ఆ విషయంలో ఎన్టీఆర్‌ను చాలా మిస్ అవుతాను : రామ్ చరణ్..

రామ్‌ చరణ్‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఆర్ ఆర్ ఆర్ గురించి, తన స్నేహితుడు తారక్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

news18-telugu
Updated: January 18, 2020, 10:47 AM IST
ఆ విషయంలో ఎన్టీఆర్‌ను చాలా మిస్ అవుతాను : రామ్ చరణ్..
Twitter
  • Share this:
రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న భారీ ప్రాజెక్టు ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ తెలిసిందే. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీమ్‌గా తారక్‌ కనిపించనున్నారు. అది అలా ఉంటే చరణ్ తాజాగా ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ.. ఆర్ ఆర్ ఆర్ గురించి, తారక్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అల్లూరి పాత్ర గురించి మాట్లాడుతూ.. అల్లూరి సీతారామరాజు పాత్ర చాలా కీలకం. ఇది ఎంతో పవర్‌ఫుల్‌ పాత్ర, దాన్ని నేను పోషిస్తుండటం గౌరవంగా భావిస్తున్నా. అంతేకాదు ఆయనలా కనిపించేందుకు ఎంతో కష్టపడ్డానన్నారు. తారక్‌తో రిలేషన్ షిప్ గురించి మాట్లాడుతూ.. ‘మన్నెంలో అల్లూరు సీతారామరాజు ఎలాగో.. తెలంగాణలో కొమరం భీమ్‌ అలా.. ఎన్టీఆర్‌ టపాస్ లాంటివాడు. ఎంతో ఎనర్జిటిక్‌. ఎన్టీఆర్ సెట్‌లో ఉంటే చాలా సరదా, సందడిగా ఉంటుంది. తారక్ నా చుట్టుపక్కల లేకపోతే.. అతన్ని మిస్‌ అవుతున్న భావన కలుగుతుందన్నారు. అందుకే ఇద్దరి కాంబినేషన్లో సీన్స్ ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తూ ఉంటా అని తెలిపారు. ఈ సినిమాలో చరణ్ సరసన హిందీ నటి అలియా భట్‌ నటిస్తోండగా... ఎన్టీఆర్‌ సరసన ఇంగ్లీస్ నటి ఒలివియా మోరీస్‌ నటిస్తోంది. దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. కీరవాణీ సంగీతం అందిస్తున్నాడు.

అదిరిన శ్రద్ధా కపూర్ లేటెస్ట్ హాట్ ఫోటో ‌షూట్..


First published: January 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు