నాయనమ్మ నుంచి వంటింటి చిట్కాలు నేర్చుకుంటున్న రామ్ చరణ్..

కరోనా మహమ్మారి లాక్ డౌన్ కారణంగా సినీ ఇండస్ట్రీలో షూటింగ్స్ అన్ని రద్దైయాయి. దీంతో సినీ ప్రముఖులంతా ఇంటికే పరిమితమైపోయారు. తాజాగా రామ్ చరణ్ తన ఇంట్లో నాయనమ్మ నుంచి మజ్జిగ నుంచి రెసిపీ ఎలా తయారు చేయాలో చెప్పాడు.

news18-telugu
Updated: May 1, 2020, 12:07 PM IST
నాయనమ్మ నుంచి వంటింటి చిట్కాలు నేర్చుకుంటున్న రామ్ చరణ్..
నాయనమ్మతో రామ్ చరణ్ (Twitter/Photo)
  • Share this:
కరోనా మహమ్మారి లాక్ డౌన్ కారణంగా సినీ ఇండస్ట్రీలో షూటింగ్స్ అన్ని రద్దైయాయి. దీంతో సినీ ప్రముఖులంతా ఇంటికే పరిమితమైపోయారు. అయితే ఈ లాక్ డౌన్ కారణంగా సెలబ్రిటీలు అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. ఇప్పటికే రామ్ చరణ్.. ఇంట్లోనే ఉంటూ భార్య ఉపాసనకు కాఫీ చేయడంతో పాటు వంట వండి పెట్టాడు. అంతకు ముందు రాజమౌళి విసిరిన ‘బీ ది రియల్ మేన్ ఛాలెంజ్’ ను స్వీకరించి ఇంట్లో పనులు చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా రామ్ చరణ్.. ఇంట్లో ఉన్న నాయనమ్మ అంజనా దేవి, అమ్మ సురేఖ నుంచి మజ్జిగ నుంచి వెన్న ఎలా తీయడం అనే దాన్ని నేర్చుకున్నాడు. అంతేకాదు దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ప్రస్తుతం రామ్  చరణ్.. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ప్రోమోకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

First published: May 1, 2020, 12:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading