ఇప్పట్లో రామ్ చరణ్.. అప్పట్లో నాగార్జునకు మాత్రమే ఈ రికార్డు సాధ్యమైంది..

నాగార్జున, రామ్ చరణ్ (File/Photo)

ఇప్పట్లో రామ్ చరణ్.. అప్పట్లో నాగార్జునకు మాత్రమే ఆ రికార్డు సాధ్యమైంది. వివరాల్లోకి వెళితే..

 • Share this:
  ఇప్పట్లో రామ్ చరణ్.. అప్పట్లో నాగార్జునకు మాత్రమే ఆ రికార్డు సాధ్యమైంది. వివరాల్లోకి వెళితే.. రామ్ చరణ్.. తండ్రి మెగాస్టార్ చిరంజీవి అడుగుజాడల్లో సినిమాల్లో ప్రవేశించిన తండ్రికి తగ్గ తనయుడిగా రాణించాడు. అంతేకదు నిర్మాతగా తన ఇంటి పేరు మీద  కొణిదెల ప్రొడక్షన్స్ హౌస్‌ను స్టార్ట్ చేసిన తండ్రి చిరుతో  వరుసగా ‘ఖైదీ నంబర్ 150, ‘సైరా నరిసింహా రెడ్డి ’  సినిమాలు నిర్మించాడు. ఇపుడు ముచ్చటగా మూడో చిత్రం ‘ఆచార్య’ను నిర్మిస్తున్నాడు. ఈ రకంగా హీరోగా, నిర్మాతగా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు నాగార్జున విషయానికొస్తే.. ఈయన కూడా తండ్రి నట సమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు బాటలో సినీ రంగ ప్రవేశం చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు నిర్మాతగా అన్నపూర్ణ స్డూడియో పతాకంపై పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఇక నాగార్జున కూడా అప్పట్లో తండ్రి నాగేశ్వరరావు హీరోగా ‘ప్రేమాభిషేకం’ వంటి పలు చిత్రాలను నిర్మించాడు. ఈ రకంగా వీళ్లిద్దరు తండ్రితో సినిమాలు నిర్మించిన హీరోలుగా రికార్డులకు ఎక్కారు. అటు మరో దివంగత హీరో హరికృష్ణ కూడా తండ్రి ఎన్టీఆర్‌ హీరోగా నటించిన పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఈయన ఫుల్ టైమ్ హీరోగా పనిచేయలేదు. ఆ సంగతి పక్కన పెడితే.. నాగార్జున ఒక అడుగు ముందుకేసి తన ఇద్దరు కొడుకులు, మేనల్లుళ్లతో సినిమాలు నిర్మించిన ట్రాక్ రికార్డు ఉంది.

  ram charan nagarjuna rare record in tollywood here are the details,ram charan,nagarjuna,ram charan producer,nagarjuna akkineni producer,ram charan nagarjuna,ram charan chiranjeevi,nagarjuna anr,nagarjuna twitter,ram charan twitter,chiranjeevi twitter,ntr,harikrihna,harikrishna produced films,tollywood,telugu cinema,నాగార్జున,రామ్ చరణ్,రామ్ చరణ్ నాగార్జున,రామ్ చరణ్ నిర్మాత,నాగార్జున నిర్మాత,రామ్ చరణ్ నిర్మాణంలో చిరంజీవి,నాగార్జున నిర్మాణంలో ఏఎన్నాార్,హరికృష్ణ,ఎన్టీఆర్,ఎన్టీఆర్ హీరోగా సినిమాలు నిర్మించిన హరికృష్ణ
  రామ్ చరణ్,నాగార్జున (File/Photos)


  ఈ రకంగా తండ్రి హీరోగా సినిమాలు నిర్మించిన కథానాయకుల లిస్టులో వీళ్లిద్దరు చోటు సంపాదించుకున్నారు. మిగతా హీరోలకు ఈ ఛాన్స్ వస్తుందో రాదో చెప్పలేము. ఏమైనా అప్పట్లో నాగార్జున... ఈ జనరేషన్‌లో రామ్ చరణ్‌కు మాత్రమే ఈ రికార్డు సాధ్యమైంది.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: