• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • RAM CHARAN ROLE IN ACHARYA IS MORE THAN EXPECTED GIVES FANS EYE FEAST HERE ARE THE DETAILS SR

Ram Charan : ఆచార్య కోసం కష్టపడుతున్న రామ్ చరణ్.. ఊహకందని విధంగా ఉంటుందట...

Ram Charan : ఆచార్య కోసం కష్టపడుతున్న రామ్ చరణ్.. ఊహకందని విధంగా ఉంటుందట...

Chiranjeevi Ram Charan in Acharya Photo : Twitter

Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ‘ఆచార్య’ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. అయితే తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమాలో చరణ్ చిరంజీవితో కలిసి చాలాసేపు స్క్రీన్ షేర్ చేసుకోనున్నారట.

  • Share this:
    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి ఆర్ ఆర్ ఆర్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు ఆయన తన తండ్రి చిరంజీవి సినిమా ‘ఆచార్య’లో కూడా ఓ కీలక పాత్రలో మెరవనున్నాడు. దీనికి సంబంధించిన షూట్‌లో ఆయన పాల్గోంటున్న సంగతి తెలిసిందే. ఆచార్యలో రామ్ చరణ్ పాత్ర దాదాపు ఓ 30 నిమిషాల పాటు ఉండనుందని టాక్ రాగా.. చరణ్ పాత్ర అంతకు మించి ఉంటుందట. ఆయన పాత్రకు సంబంధించి ఇదివరకే ఓ 20 రోజుల పాటు ఈ సినిమా కోసం తూర్పు గోదావరి మారేడు మిల్లి అడవుల్లో జరిగిన ఆచార్య షూటింగ్‌లో పాల్గోన్నాడు చరణ్. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ ‘పూజా హెగ్డే’ నటిస్తోంది. అయితే తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమాలో చరణ్ చిరంజీవితో కలిసి చాలాసేపు స్క్రీన్ షేర్ చేసుకోనున్నారట. ఈ సినిమాలో ఇద్దరికీ చాలా కాంబినేషన్ సీన్స్ ఉండనున్నాయని టాక్. అంతేకాదు ఈ సినిమాలో చరణ్ మీద రెండు పాటలు, ఓ పెద్ద ఫైట్ సీక్వెన్స్ కూడా ఉంటుందట. అందులో భాగంగా మొన్నటి వరకు రామ్ చరణ్, పూజా హెగ్డేల మీద పాటకు సంబంధించిన షూటింగ్‌ను జరిపిన కొరటాల శివ ఈరోజు నుంచి రామ్ చరణ్‌పై యాక్షన్ సీన్స్‌ను షూట్ చేస్తున్నారు.

    ఈ ఫైట్ రెయిన్ ఎఫెక్ట్ లో ఉంటూ ఆచార్య సినిమాకే హైలెట్ అవుతుందని సమాచారం. ధర్మస్థలి విలేజ్ సెట్లోనే ఈ ఫైట్ ఉండనుందట. కథలోని కీలక ఘట్టంలో ఈ పోరాట సన్నివేశం వస్తుందట. ఇందులో చిరంజీవి ఉండరట. ఈ ఫైట్‌లో రామ్ చరణ్ మాత్రమే ఉంటారట.. అంటే ఆయనకు ఇది సోలో ఫైట్. ప్రస్తుతం ఈ ఫైట్‌కు సంబంధించి షూట్ జరుగుతోంది. ఇక తాజాగా ఉగాది సందర్భవంగా ‘ఆచార్య’ నుండి చరణ్ పూజా హెగ్డే కలయికలో ఓ మంచి పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ పోస్టర్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ సినిమాలో పూజా హెగ్డే.. 20 నిమిషాల పాటు కనిపించనుందట. సెకెండ్ హాఫ్ లో వచ్చే ప్లాష్ బ్యాక్ లో పూజా కనిపించనుందట. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్, నిరంజన్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

    మరోవైపు ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా మారనుందని తెలుస్తోంది. ముందుగా అనుకున్న ప్రకారం ఈ సినిమా మే 13న విడుదలకావాలసి ఉండగా.. ఈ సినిమా విడుదల తేది మారనుందని తెలుస్తోంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. కరోనా కారణంగా ఇప్పటి వరకు జరగాల్సిన షూటింగ్ పూర్తి కాలేదు. మరోవైపు కరోనా కేసుల రోజురోజుకు పెరుగుతున్నాయి. దీనికి తోడు టికెట్స్ రేట్స్ ఇలా పలు కారణాల వల్ల ఆచార్య విడుదల వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమాకు మణి శర్మ సంగీతం అందిస్తున్నాడు. చిరంజీవ సరసన కాజల్ నటిస్తోంది. ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో ఆడిపాడింది. దీనికి సంబందించిన ఆ పాటను ఇప్పటికే షూట్ చేసింది చిత్రబృందం.

    రామ్ చరణ్ నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన రాజమౌళి ఆర్ ఆర్ ఆర్‌ షూటింగ్‌లో పాల్గొనన్నున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్‌తో పాటు, ఎన్టీఆర్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. వీరికి జంటగా ఆలియా భట్, ఒలివియా మోరీస్ నటిస్తున్నారు. ఈ సినిమా ఆక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాతో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మెగా డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాను దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. హీరోయిన్‌గా కియారా అద్వానీ నటిస్తున్నట్లు టాక్. కియారా గతంలో రామ్ చరణ్ సరసన వినయ విదేయ రామలో నటించిన సంగతి తెలిసిందే.
    Published by:Suresh Rachamalla
    First published:

    అగ్ర కథనాలు