Ram Charan-Disney hotstar : రామ్ చరణ్‌కు భారీ పారితోషకాన్ని ముట్టజెప్పిన డిస్నీ హాట్ స్టార్..

Ram Charan Photo : Twitter

Ram Charan-Disney hotstar : రామ్ చరణ్ ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ హాట్ స్టార్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన సంగతి తెలిసిందే. ‘మన వినోద విశ్వం’ అనే ట్యాగ్‌లైన్‌తో తెలుగులో డిస్నీ హాట్ స్టార్‌ను రామ్ చరణ్ ప్రమోట్ చేయనున్నారు.

 • Share this:
  రామ్ చరణ్  (Ram Charan) ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. మొన్నటి వరకు ఆర్ ఆర్ ఆర్ ఉక్రెయిన్‌లో చిత్రీకరణ జరుపుకుని ఇటీవలే హైదరాబాద్ చేరుకుంది టీమ్. ఈ సినిమాతో పాటు రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నారు. ఈ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఇక అది అలా ఉంటే రామ్ చరణ్ (Ram Charan-Disney hotstar) ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ హాట్ స్టార్‌కు  (Disney hotstar) బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన సంగతి తెలిసిందే. ‘మన వినోద విశ్వం’ అనే ట్యాగ్‌లైన్‌తో తెలుగులో డిస్నీ హాట్ స్టార్‌ను రామ్ చరణ్ ప్రమోట్ చేయనున్నారు. అయితే దీని కోసం రామ్ చరణ్‌కి డిస్నీ హాట్ స్టార్ భారీగానే ముట్టజెప్పినట్టు సమాచారం.

  రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా చేస్తున్నందుకు ఆయనకు ఏడాదికి 5 నుంచి 7 కోట్ల వరకు పారితోషికం ఇస్తున్నట్లు టాక్. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నారు.

  రామ్ చరణ్ నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ విషయానికి వస్తే.. రౌద్రం రణం రుథిరం పేరుతో వస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్‌ (Ram Charan)తో పాటు (NTR) ఎన్టీఆర్ నటిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఈ పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు.

  Love Story : లవ్ స్టోరి ప్రిరీలీజ్ ఈవెంట్.. చిరంజీవి, నాగార్జున హాజరు...

  వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ (Alia Bhatt) నటిస్తున్నారు. ఇక సెకండ్ వేవ్ కరోనా కేసులు తగ్గడంతో క్లైమాక్స్ షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోందని గతంలో ప్రకటించగా... ఆ విడుదలను (RRR Release Date) మరోసారి వాయిదా వేసింది చిత్రబృందం.

  దీనికి సంబంధించి ఓ ప్రకటన చేసిన టీమ్.. ఈ సందర్భంగా రాస్తూ.. ప్రస్తుత పరిస్థితుల్లో మా సినిమాను విడుదల చేయలేము. అంతేకాదు కొత్త విడుదల తేదీని కూడా ప్రకటించలేము.. ఎందుకంటే ఓ వైపు ప్రపంచంలో దాదాపు థియేటర్స్ అన్ని మూత పడ్డాయి.. ఈ సందర్భంలో మరోసారి కొత్త డేట్ ప్రకటించడం కరెక్ట్‌గా ఉండదని భావిస్తున్నాము.బఅన్ని అనుకూలించిన తర్వాత మా సినిమా ఎప్పుడు విడుదలవుతుందో ప్రకటిస్తాము అంటూ ఓ పోస్ట్ చేశారు. దీంతో ఆర్ ఆర్ ఆర్ విడుదల విషయంలో స్పష్టత వచ్చినట్లు అయ్యింది.

  ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్‌ల నటిస్తున్నారు. ఈ సినిమా చివరి షెడ్యూల్ కోసం ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఉక్రెయిన్ వెళ్లి ఇటీవలే వచ్చింది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.

  Akhanda Adiga Adiga Song: అఖండ నుండి విడుదలైన ఫస్ట్ సింగిల్.. అడిగా అడిగా అంటూ బాలయ్య రచ్చ!

  రామ్ చరణ్ (Ram Charan), డైరెక్టర్ శంకర్ (Shankar) సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా ఇటీవల ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నిదిల్ రాజు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీ ముహూర్తపు సన్నివేశానికి మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) క్లాప్ కొట్టారు.  దర్శకుడు రాజమౌళి (Rajamouli), బాలీవుడ్ క్రేజీ హీరో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) ముఖ్య అతిథులుగా హాజరైయారు.

  ప్యాన్ ఇండియా లెవల్లో భారీగా నిర్మితమవుతోన్న ఈ సినిమా రూ. 200 కోట్ల బడ్జెట్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘విశ్వంభర’ అనే టైటిల్ అనుకుంటున్నారు. డా. సి.నారాయణ రెడ్డికి జ్ఞానపీఠ్ అవార్డు తెచ్చి పెట్టిన ‘విశ్వంభర’ టైటిల్ ఏ మేరకు న్యాయం చేస్తారనేది చూడాలి.
  Published by:Suresh Rachamalla
  First published: