RAM CHARAN PAWAN KALYAN MULTISTARRER ON CARDS AND DO YOU KNOW WHO WILL DIRECT THIS MEGA MOVIE PK
Pawan Kalyan - Ram Charan: పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ మల్టీస్టారర్.. దర్శకుడు ఎవరో తెలుసా..?
రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ (Ram Charan Pawan Kalyan)
Pawan Kalyan - Ram Charan: మెగా హీరోలు కలిసి నటిస్తే చూడాలని చాలా కాలంగా అభిమానులు వేచి చూస్తున్నారు. అప్పుడెప్పుడో ఓ సారి చిరు, పవన్ అనుమతితో పని లేకుండా టి సుబ్బిరామిరెడ్డి ఓ సినిమాను అనౌన్స్ చేసాడు. త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాడని చెప్పాడు.
మెగా హీరోలు కలిసి నటిస్తే చూడాలని చాలా కాలంగా అభిమానులు వేచి చూస్తున్నారు. అప్పుడెప్పుడో ఓ సారి చిరు, పవన్ అనుమతితో పని లేకుండా టి సుబ్బిరామిరెడ్డి ఓ సినిమాను అనౌన్స్ చేసాడు. త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాడని చెప్పాడు. అయితే ఆ తర్వాత తమపై ఉన్న అభిమానంతో సుబ్బిరామిరెడ్డి అలా చెప్పాడు కానీ అందులో ఎలాంటి నిజం లేదని మెగా బ్రదర్స్ ఇద్దరూ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆచార్యలో కాసేపు తండ్రితో కలిసి నటించనున్నాడు రామ్ చరణ్. సిద్ధ పాత్రలో ఇందులో కనిపిస్తున్నాడు రామ్ చరణ్. నక్సలైట్‌గా నటించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు బాబాయ్, అబ్బాయి కూడా కలిసి నటించబోతున్నారని.. వీళ్ల మల్టీస్టారర్ కోసం ఓ స్టార్ డైరెక్టర్ పావులు కదుపుతున్నాడని వార్తలొస్తున్నాయి. ఆ డైరెక్టర్ తెలుగు వాడు మాత్రం కాదు.. సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఈ మెగా మల్టీస్టారర్ ఉండబోతుందనే ప్రచారం జరుగుతుంది. రోబో తర్వాత సరైన హిట్ కోసం చూస్తున్నాడు శంకర్. మధ్యలో వచ్చిన నమ్బన్, ఐ, 2.0 సినిమాలు పర్లేదు అనిపించాయే కానీ బ్లాక్‌బస్టర్ కావు. ప్రస్తుతం ఈయన కమల్ హాసన్ హీరోగా ఇండియన్ 2 చేస్తున్నాడు. అయితే ఈ చిత్ర షూటింగ్ కూడా చాలా ఆలస్యం అవుతుంది. కమల్ హాసన్ రాజకీయాల కారణంగా ఇండియన్ సీక్వెల్‌కు ఇప్పట్లో మోక్షం వచ్చేలా కనిపించడం లేదు.
కమల్ హాసన్ (Kamal Haasan Shankar Indian 2)
ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత శంకర్ మరో భారీ సినిమాకు శ్రీకారం చుడుతున్నాడు. అందులో పవన్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తారని తమిళనాట వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ మెయిన్ లీడ్ చేస్తుంటే.. పవన్ కూడా దాదాపు గంట పాటు ఉండే పాత్రలో నటించబోతున్నాడని తెలుస్తుంది. ఓ బడా నిర్మాణ సంస్థ దాదాపు 200 కోట్లతో ఈ మల్టీస్టారర్‌ను నిర్మించబోతుంది.
రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ (pawan kalyan ram charan)
ఇదంతా సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు అయితే ఏం చేయలేం కానీ ఒకవేళ నిజంగానే ప్రాజెక్ట్ కానీ వర్కవుట్ అయిందంటే మాత్రం మెగా ఫ్యాన్స్‌కు అంతకంటే కోరుకునేది మరోటి ఉండదు. ఎందుకంటే మెగా హీరోలు కలిసి నటిస్తే చూడాలనేది చాలా మంది అభిమానుల కోరిక. ప్రస్తుతం రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్, ఆచార్య సినిమాలతో బిజీగా ఉంటే.. పవన్ వకీల్ సాబ్, అయ్యప్పునుమ్ కోషియుమ్ రీమేక్, క్రిష్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.