హోమ్ /వార్తలు /సినిమా /

RRR trailer: రామ్ చరణ్, ఎన్టీఆర్ ‘ట్రిపుల్ ఆర్’ ట్రైలర్ విడుదల.. కన్నుల పండగ కాదు అంతకుమించి..

RRR trailer: రామ్ చరణ్, ఎన్టీఆర్ ‘ట్రిపుల్ ఆర్’ ట్రైలర్ విడుదల.. కన్నుల పండగ కాదు అంతకుమించి..

rrr ట్రైలర్ (RRR trailer)

rrr ట్రైలర్ (RRR trailer)

RRR trailer: ఇండియన్ సినిమా ప్రేక్షకులు అంతా వేచి చూస్తున్న ట్రిపుల్ ఆర్ (RRR trailer) సినిమా ట్రైలర్ విడుదలైంది. వేయి కళ్లతో అభిమానులు మాత్రమే కాదు.. కామన్ ఆడియన్స్ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత దీనికోసం రెండేళ్లు కాదు..

ఇంకా చదవండి ...

ఇండియన్ సినిమా ప్రేక్షకులు అంతా వేచి చూస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమా ట్రైలర్ విడుదలైంది. వేయి కళ్లతో అభిమానులు మాత్రమే కాదు.. కామన్ ఆడియన్స్ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత దీనికోసం రెండేళ్లు కాదు.. మరో రెండేళ్లు ఆగమన్నా ఆగేలా ఉన్నారు ప్రేక్షకులు. ఎందుకంటే సినిమా అంత ప్రతిష్టాత్మకంగా ఉంది.. అందులో విజువల్స్ చూస్తుంటే మన తెలుగు సినిమా స్థాయిని రాజమౌళి ఏ స్థాయికి పెంచేసాడో మరోసారి అర్థమైపోతుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌- రౌద్రం రణం రుధిరం’ (RRR) ట్రైలర్‌ డిసెంబర్ 9 ఉదయం విడుదల చేసారు. 3 నిమిషాల 7 సెకన్లు ఎప్పుడు అయిపోయిందో అర్థం కాలేదు.. అలాగే ట్రైలర్ అంతా ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్‌ సీక్వెన్స్‌లు, రోమాలు నిక్కబొడిచే సన్నివేశాలు, ప్రతి భారతీయుడిలో స్వాతంత్య్ర కాంక్ష్యను రగిలించే డైలాగులతో అదిరిపోయింది. ట్రైలర్‌ ఆద్యంతం అదరహో కాదు.. అంతకుమించి అనేలా సాగింది.

అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌ (Ram Charan)‌, గోండు వీరుడు కొమురం భీమ్‌గా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ (NTR) నటన చూడటానికి రెండు కళ్లూ సరిపోవడం లేదు. ‘భీమ్‌.. ఈ నక్కల వేట ఎంతసేపు.. కుంభస్థలాన్ని బద్దలుకొడదాం రా’ అంటూ రామ్‌చరణ్‌ చెప్పే డైలాగ్‌ ట్రైలర్‌కు హైలైట్. ఇక పులి ఎదురుగా ఎన్టీఆర్ కూడా దాని మొహంలో మొహం పెట్టి గట్టిగా అరవడం మరో హైలైట్. రాజమౌళి ఈ సినిమా కోసం నాలుగేళ్లు ఎందుకు తీసుకున్నాడో ట్రైలర్ చూసిన తర్వాత అర్థమవుతుంది. ట్రైలర్‌లో చాలా వరకు ఎన్టీఆర్, చరణ్ కలిసున్న సన్నివేశాలే ఉన్నాయి.

బాలీవుడ్‌ హీరోయిన్ ఆలియా భట్‌, హీరో అజయ్ దేవ్‌గన్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. ఇందులో ఆమె చరణ్‌కు జోడీగా సీత పాత్రలో అలియా కనిపిస్తుంది. హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌.. తారక్‌కు జోడీగా నటించింది. ప్రపంచ వ్యాప్తంగా పేరున్న నటులు చాలా మంది ఇందులో ఉన్నారు. తెలంగాణ యాసలో ఎన్టీఆర్ అదరగొట్టాడు.. అల్లూరిగా రామ్ చరణ్ కేక పెట్టించాడు. దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు దానయ్య నిర్మాత. ఎంఎం కీరవాణి స్వరాలు అందిస్తున్నాడు. పాన్‌ ఇండియా చిత్రంగా నిర్మితమైన RRR సినిమా సంక్రాంతి కానుకగా 2022 జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Rrr movie, Rrr trailer, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు