Prabhas - Ram Charan : ప్రభాస్ నిర్మాణంలో రామ్ చరణ్ సినిమా.. అధికారిక ప్రకటన..

ప్రభాస్ నిర్మాణంలో రామ్ చరణ్ సినిమా (Twitter/Photo)

Prabhas - Ram Charan : రెబల్ స్టార్ ప్రభాస్‌కు చెందిన యూవీ క్రియేషన్స్‌లో రామ్ చరణ్ హీరోగా సినిమాను విజయ దశమి సందర్భంగా అధికారికంగా ప్రకటించారు.

 • Share this:
  Prabhas - Ram Charan : రెబల్ స్టార్ ప్రభాస్‌కు చెందిన యూవీ క్రియేషన్స్‌లో రామ్ చరణ్ హీరోగా సినిమాను విజయ దశమి సందర్భంగా అధికారికంగా ప్రకటించారు. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనుంది. శంకర్ సినిమా తర్వాత ఈ సినిమా పట్టాలెక్కనుంది. ప్రస్తుతం రామ్ చరణ్.. రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కంప్లీట్ చేశారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్ మరో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే యేడాది జనవరి 7న సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాపై బాలీవుడ్‌, టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. మరోవైపు రామ్ చరణ్ .. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘ఆచార్య’ సినిమాలో కలిసి నటించారు.

  ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీటైన ఈ చిత్రాన్ని వచ్చే యేడాది ఆర్ఆర్ఆర్ తర్వాత ఫిబ్రవరి 4న తెలుగుతో పాటు మిగతా భాషల్లో ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక ప్రభాస్‌కు చెందిన యూవీ క్రియేషన్స్ నాని హీరోగా అల్లు అరవింద్‌తో కలిసి ‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో పాటు.. ప్రతిరోజూ పండగే, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’, రన్ రాజా రన్ వంటి సినిమాలు వచ్చాయి. ఇపుడు రామ్ చరణ్ హీరోగా యూవీ క్రియేషన్స్ భారీ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌ NVR సినిమాతో సంయుక్తంగా తెరకెక్కిస్తోంది. దసరా సందర్భంగా రామ్ చరణ్‌‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసారు.

  ప్రభాప్ ‘UV క్రియేషన్స్‌లో రామ్ చరణ్ సినిమా (Twitter/Photo)


  ఇకపై యేడాదికి ఒక సినిమా తర్వాత మరో సినిమా కాకుండా ఒకేసారి నాలుగైదు ప్రాజెక్ట్‌లను చేయాలనే నిర్ణయానికి వచ్చాడు రామ్ చరణ్. ఇప్పటకే ఆర్ఆర్ఆర్‌తో పాటు కరోనా కారణంగా చాలా గ్యాప్ వచ్చేసింది. అందుకే ఒకేసారి అర డజనుకు పైగా సినిమాలు ఓకే చేసి యేడాదికి మినిమం మూడు సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు రామ్ చరణ్.

  Tollywood Thatha Manavallu : ఎన్టీఆర్ టూ నాగ చైతన్య వయా అల్లు అర్జున్, రానా వరకు టాలీవుడ్‌లో సత్తా చూపెడుతోన్న మనవళ్లు..

  ఇక రామ్ చరణ్‌ శంకర్‌తో చేయబోయే సినిమా వివరాల్లోకి వెళితే..  ఈ సినిమాను శంకర్ (Shankar) పరిమిత బడ్జెట్‌లో తెరకెక్కిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ సినిమాను శంకర్.. ఈ సినిమాను శంకర్ దేశ చట్టాలను ఉపయోగించుకొని కార్పోరేట్ శక్తులు ఏ విధంగా ఎదుగుతున్నాయో తన సినిమాలో చూపించనున్నట్టు సమాచారం. రామ్ చరణ్ ఈ సినిమాలో ఐఏఎస్ అధికారి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఇండియన్ పీనల్ కోడ్‌లోని ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని పలు సెక్షన్లను శంకర్ ఈ సినిమాలో ప్రస్తావించనున్నట్టు సమాచారం.

  Chiranjeevi - Mani Sharma: ఆచార్య సహా చిరంజీవి, మణిశర్మ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఇవే..

  సినిమాను కూడా శంకర్ తనదైన శైలిలో సోషల్ మెసెజ్‌తో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా అర్జున్ నటించిన ‘ఒకే ఒక్కడు’ సినిమాకు సీక్వెల్ అనే సమాచారం జరుగుతోంది.అందులో జర్నలిస్ట్ నుంచి ముఖ్యమంత్రి అయితే... ఇందులో ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర నుంచి సీఎం స్థాయికి ఎదిగే పాత్ర ఉంటుందనేది కోలీవుడ్ (Kollywood) సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇదే స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారా లేదా తెలియాల్సి ఉంది.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: