హోమ్ /వార్తలు /సినిమా /

Ram Charan: ఆ ఇద్దరి సినిమాలు అస్సలు మిస్ కాను.. రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Ram Charan: ఆ ఇద్దరి సినిమాలు అస్సలు మిస్ కాను.. రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Ram Charan (Photo twitter)

Ram Charan (Photo twitter)

Golden Globes Awards 2023: గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఫంక్షన్ కోసం యూఎస్ వెళ్లిన రామ్ చరణ్.. తాజాగా అక్కడి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా విడుదలై గ్రాండ్ సక్సెస్ సాధించింది RRR సినిమా. ఈ మూవీతో మరోసారి తెలుగోడి సత్తా ఎల్లలు దాటింది. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr) పోటీపడి నటించారు. ఓ విజువల్ వండర్ గా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమాకు అవార్డుల వర్షం కురుస్తోంది.

ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక అవార్డ్స్ గెలుచుకున్న RRR మూవీ రీసెంట్ గా గోల్డెన్ గ్లోబ్ అవార్డు పొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమా లోని నాటు నాటు పాటకు గాను గోల్డెన్ గ్లోబ్ అవార్డును సంగీత దర్శకుడు కీరవాణి అందుకున్నారు. దీంతో ఈ సినిమా యూనిట్ అంతా తెగ సంబరపడుతోంది. అయితే ఈ అవార్డు ఫంక్షన్ కోసం యూఎస్ వెళ్లిన రామ్ చరణ్ .. తాజాగా అక్కడి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పారు.

RRR సినిమాలోని నాటు నాటు పాటను ఉక్రెయిన్ లో చిత్రీకరించామని చెప్పిన రామ్ చరణ్.. ఆ పాట షూటింగ్ సమయంలో ఎదుర్కొన్న సవాళ్ళను వివరించారు. ఈ సాంగ్ షూటింగ్ సమయంలో తాను గాయపడ్డానని చెప్పారు. దీంతో దాదాపు మూడు నెలలు సెట్‌కు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకున్నానని, ఆ తర్వాత వచ్చి నేరుగా ఉక్రెయిన్ వెళ్లి నాటు నాటు షూటింగ్ లో పాల్గొన్నానని తెలిపారు.

హాలీవుడ్ నటులు బ్రాడ్ పిట్, టామ్ క్రూజ్ తనకు స్ఫూర్తి అని చెప్పిన రామ్ చరణ్.. ఆ ఇద్దరి సినిమాలు అస్సలు మిస్ కానని తెలిపారు. వాళ్ళను ఎన్నో ఏళ్లుగా చూస్తున్నానని.. ఏజ్ పెరుగుతుంటే మెరుగుపడుతూ అభిమానులను పెంచుకుంటున్నారని చెప్పారు రామ్ చరణ్. RRR సినిమా తర్వాత వరుస సినిమాలను లైన్ లో పెట్టారు రామ్ చరణ్. శంకర్ దర్శకత్వంలో RC15 పేరుతో ఓ సినిమా చేస్తున్న ఆయన.. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రాబోతున్న 50వ సినిమా కావడంతో దిల్ రాజు ఈ మూవీపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట. ఈ చిత్రంలో జ‌యరామ్‌, అంజ‌లి, సునీల్, శ్రీకాంత్‌, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

First published:

Tags: Ram Charan, RRR, Tollywood

ఉత్తమ కథలు