రామ్ చరణ్ న్యూ లుక్ అదుర్స్.. ఉపాసనతో కలిసి ఎయిర్ పోర్టులో..

రామ్ చరణ్ ప్రస్తుతం RRR సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షెడ్యూల్ ఓ అడవిలో వేగంగా జరుగుతుంది. చాలా సెక్యూరిటీ మధ్య రాజమౌళి అక్కడ కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు. ఈ మధ్యే ఎన్ని..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 13, 2019, 7:51 PM IST
రామ్ చరణ్ న్యూ లుక్ అదుర్స్.. ఉపాసనతో కలిసి ఎయిర్ పోర్టులో..
రామ్ చరణ్ ఫైల్ ఫోటో
  • Share this:
రామ్ చరణ్ ప్రస్తుతం RRR సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షెడ్యూల్ ఓ అడవిలో వేగంగా జరుగుతుంది. చాలా సెక్యూరిటీ మధ్య రాజమౌళి అక్కడ కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు. ఈ మధ్యే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా జూనియర్ ఎన్టీఆర్ సీన్స్ కొన్ని లీక్ అయ్యాయి. దీనిపై చిత్రయూనిట్‌కు కూడా క్లాస్ తీసుకున్నాడు రాజమౌళి. ఇదిలా ఉంటే తాజాగా రామ్ చరణ్ కూడా RRR సినిమా షూటింగ్ కోసం బయల్దేరాడు. ఇందులో అల్లూరి పాత్రలో నటిస్తున్నాడు చరణ్. కొన్ని రోజులుగా ఎన్టీఆర్ ఒక్కడే ఈ చిత్ర షూటింగ్‌లో ఉన్నాడు.
Ram Charan new look goes viral in social media and spotted with his wife in airport pk రామ్ చరణ్ ప్రస్తుతం RRR సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షెడ్యూల్ ఓ అడవిలో వేగంగా జరుగుతుంది. చాలా సెక్యూరిటీ మధ్య రాజమౌళి అక్కడ కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు. ఈ మధ్యే ఎన్ని.. ram charan,upasana kamineni,ram charan facebook,ram charan twitter,ram charan instagram,ram charan upasana konidela,telugu cinema,rrr movie,rrr movie shooting,rrr shooting,రామ్ చరణ్,రామ్ చరణ్ ఉపాసన,రామ్ చరణ్ ఉపాసన కొణిదెల,ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్,తెలుగు సినిమా
రామ్ చరణ్ ఫైల్ ఫోటో

ఇప్పుడు చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ సీన్స్ చిత్రీకరించబోతున్నాడు దర్శకధీరుడు. దీనికోసమే RRR షూటింగ్ కోసం వెళ్తున్నాడు రామ్ చరణ్. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టులో భార్య ఉపాసనతో చరణ్ వెళ్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అక్కడ మెగా పవర్ స్టార్ లుక్స్ కూడా నెట్టింట్లో బాగానే తిరుగుతున్నాయి. కోరమీసాలతో కిరాక్ పుట్టిస్తున్నాడు మెగా వారసుడు. భుజానికి బ్యాగ్ వేసుకుని అలా వేగంగా చిరుతలా నడుచుకుంటూ వెళ్తున్నాడు చరణ్.
Ram Charan new look goes viral in social media and spotted with his wife in airport pk రామ్ చరణ్ ప్రస్తుతం RRR సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షెడ్యూల్ ఓ అడవిలో వేగంగా జరుగుతుంది. చాలా సెక్యూరిటీ మధ్య రాజమౌళి అక్కడ కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు. ఈ మధ్యే ఎన్ని.. ram charan,upasana kamineni,ram charan facebook,ram charan twitter,ram charan instagram,ram charan upasana konidela,telugu cinema,rrr movie,rrr movie shooting,rrr shooting,రామ్ చరణ్,రామ్ చరణ్ ఉపాసన,రామ్ చరణ్ ఉపాసన కొణిదెల,ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్,తెలుగు సినిమా
రామ్ చరణ్ ఫైల్ ఫోటో

ప్రస్తుతం ఈ లుక్.. ఆ ఫోటోలు బాగానే ట్రెండ్ అవుతున్నాయి. ఈ లుక్స్ చూసి అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు. ఈ సినిమా తర్వాత వరసగా స్టార్ డైరెక్టర్స్‌తో సినిమాలకు కమిటయ్యే ఉద్ధేశ్యంలో ఉన్నాడు చరణ్. ఓ వైపు హీరోగా బిజీగా ఉండి.. మరోవైపు నిర్మాతగానూ రచ్చ చేస్తున్నాడు చరణ్. చిరంజీవి, కొరటాల సినిమాను ఈయనే నిర్మిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ మొదలుకానుంది.
Published by: Praveen Kumar Vadla
First published: December 13, 2019, 7:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading