RRR Release Date : దసరా కానుకగా ఆర్ ఆర్ ఆర్.. రాజమౌళి అధికారిక ప్రకటన..

RRR release date confirmed Photo : Twitter

RRR Release Date : ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో ఎన్టీఆర్, చరణ్‌లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

  • Share this:
    ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో ఎన్టీఆర్, చరణ్‌లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటిస్తున్నారు. మరో ప్రధాన పాత్రలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ నటిస్తున్నాడు. దీంతో ఈ మూవీపై దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ నెలకొని ఉండగా, అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రాజమౌళి తెరకెక్కిస్తున్నారు.ఇక ఎప్పటినుండో ఆర్ ఆర్ ఆర్ కొత్త రిలీజ్ డేట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను రాజమౌళి అధికారికంగా ప్రకటించాడు. ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఇక లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ ఆలస్యం కావడం తో ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ లో చిత్ర యూనిట్ బిజీ గా ఉంది. లాక్ డౌన్ తొలగించిన వెంటనే ఆర్ ఆర్ ఆర్ చిత్రబృందం 50రోజుల షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఆ తర్వాత ఈ చిత్రం కోసం బాలీవుడ్ నటి అలియా భట్ ఇటీవల ఆర్ ఆర్ ఆర్ టీమ్‌తో జాయిన్ అయ్యింది. ఇప్పటికే ఆలస్యం కావడంతో శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు టీమ్. ఈ సినిమాలో ఆమె రామ్ చరణ్ కు జోడిగా నటిస్తోంది.


    ఇక ఈ సినిమా ప్రధాన తారాగణం విషయానికి వస్తే.. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు 'ఆర్ఆర్ఆర్‌'తో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ టాలీవుడ్‌కు పరిచయమవుతుండగా, మరో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గణ్ ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనున్నాడు. ఒలీవియా మోరిస్‌, శ్రియా శరన్‌, ఆలిసన్ డూడీ, రే స్టీవెన్‌సన్‌, సముద్రఖని ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిపంచనున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం, సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. ఇక తాజాగా రిలీజ్ డేట్ సందర్భంగా విడుదలైన పోస్టర్ ఓ రేంజ్‌లో ఉందని చెప్పాలి. ఇటు రామ్ చరణ్, అటు ఎన్టీఆర్‌లు కేక పెట్టిస్తున్నారు. రామ్ చరణ్ గుర్రంపై స్వారీ చేస్తుండగా.. ఎన్టీఆర్ బుల్లెట్‌పై రైడ్ చేస్తున్నాడు.. ఆ పిక్ చూడాటానికి మామూలుగా లేదు.. దీంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published: