రామ్ చరణ్ బర్త్ డేకు బంపర్ గిఫ్ట్.. గెట్ రెడీ ఫ్యాన్స్..

Ram Charan: మార్చ్ 27న రామ్ చరణ్ పుట్టిన రోజు. అయితే ఈసారి కరోనా కారణంగా తాను పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవట్లేదని.. మీరు కూడా ఎలాంటి హడావిడి చేయొద్దంటూ..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 25, 2020, 7:34 PM IST
రామ్ చరణ్ బర్త్ డేకు బంపర్ గిఫ్ట్.. గెట్ రెడీ ఫ్యాన్స్..
రామ్ చరణ్ (Instagram/Ram Charan)
  • Share this:
మార్చ్ 27న రామ్ చరణ్ పుట్టిన రోజు. అయితే ఈసారి కరోనా కారణంగా తాను పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవట్లేదని.. మీరు కూడా ఎలాంటి హడావిడి చేయొద్దంటూ పది రోజుల కిందే లెటర్ రాసాడు చరణ్. దాన్ని ఫ్యాన్స్ కూడా పాటిస్తున్నారు. ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా చరణ్ పుట్టిన రోజు ఇలా వచ్చి అలా వెళ్లిపోనుంది. ఎలాంటి స్పెషల్స్ కూడా లేవు. పైగా రాజమౌళి సినిమా ఫస్ట్ లుక్ కూడా రెండు రోజుల ముందుగానే విడుదల చేసారు. దాంతో ఈ సారి ఇదే గిఫ్ట్ అనుకున్నారంతా. కానీ అభిమానులకు మరో సర్ ప్రైజ్ ఇస్తున్నాడు రామ్ చరణ్.
రామ్ చరణ్ న్యూ లుక్ (Ram charan new look)
రామ్ చరణ్ న్యూ లుక్ (Ram charan new look)

ఈయన కూడా తన పుట్టిన రోజు నాడే ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాడు. ఏంటి ఇప్పటి వరకు రామ్ చరణ్‌కు ట్విట్టర్ అకౌంట్ లేదా అనే అనుమానాలు రావచ్చు.. లేదు.. నిజంగానే లేదు.. ఇన్‌స్టాగ్రామ్ ఉంది కానీ ట్విట్టర్ మాత్రం లేదు. దాంతో ఈ బర్త్ డేకు దాన్ని ఓపెన్ చేస్తున్నాడు మెగా వారసుడు. ఇప్పటికే చిరంజీవి ఉగాది కానుకగా అభిమానులకు సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు చరణ్ కూడా ట్విట్టర్ ఎంట్రీ ఇస్తున్నాడు. మొత్తానికి తండ్రీ కొడుకులు ఇద్దరూ రెండు రోజుల గ్యాప్‌లోనే సోషల్ మీడియాలోకి వచ్చేసారన్నమాట.

First published: March 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు