Home /News /movies /

RAM CHARAN RRR AND ACHARYA TO STREAM ON SAME DAY ON ZEE5 AND AMAZON PRIME HERE ARE THE DETAILS SR

Ram Charan : రామ్ చరణ్ అభిమానులకు ఒక గుడ్ న్యూస్... ఒక బ్యాడ్ న్యూస్..

Ram Charan Photo : Twitter

Ram Charan Photo : Twitter

Ram Charan :మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రెండు సినిమాలు ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. అయితే అందులో ఒకటి బంపర్ హిట్ అవ్వగా.. ఇంకోటి మాత్రం డిజాస్టర్ అయ్యింది. రాజమౌళి (Rajamouli )దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి.. దేశ వ్యాప్తంగా రామ్ చరణ్‌కు అదిరిపోయే క్రేజ్ రాగా.. ఆ సినిమా విడుదలైన కొన్ని రోజులకే ఆచార్య వచ్చి రామ్ చరణ్‌‌ను కొంత అప్ సెట్ చేసింది.

ఇంకా చదవండి ...
    Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా మెగా డైరెక్టర్ శంకర్‌ (Shankar) దర్శకత్వంలో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్‌లో రావడంతో పాటు దిల్ రాజు  (Dil Raju)నిర్మాణంలో ఈ సినిమా రావడంతో అభిమానుల్లో ఓ రేంజ్‌లో అంచనాలు ఏర్పడ్డాయి. ఇక అది అలా ఉంటే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రెండు సినిమాలు ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. అయితే అందులో ఒకటి బంపర్ హిట్ అవ్వగా.. ఇంకోటి మాత్రం డిజాస్టర్ అయ్యింది. రాజమౌళి (Rajamouli )దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి.. దేశ వ్యాప్తంగా రామ్ చరణ్‌కు అదిరిపోయే క్రేజ్ రాగా.. ఆ సినిమా విడుదలైన కొన్ని రోజులకే ఆచార్య వచ్చి రామ్ చరణ్‌‌ను కొంత అప్ సెట్ చేసింది. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ రెండు సినిమాలు ఒకే రోజు ఓటీటీలోకి వస్తున్నాయి. ఆచార్య సినిమా అమెజాన్ ప్రైమ్‌లో మే 20న స్ట్రీమింగ్‌కు వస్తుండగా.. అదే రోజు బ్లాక్ బస్టర్ ఆర్ ఆర్ ఆర్ కూడా జీ5లో పే పర్ వ్యూ పద్దతినా స్ట్రీమింగ్‌కు వస్తోంది. దీంతో రామ్ చరణ్ అభిమానులు.. ఓ వైపు సంతోషం వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు ఆచార్య (Acharya) డిజాస్టర్‌గా మారడంతో కొంత బాధపడుతున్నారట. ఆచార్య విషయానికి వస్తే.. చిరంజీవి (Chiranjeevi ),రామ్ చరణ్‌ (Ram Charan)లు తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన సినిమా కావడం వల్ల ‘ఆచార్య’ (Acharya)పై మంచి అంచనాలు ఉన్నాయి.

    దీనికి తోడు అపజయం ఎరుగని దర్శకుడు కొరటాల శివ(Koratala Siva) డైరెక్షన్‌లో రావడం కూడా అంచనాలను రెట్టింపు చేసింది. అయితే ఈ సినిమాకు మొదటి షోనుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది. సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేదని, గ్రాఫిక్స్ చెత్తగా ఉన్నాయని.. ఇద్దరూ స్టార్స్ ఉన్నా సినిమా ఎక్కడా కనెక్ట్ అవ్వడం లేదని టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా టాక్ తెచ్చుకుంది. ఇక ఆర్ ఆర్ ఆర్ విషయానికి వస్తే.. ఈ సినిమాలో రామ్ చరణ్‌తో పాటు, ఎన్టీఆర్ (NTR) మరో ప్రధాన పాత్రలో నటించారు. వీరికి జంటగా ఆలియా భట్ (Alia Bhatt), ఒలివియా మోరీస్ (Olivia Morris) నటించారు. ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి ఆదరణ పొందింది. అంతేకాదు పాత రికార్డ్స్‌ను బ్రేస్తూ కేక పెట్టిస్తోంది. అందులో భాగంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్లకుపైగా వసూలు చేసింది.

    Ram Charan acted RRR and Acharya to stream on same day, Ram charan Acharya to stream on amazon prime, Ram Charan Shankar film update, Prashant Neel to direct Ram Charan, Ram Charan Gowtam Tinnanuri,Gowtam Tinnanuri Prabhas UV Creation,Ram charan Twitter, RRR ott streaming date, NTR Ram Charan Rajamouli  RRR Release Date , రామ్ చరణ్,ప్రభాస్ రామ్ చరణ్
    RRR on Zee5 Photo : Twitter


    ఆర్ ఆర్ ఆర్ అమెరికాలో కూడా ఓ రేంజ్‌లో అదరగొట్టింది. నార్త్ అమెరికాలో ఈ సినిమా 14 మిలియన్ డాలర్స్‌‌పైగా వసూలు చేసి 100 కోట్ల‌కు పైగా గ్రాస్‌ను అందుకుంది. ఆర్ ఆర్ ఆర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 451 కోట్ల బిజినెస్ చేయగా... 453 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగింది. అయితే బ్రేక్ ఈవెన్ సాధించి ఈ సినిమా ప్రస్తుతం లాభాల బాటలో నడుస్తోంది.  ఇక అది అలా ఉంటే మరోవైపు ఈ సినిమా U.S. సినీ ప్రేక్షకులకు మరోసారి అందుబాటులోకి వస్తోంది. ఈ సినిమా జూన్ 1 న ఒక్కరోజు 100 థియేటర్స్‌లో విడుదలకానుంది. అంతేకాదు అక్కడి ప్రేక్షకుల కోసం అసలైన అన్‌కట్ తెలుగు వెర్షన్‌‌ను ప్రదర్శించనున్నారట. అన్‌కట్ వెర్షన్‌తో పాటు డాల్బీ అట్మాస్ సౌండ్ మిక్స్ కూడా ఉండనుందట. దీంతో ఈ సినిమా అన్ కట్‌ వర్షన్ చూడోచ్చని సంతోష పడుతున్నారు మెగా ఫ్యాన్స్.

    Acharya OTT, Acharya OTT Steaming Date,Acharya Movie Amazon Prime, Chiranjeevi acharya news, Chiranjeevi Koratala siva acharya update, చిరంజీవి, ఆచార్య ఓటీటీ, ఆచార్య స్ట్రీమింగ్ డేట్
    Acharya OTT Streaming Photo : Twitter


    ఇక మరోవైపు రామ్ చరణ్ హీరోగా మరో కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన విడుదలైంది. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ కొత్త సినిమా తెరకెక్కనుంది. దసరా సందర్భంగా ఈ ప్రకటన విడుదలైంది. అయితే ఈ సినిమా శంకర్ సినిమా తర్వాత పట్టాలెక్కనుందని తెలుస్తోంది. ఈ సినిమాను ఇక దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో సునీల్, అంజలి, శ్రీకాంత్, నవీన్ చంద్ర కనిపించనున్నారు. 2023 సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సంగీత సంచలనం, థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Ram Charan, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు