news18-telugu
Updated: July 7, 2020, 3:27 PM IST
రామ్ చరణ్,విజయ్ దేవరకొండ (File/Photos)
అక్కడ రామ్ చరణ్.. ఇక్కడ విజయ్ దేవరకొండ ఓ సినిమాలో యాక్ట్ చేయడానికి ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం చిరంజీవిచిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి రాజమౌళి .. చరణ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా షూటింగ్ దశలోనే ఉండగానే చిరు మరో సినిమాకు ఓకే చెప్పారు. గతేడాది మలయాళంలో మోహన్‌లాల్, పృథ్వీ హీరోగా నటించిన ‘లూసీఫర్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నట్టు ప్రకటించారు చిరంజీవి. మోహన్ లాల్ నటించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ అక్కడ మంచి విజయం సాధించి ఆయన కెరీర్‌లోని ఓ చెప్పుకోదగ్గ చిత్రంగా నిలిచింది. తెలుగులో ఈ సినిమా డబ్ కూడా చేసారు.

చిరంజీవి రామ్ చరణ్ (Twitter/Ram Charan Chiranjeevi)
ఆ సంగతి పక్కనపెడితే.. ఈ సినిమాను చిరంజీవితో రీమేక్ చేయాలనే ఉద్దేశంతో మంచి రేటుకు ఈ రీమేక్ హక్కులను రామ్ చరణ్ సొంతం చేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి ఈ రీమేక్ దర్శకత్వ బాధ్యతలను ఎవరికి అప్పగించనున్నారనే విషయం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. కాగా ఆ సినిమా తెలుగు రీమేక్ దర్శకత్వ బాధ్యతలు సుజిత్‌కు అప్పగించారు చిరంజీవి. ఇప్పటికే సుజిత్ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌తో ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టాడు. తాజాగా ఈ సినిమాలో మరో ముఖ్య పాత్ర కోసం విజయ్ దేవరకొండను సంప్రదించినట్టు సమాచారం.

చిరంజీవి, విజయ్ Photo : Twitter
ఈ స్టోరీ విని విజయ్ దేవరకొండ కూడా చిరంజీవి సినిమాలో కీ రోల్ పోషించడానికి ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ‘లూసీఫర్’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన పృథ్వీరాజ్ ఈ చిత్రంలో కీ రోల్ పోషించాడు. ఇపుడు అదే పాత్రని తెలుగులో విజయ్ దేవరకొండతో చేయించాలనుకున్నట్టు సమాచారం. ముందుగా ఈ పాత్ర కోసం రామ్ చరణ్ పేరును చిరు పరిశీలించారు. ఆ తర్వాత అల్లు అర్జున్, సల్మాన్ ఖాన్ పేర్లు పేరు లైన్లోకి వచ్చాయి. ఫైనల్‌గా విజయ్ దేవరకొండను సెలెక్ట్ చేసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
July 7, 2020, 3:27 PM IST