Home /News /movies /

RAM CHARAN RAJAMOULI RRR TEAM SPECIAL TREAT FOR RAM CHARAN BIRTHDAY GIFT ONE DAY BEFORE FANS GET EXCITED TA

Ram Charan RRR: ఆర్ఆర్ఆర్ నుంచి రామ్ చరణ్‌కు అద్భుతమైన కానుక.. రాజమౌళి ఇచ్చిన బర్త్ డే గిప్ట్ అదిరిందిగా..

‘అల్లూరి సీతారామరాజు’గా రామ్ చరణ్ లుక్ (Twitter/Photo)

‘అల్లూరి సీతారామరాజు’గా రామ్ చరణ్ లుక్ (Twitter/Photo)

Ram Charan RRR: మెగాస్టార్ నట వారసుడిగా ‘చిరుత’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి.. ఆ తర్వాత తండ్రి తగ్గ తనయుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్ చరణ్. ఈ శనివారం రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ లుక్‌ను విడుదల చేసారు.

ఇంకా చదవండి ...

    Ram Charan RRR: మెగాస్టార్ నట వారసుడిగా ‘చిరుత’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి.. ఆ తర్వాత తండ్రి తగ్గ తనయుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్ చరణ్. తొలి సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రెండో సినిమా ‘మగధీర’తో టాలీవుడ్‌ రికార్డులన్నింటినీ తిరగరాసి మెగా ధీరుడు అనిపించుకున్నాడు. కెరీర్ మొదట్లో ఒక మూసలో సినిమాలు చేసిన.. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ శనివారం 36వ ఏట అడుగుపెడుతున్నాడు రామ్ చరణ్. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ రామ్ చరణ్‌కు అదిరిపోయే పుట్టినరోజు కానుకగాను అందజేసింది. ఇది చూసి మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


    ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో ఎన్టీఆర్, చరణ్‌లు హీరోలుగా దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ పిరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటిస్తున్నారు. మరో ప్రధాన పాత్రలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ నటిస్తున్నాడు. దీంతో ఈ మూవీపై దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ నెలకొని ఉండగా, అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రాజమౌళి ఈ సినిమాను ఓ శిల్పం చెక్కినట్టు తెరకెక్కిస్తున్నాడు.

    ‘ఆర్ఆర్ఆర్’లో అల్లూరిగా రామ్ చరణ్


    తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా హైపును పెంచుతూ.. చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆ మధ్య సీతారామరాజుగా చరణ్ ఎంట్రీ అదిరింది. చరణ్ పాత్రను పరిచయం చేసిన తీరు ఫ్యాన్స్ తో పాటు సగటు ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించింది. తాజాగా ఈ రోజు రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజు విల్లు పట్టుకొని యుద్ధం చేస్తున్నట్టుగా ఉన్న లుక్ ఆకట్టుకునే విధంగా ఉంది.


    కరోనా కారణంగా వాయిదా పడి.. ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఇక లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ ఆలస్యం కావడం తో ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ లో చిత్ర యూనిట్ బిజీ గా ఉంది. ఈ చిత్రం కోసం బాలీవుడ్ నటి అలియా భట్ ఇటీవల ఆర్ ఆర్ ఆర్ టీమ్‌తో జాయిన్ అయ్యింది. ఇప్పటికే ఆలస్యం కావడంతో శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు టీమ్. ఈ సినిమాలో ఆమె రామ్ చరణ్ కు జోడిగా నటిస్తోంది. ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరణ జరుపుకుంటోంది. దీంతో తాజాగా ప్రఖ్యాత హాలీవుడ్‌ యాక్షన్ డైరెక్టర్‌ నిక్‌ పావెల్‌ కూడా ఆర్ ఆర్ ఆర్ సెట్‌లో కాలు పెట్టాడు. ఈ సినిమాను డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు.

    ram charan,ram charan twitter,ram charan instagram,ram charan rrr shooting,ram charan acharya shooting photos,ram charan acharya chiranjeevi,ram charan chiranjeevi acharya shooting pics,telugu cinema,ఆచార్య,ఆచార్య రామ్ చరణ్ చిరంజీవి,రామ్ చరణ్ చిరంజీవి ఇల్లెందులో ఆచార్య షూటింగ్,రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ షూటింగ్
    ఆర్ఆర్ఆర్ సినిమా (RRR movie)


    ఈ సినిమా ప్రధాన తారాగణం విషయానికి వస్తే.. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు 'ఆర్ఆర్ఆర్‌'తో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ టాలీవుడ్‌కు పరిచయమవుతుండగా, మరో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గణ్ ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనున్నాడు. ఒలీవియా మోరిస్‌, శ్రియా శరన్‌, ఆలిసన్ డూడీ, రే స్టీవెన్‌సన్‌, సముద్రఖని ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిపంచనున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం, సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Rajamouli, Ram Charan, RRR, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు