Ram Charan : కోర మీసం.. పదునైన చూపులతో చురకత్తిలా రామ్ చరణ్..

Ram Charan : రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఆర్ ఆర్ ఆర్‌లో నటిస్తున్నాడు.

news18-telugu
Updated: September 24, 2020, 10:01 AM IST
Ram Charan :  కోర మీసం.. పదునైన చూపులతో  చురకత్తిలా రామ్ చరణ్..
రామ్ చరణ్ Photo : Twitter
  • Share this:
Ram Charan : రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఆర్ ఆర్ ఆర్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో చరణ్‌తో పాటు, ఎన్టీఆర్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమాలో తెలుగు వీరులు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తుంటే ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో అదరగొట్టనున్నాడు. ఎన్టీఆర్‌కు జోడిగా ఇంగ్లీష్ నటి ఒలివియా మోరీస్ నటిస్తుంటే, చరణ్‌కు జోడిగా హిందీ నటి అలియా భట్ నటిస్తోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్, చరణ్‌తో పాటు మరో కీలక పాత్రలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ మూవీపై దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ నెలకొని ఉండగా, అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా జనవరి 08 2021న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా కరోనా కారణంగా ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం వాయిదా పడింది. అది అలా ఉంటే రామ్ చరణ్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో కోర మీసాలతో ఓ ఫోటో పోస్ట్ చేశాడు. అంతేకాదు ఈ సందర్భంగా ఆయన రాస్తూ... ఎప్పుడూ మీ బెస్ట్ కోసం ప్రయత్నించండి అంటూ ట్వీట్ చేశాడు. ఇక అది చూసిన ఆయన అభిమానులు, నెటిజన్స్ లైక్స్ కొడుతూ రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. రామ్ చరణ్ కత్తిలాగా ఉన్నావంటూ పొగుడుతున్నారు. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఫోటోలో చరణ్ లుక్ అల్లూరి గెటప్ లో తీక్షణమైన కంటి చూపుతో ఆకట్టుకుంటుంది.

ఇక ఆర్ ఆర్ ఆర్‌తో పాటు రామ్ చరణ్.. ఆచార్యలో ఓ కీలకరోల్‌లో నటించనున్నాడు. చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో సోషల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న సినిమా ఆచార్య. ఈ సినిమాలో రామ్ చరణ్‌కు జోడిగా రష్మిక నటించనుంది. ఇక చిరంజీవి సరసన కాజల్ నటిస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఓ మాజీ నక్సలైట్ గా కనిపిస్తారని సమాచారం. అంతేకాదు దాదాపు ఓ 30 నిమిషాల నిడివి ఉండే ఆ పాత్ర సినిమాకు హైలెట్‌గా ఉంటుందట. ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో ఆడిపాడింది. దీనికి సంబందించిన ఆ పాటను ఇప్పటికే షూట్ చేసింది చిత్రబృందం. ఆచార్యలో ముందునుండి త్రిషను అనుకుంటే ఆమె ఏవో కారణాల వల్ల ఈ సినిమా నుంచి తప్పుకుంది. దీంతో కాజల్‌ను తీసుకుంది చిత్రబృందం. ఈ సినిమాను చరణ్, నిరంజన్ రెడ్డిలు కలిసి కొణిదెల ప్రోడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.


ఇక అది అలా ఉంటే..ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ తదుపరి సినిమా ఎవరితో ఉంటుందని అభిమానుల్లో ఆసక్తి మొదలైంది.  ఎందుకంటే.. ఓ పక్క ఎన్టీఆర్ అప్పుడే తన నెక్ట్స్ సినిమా త్రివిక్రమ్‌తో ఉంటుందని ప్రకటించాడు. దీంతో రామ్ చరణ్ తదుపరి సినిమాను ఎవరితో చేయనున్నాడు అనే విషయంలో క్లారిటీ లేదు. అయితే తాజాగా వస్తోన్న సమాచారం మేరకు ఆయన తదుపరి సినిమాను యువ దర్శకుడు వెంకీతో కన్ఫామ్ చేశాడని టాక్.  ఛలో, భీష్మ సినిమాలతో భారీ హిట్లు కొట్టి అందరు దృష్టిని ఆకర్షిణించిన దర్శకుడు వెంకీ కుడుముల.. తన తదుపరి చిత్రాన్ని మెగా పవర్ స్టార్‌తో చేయనున్నాడని తెలుస్తోంది. వెంకీ తన కామెడీ టైమింగ్‌తో అదరగొడుతోన్న యువ దర్శకుడు. కామెడీతో పాటు అంతర్లీనంగా ఓ మెజేజ్‌ కూడా ఇస్తుంటాడు తన సినిమాలతో. ఈ లాక్ డౌన్ సమయంలో వెంకీ ఓ అదిరిపోయే కథను సిద్ధం చేశాడట. సిద్ధం చేయటడమే కాదు.. ఈ లాక్‌డౌన్‌ సమయంలో రామ్ చరణ్‌ని కలిసిన వెంకీ కుడుముల తను రాసుకున్న కథను రామ్ చరణ్‌కు చెప్పాడట. వెంకీ చెప్పిన కథకి ఫిదా అయిపోయారట.. కథ బాగా చెప్పడంతో సినిమా చేసేందుకు రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఈ తాజా సినిమా కూడా ఛలో', 'భీష్మ' సినిమాల తరహాలోనే ప్రేమ, వినోదం కలగలిపి ఈ సినిమా కూడా ఉంటుందని సమాచారం.. ప్రస్తుతం వెంకీ పుల్ స్క్రిప్ట్ ని సిద్దం చేసే పనిలో ఉన్నాడట. ఈ సినిమాని యువీ క్రియేషన్స్ నిర్మిస్తుందని సమాచారం. ఈ సినిమాను దసరాకు ప్రారంభిస్తారట. దీనికి సంబంధించి త్వరలో అధికార ప్రకటన వెలువడనుంది. అయితే ఇక్కడ మరోవార్త ఏమంటే రామ్ చరణ్ పూరి దర్శకత్వంలో కూడా చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నాడట. ఆయన ఇటీవల చెప్పిన కథ నచ్చడంతో ఆ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Published by: Suresh Rachamalla
First published: September 24, 2020, 9:41 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading