సాధారణంగా హీరోలను మీ ఫేవెరేట్ హీరోయిన్ ఎవరు అంటే చెప్పడానికి కాస్త సంశయిస్తారు. ఎవరి పేరు చెబితే ఎవరు ఫీల్ అవుతారో కానీ ప్రశ్నే పక్కనబెట్టేస్తుంటారు. కానీ రామ్ చరణ్ మాత్రం నిజాయితీగా తన మనసులో మాట బయటపెట్టాడు. తన ఫేవరేట్ హీరోయిన్ ఎవరు అంటే మరో ఆలోచన లేకుండా ఉన్నదున్నట్లు చెప్పాడు మెగా వారసుడు. ఈ మధ్యే రానా నెంబర్ వన్ యారీ షోకు వచ్చిన ఈ హీరో.. చాలా విషయాలను పంచుకున్నాడు. ముఖ్యంగా తను చిన్నప్పుడు చేసిన చాలా కోతి పనులను కూడా ప్రేక్షకుల ముందు చెప్పాడు మెగా హీరో.
ఇక అందులో భాగంగానే హీరోయిన్ గురించి రానా క్వశ్చన్ అడిగితే ఎవరూ ఊహించని విధంగా సాయిపల్లవి పేరు రాసాడు చరణ్. తనతో నటించిన హీరోయిన్లలో ఎవరి పేరైనా రాస్తే లేనిపోని సమస్యలు వస్తాయని అలా రాసాడో.. లేదంటే నిజంగానే సాయిపల్లవి నటనకు మెగా హీరో ఫిదా అయిపోయాడో తెలియదు కానీ ఇప్పుడు నిజంగానే పల్లవి మాయలో పడిపోయాడు రామ్ చరణ్. ఇదే విషయాన్ని బయటికి కూడా చెప్పి సంచలనం సృష్టించాడు.
సాయిపల్లవి పేరు చూడగానే రానా కూడా షాక్ అయిపోయాడు. ‘ఫిదా’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన సాయిపల్లవి.. ఆ తర్వాత ‘ఎంసిఏ’, ‘పడిపడి లేచే మనసు’ లాంటి సినిమాలతో ప్రేక్షకులకు మరింత చేరువైంది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో ఏ సినిమా చేయకపోయినా కూడా తమిళనాట మాత్రం వరస సినిమాలు చేస్తుంది పల్లవి. మొత్తానికి చరణ్ మనసు దోచేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది సాయిపల్లవి.
ఇవి కూడా చదవండి..
Video: అసెంబ్లీ స్పీకర్ పదవికి పోచారం శ్రీనివాస్ రెడ్డి నామినేషన్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ram Charan, Sai Pallavi, Telugu Cinema, Tollywood