• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • RAM CHARAN RANGASTHALAM MOVIE REMAKE IN KOLLYWOOD WITH RAGHAVA LAWRENCE AS LEAD ROLE TA

తమిళంలోకి రీమేక్ కానున్న రామ్ చరణ్ ‘రంగస్థలం’.. హీరో ఎవరంటే..

తమిళంలోకి రీమేక్ కానున్న రామ్ చరణ్ ‘రంగస్థలం’.. హీరో ఎవరంటే..

తమిళంలో రీమేక్ కానున్న ‘రంగస్థలం’ మూవీ (Twitter/Photo)

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, సమంత హీరోయిన్‌గా నటించిన ‘రంగస్థలం’ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఇపుడీ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి.

  • Share this:
    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, సమంత హీరోయిన్‌గా నటించిన ‘రంగస్థలం’ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. గ్రామీణ రాజకీయాల నేపథ్యంలో 1980 నాటి బ్యాక్ డ్రాప్‌తో సుకుమార్‘రంగస్థలం’ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు. ముఖ్యంగా రామ్ చరణ్ చెవిటివాడిగా నటించిన తీరు అద్భతం. మరోవైపు రామలక్ష్మి పాత్రలో నటించిన సమంత, రంగమ్మత్త పాత్రలో నటించిన అనసూయ, ఊరి ప్రెసిడెంట్ పాత్రలో జగపతి బాబు, మంత్రిగా ప్రకాష్ రాజ్ నటన  ఈ సినిమా సక్సెస్‌లో కీ రోల్ పోషించాయి. ఇపుడీ చిత్రాన్ని తమిళంలో లారెన్స్ హీరోగా రీమేక్ కానున్నట్టు వార్తలు వస్తున్నాయి.

    తమిళ ‘రంగస్థలం’ రీమేక్‌లో లారెన్స్ రాఘవ (File/Photo)


    అంతేకాదు హీరోయిన్‌గా నిక్కీ గల్రానీ నటించబోతున్నట్టు సమాచారం. త్వరలో ఈ రీమేక్‌కు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. స్వతహాగా దర్శకుడు అయిన లారెన్స్ రాఘవ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తాడా వేరే వాళ్ల దర్శకత్వంలో ఈ రీమేక్ చేస్తాడా అనేది చూడాలి. మరి స్వతహాగా మంచి నటుడైన లారెన్స్ .. తమిళంలో ఈ పాత్రను ఎలా పోషించబోతున్నాడనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇక రాఘవ లారెన్స్ అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కించిన హిందీ చిత్రం  లక్ష్మీ బాంబ్ త్వరలో హాట్ స్టార్ ఓటీటీలో విడుదల కానుంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: