Home /News /movies /

RAM CHARAN MEGA POWER STAR FILM CAREER 2022 VERY SPECIAL DUE TO HIS ACT TWO FILM ACHARYA RRR ROUDRAM RANAM RUDHIRAM RELEASE SAME CALENDER YEAR TA

Ram Charan : అలా జరిగితే రామ్ చరణ్ కెరీర్‌లో అంతకంటే అద్భుతం మరోకటి ఉండదు..

రామ్ చరణ్ (File/Photo)

రామ్ చరణ్ (File/Photo)

Mega Power Star Ram Charan: రామ్ చరణ్ ఇన్నేళ్ల కెరీర్‌లో ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైమ్.. అలా జరిగితే రామ్ చరణ్ కెరీర్‌లో అంతకంటే అద్భుతం మరోకటి ఉండదంటున్నారు మెగా ఫ్యాన్స్. 

    Mega Power Star Ram Charan: రామ్ చరణ్ ఇన్నేళ్ల కెరీర్‌లో ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైమ్.. అలా జరిగితే రామ్ చరణ్ కెరీర్‌లో అంతకంటే అద్భుతం మరోకటి ఉండదంటున్నారు మెగా ఫ్యాన్స్.  అంతేకాదు ఇన్నేళ్ల రామ్ చరణ్ ఫిల్మ్ కెరీర్‌లో ఇలా జరగడం ఇదే మొదటిసారి అంటున్నారు మెగాభిమానులు. రామ్ చరణ్ విషయానికొస్తే.. మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘చిరుత’ మూవీతో  టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్డాడు. ఆ తర్వాత ‘మగధీర’తో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. 2007లో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన రామ్ చరణ్..  ఆ తర్వాత ఒకే యేడాదిలో రెండు సినిమాలు మాత్రం రిలీజ్  చేసిన దాఖలాలు లేవు.  ఐతే.. రామ్ చరణ్ హీరోగా కెరీర్ మొదలు పెట్టాకా.. 2008, 2011,2020,2021 కాలెండర్ ఇయర్స్‌లో రామ్ చరణ్ నటించిన సినిమాలేవి విడుదల కాలేదు.

    మరోవైపు 2017లో కూడా చరణ్ హీరోగా నటించిన సినిమా విడుదల కాలేదు. కానీ తన తండ్రి చిరంజీవి హీరోగా రామ్ చరణ్.. నిర్మిస్తూ తెరకెక్కించిన ‘ఖైదీ నెంబర్ 150’లో ఓ పాటలో అతిథి పాత్రలో మెరిసాడు. ఇక చివరగా 2019లో మాత్రం హీరోగా ‘వినయ విధేయ రామ’ సినిమాతో పలకరించాడు. అదే యేడాది తన తండ్రి చిరంజీవి హీరోగా ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా నిర్మాతగా పలకరించారు.

    Chiranjeevi -Pawan Kalyan - Ram Charan: చిరంజీవి బాటలో తొలిసారి ఆ తరహా పాత్రల్లో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్.. మెగా ఫ్యాన్స్ ఖుషీ..


    కానీ ఇప్పటి వరకు ఒకే కాలండర్ ఇయర్‌లో రెండు సినిమాలు విడుదల చేసిన దాఖలాలు మాత్రం లేవు. కానీ 2021లో మాత్రం రామ్ చరణ్ నటించిన రెండు సినిమాలు విడుదల అవుతాయని ఆయన అభిమానులు ఆశించారు. కానీ కరోనా వారి ఆశలపై నీళ్లు చల్లింది. కానీ 2022లో మాత్రం రామ్ చరణ్ నటించిన రెండు సినిమాలు ఒకే కాలండర్ ఇయర్‌లో విడుదల కానున్నాయి.

    ఒకే కాలండర్ ఇయర్‌లో విడుదల కానున్న ఆచార్య, ఆర్ఆర్ఆర్ (Twitter/Photo)


    ఇక తన తండ్రి చిరంజీవితో పూర్తి స్థాయిలో స్క్రీన్ షేర్ చేసుకున్న ‘ఆచార్య’ చిత్రాన్ని ఏప్రిల్ 1న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. మరోవైపు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, అజయ్ దేవ్‌గణ్‌లతో కలిసి నటించిన ‘ఆర్ఆర్ఆర్’ రౌద్రం రణం రుధిరం’ సినిమాను అంతా బాగుంటే.. ఈ పాటికీ రిలీజై ఉండేది. కానీ ఈ సినిమాను మార్చి 18 లేదా ఏప్రిల్ 28న విడుదల చేస్తున్నట్టు రెండు రిలీజ్ డేట్స్ ప్రకటించారు.

    Balakrishna - Akhanda : బాలకృష్ణ ’అఖండ’ ప్రభంజనం.. ఆ నాలుగు భాషల్లో డబ్ కానున్న మూవీ..


    ఇక ఈ సినిమా ఏప్రిల్ 28న బాహుబలి రిలీజైన రోజే విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.   ఈ రకంగా ఒకే కాలండర్ ఇయర్‌లో రామ్ చరణ్ నటించిన రెండు సినిమాలు విడుదల కావడం అనేది ఇదే మొదటిసారి. ఈ రకంగా రామ్ చరణ్ 2022లో రెండు బ్లాక్ బస్టర్స్ ఇవ్వడం పక్కా అని మెగాభిమానులు డిసైడ్ అయ్యారు.

    ఆచార్యలో రామ్ చరణ్ (Twitter/Photo)


    ముఖ్యంగా కొరటాల శివ దర్శకత్వంతో పాటు తండ్రి మెగాస్టార్‌ చిరంజీవితో పూర్తి స్థాయిలో నటించాలనే కోరిక కూడా ‘ఆచార్య’ సినిమాతో నెరవేరింది.  మరోవైపు రామ్ చరణ్ తన కెరీర్‌లో మొదటిసారి ఓ డైరెక్టర్ దర్శకత్వంలో రెండోసారి నటించాడు. అది రాజమౌళి కావడం విశేషం. మొత్తంగా 2022 రామ్ చరణ్ ఫిల్మ్ కెరీర్‌లో వెరీ స్పెషల్ అని చెప్పాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Acharya, Ram Charan, RRR, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు