హోమ్ /వార్తలు /సినిమా /

Ram charan: రాజమౌళిపై రామ్ చరణ్ ఫీలింగ్స్.. సింగిల్ లైన్‌లో ఒకే ఒక్క మాట!!

Ram charan: రాజమౌళిపై రామ్ చరణ్ ఫీలింగ్స్.. సింగిల్ లైన్‌లో ఒకే ఒక్క మాట!!

Rajamouli Ram charan Photo Twitter

Rajamouli Ram charan Photo Twitter

Ram Charan Rajamouli: తాజాగా జక్కన్నపై సింగిల్ లైన్ లో తన మనసులో మాట చెప్పారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ మేరకు ట్విట్టర్ లో ఆయన పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలుగోడి సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) సొంతం. ఓ తెలుగు సినిమాతో వరల్డ్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించిన ఏకైక దర్శకుడు రాజమౌళి. ఆయన రూపొందించిన బాహుబలి (Bahubali), RRR సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ చేత భేష్ అనిపించుకున్నాయి. ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ పెంచేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా జక్కన్నపై సింగిల్ లైన్ లో తన మనసులో మాట చెప్పారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan). ఈ మేరకు ట్విట్టర్ లో ఆయన పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.

ఇటీవలే గ్రాండ్ గా విడుదలై ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఎంతగానో అలరించిన RRR సినిమాను లాస్‌ ఏంజెల్స్‌లో జరుగుతున్న బీయాండ్‌ ఫెస్ట్‌లో(Beyond Fest భాగంగా టీసీఎల్‌ ఛైనీస్‌ థియేటర్‌ (ఐమాక్స్‌)లో ప్రదర్శించారు. ఈ స్పెషల్ స్క్రీనింగ్‌కు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి సైతం హాజరై సందడి చేశారు. RRR ప్రదర్శితం కాబోతున్న స్క్రీన్ ముందుకు వచ్చి అక్కడి ప్రేక్షకులకు అభివాదం చేశారు జక్కన్న. రాజమౌళిని చూసి అక్కడి పబ్లిక్ అంతా ఈలలతో గోల పెట్టడం ఆయన ఖ్యాతికి నిదర్శనం అయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

ఈ నేపథ్యంలో సదరు వీడియోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసిన రామ్ చరణ్ .. వన్‌ అండ్‌ ఓన్లీ.. ఎస్‌ఎస్‌ రాజమౌళి సర్‌ అంటూ ట్యాగ్ చేశారు. ఇది చూసి మెగా అభిమానులతో పాటు రాజమౌళి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఒక తెలుగు దర్శకుడికి అమెరికాలోని థియేటర్‌లో ఇలాంటి ఘన స్వాగతం లభించడం నిజంగా గొప్ప విషయం అంటున్నారు సినీ విశ్లేషకులు.

భారీ రేంజ్ లో పాన్ ఇండియా సినిమాగా రూపొందించిన RRR మూవీలో రామ్ చరణ్, ఎన్టీఆర్ పోటాపోటీగా నటించారు. ఇద్దరికీ సమ ప్రాధాన్యత ఇస్తూ రాజమౌళి టేకింగ్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ భారీ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించగా.. అజయ్ దేవగన్ కీలక పాత్ర పోషించారు. బడా నిర్మాత DVVV దానయ్య నిర్మించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి చరిత్ర సృష్టించింది. టాలీవుడ్ నుంచి ఇలాంటి భారీ సినిమాలు మరిన్ని రావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

Published by:Sunil Boddula
First published:

Tags: Ram Charan, RRR, SS Rajamouli

ఉత్తమ కథలు