హోమ్ /వార్తలు /సినిమా /

Anchor Suma : జయమ్మగా యాంకర్ సుమ లుక్ అదుర్స్.. టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన రామ్ చరణ్..

Anchor Suma : జయమ్మగా యాంకర్ సుమ లుక్ అదుర్స్.. టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన రామ్ చరణ్..

జయమ్మ పంచాయతీ

జయమ్మ పంచాయతీ

Suma Kanakala : తన మాటలతో గానీ చేతలతో గానీ ఎవరనీ నోప్పించని సుమ తాజాగా ఓ సినిమాలో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌తో పాటు టైటిల్‌ను మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ విడుదల చేశారు. ఈ చిత్రానికి జయ‌మ్మ పంచాయ‌తీ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌లో సుమ‌ కొద్దిగా సీరియ‌స్ లుక్‌లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు.

ఇంకా చదవండి ...

Suma Kanakala : యాంకర్ సుమ అంటే తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులుండరు. అంత పాపులర్ సుమ. టీవీ తెరపై ఆమె ఓ మెగాస్టార్. ఎంత పెద్ద షో ఐనా ఏ మాత్రం బెదరకుండా తన మాటలతో రంజింప చేస్తూ ఆకట్టకుంటారు. సుమ జన్మత: మలయాళీ అయినా తెలుగింటి కోడలై.. మాటలతో మైమరిపిస్తున్నారు. యాంకర్ సుమ.. సినిమాల్లో చిరంజీవి తన డ్యాన్స్‌లతో, నటనతో తనదైన మేనరిజంతో ఎంత పేరు తెచ్చుకున్నాడో.. టీవీల్లో కూడా సుమ తన దైన స్టైల్లో యాంకరింగ్‌కు చేస్తూ అప్పటికప్పుడు సమయస్పూర్తిగా వ్యవహరిస్తూ అంత పేరు తెచ్చుకున్నారు. ఓ రకంగా టీవీ మెగాస్టార్ అని సుమను అనోచ్చు.

దశాబ్ధాలుగా ఈమె టీవీ తెరపై అద్భుతాలు చేస్తూనే ఉంది. వయసు 40 దాటినా కూడా ఇప్పటికీ యాంకరింగ్‌లో ఆమెను అందుకునే శక్తి కానీ.. దాటే అర్హత కానీ సమీప భవిష్యత్తులో ఎవరికీ కనిపించడం లేదు. కనీసం సుమ దరిదాపుల్లో కూడా ఎవరూ కనిపించడం లేదు.

పెద్ద హీరోలకు సంబంధించిన ఏదైనా ఈవెంట్‌ అయినా.. సరే తన మాటలతో మాయ చేయడం సుమ స్పెషాలిటీ. తెలుగు ప్రేక్షకులు ఆమెను ఓ యాంకర్‌గా కాకుండా తమ ఇంటి సభ్యరాలిగానే భావిస్తారు. అంతలా తెలుగు వారికి కనెక్ట్ అయిపోయింది ఈ మలయాళీ కుట్టి. తన మాటలతో గానీ చేతలతో గానీ ఎవరనీ నోప్పించని సుమ తాజాగా ఓ సినిమాలో నటిస్తున్నారు.

Chiranjeevi 154 : ఊర మాస్ లుక్‌లో చిరంజీవి.. అభిమానులకు పూనకాలే...

దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌తో పాటు టైటిల్‌ను మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ విడుదల చేశారు. ఈ చిత్రానికి జయ‌మ్మ పంచాయ‌తీ  (Jayamma Panchayathi first look) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌లో సుమ‌ కొద్దిగా సీరియ‌స్ లుక్‌లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. జయ‌మ్మ పంచాయ‌తీ సినిమాను విజయ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ఈ మూవీకి కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు.

ఇక సుమ గ‌తంలో చాలా సినిమాల్లో నటించారు. ముఖ్యంగా ‘పవిత్ర ప్రేమ’, ‘వర్షం’, ‘ఢీ’, ‘బాద్‌షా’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. ఈ సినిమాతో సుమ సుమారు 8 ఏళ్ల తర్వాత మరోసారి టాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తుండడంతో ఆమె అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి సుమ రీ ఎంట్రీ ఇస్తున్న జయమ్మ పంచాయితీ ఎలా ఉండనుందో...

First published:

Tags: Anchor suma, Tollywood news

ఉత్తమ కథలు