీఆర్ కుటుంబానికి .. మా ఫ్యామిలీకి సినిమాల పరంగా, ఫ్యాన్ పరంగా గత 35 ఏళ్లుగా పోటీ నడుస్తూనే ఉందన్నారు. వ్యక్తిగతంగా మా రెండు కుటుంబాల మధ్య మంచి ఆరోగ్యపరమైన పోటీ నడుస్తూనే ఉందన్నారు. ఇక 14 యేళ్ల క్రితం రాజమౌళి.. నాకు ‘మగధీర’ వంటి ఇండస్ట్రీ హిట్ అందించారు. వర్క్ విషయంలో జక్కన్న మించిన మిస్టర్ పర్ఫెక్ట్ ఎవరు లేరన్నారు.

ఈ సందర్భంగా విలేఖరులు ర్యాపిడ్ ఫైర్ ప్రశ్నలు అడగ్గానే రామ్ చరణ్ అంతే ఆసక్తిగా సమాధానాలు ఇచ్చారు.

1.  ఇష్టమైన కో స్టార్ ఎవరంటే.. కియారా అడ్వాణీ

2. చిరంజీవి, పవన్ కళ్యాణ్ .. రెండు కళ్లు

3. భవిష్యత్తులో ఎలాంటి పాత్రలో కనిపించాలనుకుంటున్నారు.  అనే దానికి విరాట్ కోహ్లీ .. ఆయ బయోపిక్‌లో నటించే ఛాన్స్ వస్తే ఒదులుకోనన్నారు.

4.  ఫేవరేట్ టూరిస్ట్ పేస్ అనగానే.. మన దేశంలో రాజస్థాన్‌తో పాటు విదేశాల్లో స్విట్జర్లాండ్ అంటూ సమాధానాలు ఇచ్చాడు.

First published:

Tags: Naatu Naatu, Oscar 2023, Ram Charan, RRR, Tollywood, Virat kohli

ఉత్తమ కథలు