Home /News /movies /

RAM CHARAN MEGA POWER STAR WILL ACCEPT SHYAM SINGHA ROY DIRECTOR RAHUL SANKRITYAYAN TA

Ram Charan : మరో క్రేజీ దర్శకుడికి ఓకే చెప్పిన రామ్ చరణ్.. సినిమాల విషయంలో మెగా పవర్ స్టార్ దూకుడు..

రామ్ చరణ్ (Twitter/Photo)

రామ్ చరణ్ (Twitter/Photo)

Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. వరుసగా క్రేజీ డైరెక్టర్స్‌కు ఓకే చెబుతున్నారు. తాజాగా ఈ హీరో లిస్టులో మరో యంగ్ డైరెక్టర్ చేరారు.

    Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. వరుసగా క్రేజీ డైరెక్టర్స్‌కు ఓకే చెబుతున్నారు.  ప్రస్తుతం రామ్ చరణ్.. రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కంప్లీట్ చేశారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్ మరో ముఖ్య పాత్రలో నటించారు. అంతా బాగుంటే..  ఈ సినిమా జనవరి 7న సంక్రాంతి కానుకగా విడుదలై ఉండేది.  కానీ ఓమైక్రాన్ వేరియంట్ కేసులు ఎక్కువ కావడంతో ఈ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేశారు.  ఈ సినిమాపై బాలీవుడ్‌, టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. RRR మూవీని కొత్త రిలీజ్ డేట్ అనేది .. కరోనా కేసుల ఆధారపడి ఉంది. ప్రస్తుతం మన దేశం కరోనా థర్డ్ వేవ్‌లో ప్రవేశించిందని నిపుణులు చెబుతున్నారు. ఫిబ్రవరి వరకు పీక్స్‌కు వెళ్లే అవకాశాలున్నాయి. ఈ సినిమాను ఏప్రిల్‌ 28న బాహుబలి రిలీజ్ రోజున విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు సమాచారం.

    రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్‌’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో ఏర్పడిన గ్యాప్‌ను వరుస సినిమాలు చేయడం ద్వారా పూరించాలనే డెసిషన్ తీసుకున్నారు. మరోవైపు రామ్ చరణ్ .. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘ఆచార్య’ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఆ డేట్‌లో విడుదలవుతుందో లేదో చూడాలి. కరోనా కేసుల నేపథ్యంలో ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

    NBK - Akhanda : బాలకృష్ణ ‘అఖండ’ మూవీ నుంచి ‘జై బాలయ్య’ సాంగ్ విడుదల.. వైరల్ అవుతున్న పాట..

    ఆచార్య, ఆర్ఆర్ఆర్ సినిమాలు పూర్తయ్యాయి. కాబట్టి.. ప్రస్తుతం రామ్ చరణ్ .. తన 15వ సినిమాను శంకర్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఈ సినిమాను శంకర్ సరికొత్త కాన్సెప్ట్‌తో తనదైన శైలిలో తెరకెక్కించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఓ షెడ్యూల్ పూనేలో కంప్లీట్ అయింది. అయితే..శంకర్ ఈ సినిమాకు కాస్తా గ్యాప్ ఇచ్చి కమల్ హాసన్‌తో ‘భారతీయుడు 2’ను కంప్లీట్ చేసి మళ్లీ రామ్ చరణ్ సినిమాను టేకప్ చేసే అవకాశాలున్నాయి.

    ‘శ్యామ్ సింగరాయ్’ దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్‌తో రామ్ చరణ్ మూవీ (File/Photo)


    అటు శంకర్ సినిమా చేస్తూనే.. రామ్ చరణ్ తన నెక్ట్స్ మూవీని ‘జెర్సీ’తో ఆకట్టుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేయనున్నారు. ప్రభాస్‌కు చెందిన యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్పటికే దసరా సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు. త్వరలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాను స్పోర్ట్స్ అండ్ యాక్షన్ నేపథ్యంలో ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.  ఇక గౌతమ్ తిన్ననూరి సినిమాను  శంకర్ సినిమాతో పాటే చేయాలనే ఆలోచనలో ఉన్నారు రామ్ చరణ్.

    Mahesh Babu -Ramesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబుకు సాధ్యం కానీ ఆ రికార్డు.. రమేష్ బాబుకు సాధ్యమైంది..

    ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్’ సినిమాతో ఆకట్టుకున్న రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్నట్టు సమాచారం. రీసెంట్‌గా ఈ సినిమా చూసి రామ్ చరణ్ మెచ్చుకున్న సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో మంచి కథ ఉంటే రాహుల్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేస్తానని  చెప్పాడట. త్వరలో వీళ్ల కాంబినేషన్‌కు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Acharya movie, Ram Charan, RRR, Shyam Singha Roy, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు